ETV Bharat / health

బీపీ​ కంట్రోల్లో ఉండాలా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!

-అధిక రక్తపోటు నియంత్రణలో ఉండాలా? - పలు సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

High Blood Pressure
High Blood Pressure (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : February 27, 2026 at 3:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Blood Pressure Control Tips: హైపర్‌టెన్షన్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ప్రస్తుతం దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇందుకు శారీరక శ్రమలేకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం, ఒబెసిటీ, నిద్రలేమి, ఒత్తిడి వంటివి ప్రధాన కారకాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశము లేకపోలేదు. కాబట్టి, ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ, డాక్టర్ సలహాలు పాటిస్తే అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

ఒకే సమయానికి పడుకోవడం, లేవడం : ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. సరైన నిద్ర నియమావళిని పాటించని వారితో పోలిస్తే, ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రించి, మేల్కొనే వారిలో బీపీ అదుపులో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రశాంతమైన నిద్ర కోసం అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకోవడం, గది ఉష్ణోగ్రత చల్లగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, నిద్రపోయే ముందు గది వెలుతురు తగ్గించుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

కాఫీ తాగితే లివర్ క్యాన్సర్ దూరం! - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

DASH డైట్ : ఆరోగ్యకరమైన ఆహారం బీపీ నియంత్రణలో ఉంచుకునేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. DASH ఆహారం అధిక రక్తపోటు కోసం ఉత్తమ ఆహారంగా పేరు పొందిందని National Heart, Lung, And Blood Institute అధ్యయనం పేర్కొంది. DASH డైట్ ప్రధానంగా ఉప్పు, చక్కెర, అధిక కొవ్వు ఉన్న పాల పదార్థాలు, నూనె వస్తువులను తగ్గించడంపై దృష్టి పెడుతుందంటున్నారు నిపుణులు. ఈ డైట్​లో పండ్లు, చేపలు, తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాల పదార్థాలు, తృణధాన్యాలు, కూరగాయలు, పప్పుధాన్యాలు వంటివి ఉంటాయని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం : వారానికి కనీసం 150 నిమిషాల పాటు మధ్యస్థ స్థాయి శారీరక శ్రమ చేయాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, యోగా, వెయిట్ లిఫ్టింగ్ లేదా మీకు ఆసక్తి ఉన్న ఏదైనా కార్యాచరణను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. తద్వారా, శారీరకంగా చురుకుగా ఉండటంతో పాటు బీపీ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, అదనపు శక్తి లభిస్తుందని, మానసిక స్థితి మెరుగుపడుతుందని, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతాయని పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల అధిక రక్తపోటు 5 నుంచి 8 mm Hg వరకు తగ్గుతుందని mayoclinic అధ్యయనం పేర్కొంది.

ఒత్తిడి : దీర్ఘకాలిక ఒత్తిడి.. నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని University of Rochester Medical Center అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం, యోగ, 7 గంటలు నిద్రపోవడం, నచ్చిన పనులు చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చంటున్నారు నిపుణులు.

టైంకి మందులు వేసుకోవడం : జీవనశైలి మార్పులు మందులకు ప్రత్యామ్నాయం కాదంటున్నారు నిపుణులు. బీపీని నియంత్రణలో ఉంచుకోవడానికి డాక్టర్ ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటున్నారు. అలాగే, తరచు బీపీ పరీక్షించుకోవడం, డాక్టర్ సూచించిన విధంగా మందులను క్రమం తప్పకుండా వాడాలని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఒత్తిడిని గుర్తించడమే అసలు సమస్య? - మహిళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?

"బ్రేక్‌ ఫాస్ట్" మానేస్తున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!