ETV Bharat / health

"నిద్ర లేమి" సమస్య - స్వల్ప మార్పులతో ఎన్నో ప్రయోజనాలు!

ప్రశాంతమైన నిద్ర కావాలా? - క్వాలిటీ నిద్రకోసం టిప్స్ సూచిస్తున్న ఎక్స్​పర్ట్స్​

healthy sleep habits
healthy sleep habits (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : April 8, 2026 at 4:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Simple Habits for Better Sleep : ఈ రోజుల్లో జీవనశైలిలో ఒత్తిడితో పాటు మొబైల్ ఫోన్ వంటి గ్యాడ్జెట్లను విరివిగా వినియోగించడం వల్ల చాలామంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. తద్వారా శారీరకంగా, మానసికంగా పలు ఆరోగ్య సమస్యల పాలవుతున్నారు. అయితే, మన రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

సమయపాలన ముఖ్యం : చాలామంది తమ బిజీ లైఫ్​లో పడిపోయి వేళకు నిద్రపోవడం మర్చిపోతున్నారు. అయితే, ప్రశాంతమైన నిద్ర కోసం రోజూ ఒక సమయం పెట్టుకుని ఆ సమయానికే నిద్రపోవడం, నిద్ర లేచే విషయంలోనూ సమయపాలన పాటించడం మేలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా, చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు వయసునూ దాచేయచ్చని పేర్కొంటున్నారు. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలని sleepfoundation పేర్కొంది.

గోరువెచ్చటి నీళ్లతో : నిద్రపోయే ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని National Library of Medicine పేర్కొంది. అయితే, ఆ నీళ్లలో కొన్ని వేపాకులు వేసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వేపాకులు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంతో పాటు రోగనిరోధక శక్తినీ మెరుగుపరుస్తాయట. అలాగే, స్నానం చేసే నీటిలో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్​ను కలుపు కొంటే తాజాదనం సొంతమవుతుంది.

అరుదైన వ్యాధి "పోర్ఫిరియా" - సూర్యున్ని చూస్తే ఏం జరుగుతుంది? ఎవరికి వస్తుందో తెలుసా?

నెయ్యితో మర్దన : కొందరు గ్యాస్, పొట్ట, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వారు రాత్రిపూట సరిగా నిద్రపోలేరు. ఇలాంటి వారు అరికాళ్లకు నెయ్యితో మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. అలాగే, ఆందోళన, అలసటగా ఉన్నప్పుడు కూడా ఈ పద్ధతి ద్వారా త్వరితగతిన ఉపశమనం పొందవచ్చట.

ఇవి కూడా :

  • ప్రశాంతమైన నిద్ర కోసం ఈ అలవాట్లతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • నైట్​ టైం భోజనానికి, నిద్ర పోవడానికి మధ్య కనీసం రెండు లేదా మూడు గంటలు సమయం ఉండేలా చూసుకోవాలి.
  • నిద్ర పోవడానికి 60 నిమిషాల ముందు నుంచే మొబైల్ ఫోన్లు, లాప్​టాప్ లాంటి గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయాలి.
  • నిద్రపోయే గదిలో సరైన వెంటిలేషన్ ఉండడంతో పాటు చీకటిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా ఇష్టం లేనివారు తక్కువ వెలుతురు వచ్చే లైట్ ఏర్పాటు చేసుకోవచ్చు.
  • నిద్ర పట్టకపోతే మంచానికి దూరంగా వచ్చి కాసేపు అటూ ఇటూ తిరగడం, నచ్చితే ఓ పుస్తకం చదవడం, సంగీతం వినడం లాంటివి చేయాలని sleepfoundation పేర్కొంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"ఎముకలు బలహీనమవుతున్నాయా?" - తినే ఆహారం కూడా ప్రభావితం చేస్తుందని తెలుసా?

కిడ్నీ ఫెయిల్యూర్​ వార్నింగ్స్ - లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?