ETV Bharat / health

వర్షాకాలంలో అనారోగ్యం ముప్పు ? - "ఆకుకూరలు, బజ్జీలు, పకోడీలతో కాస్త జాగ్రత్త"

జలుబు, దగ్గు, గొంతు వాపు నుంచి ఉపశమనం - సింపుల్ టిప్స్ సూచిస్తున్న నిపుణులు!

rainy season
rainy season (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : June 15, 2026 at 5:11 PM IST

3 Min Read
Choose ETV Bharat

Healthy Foods for Immune System : వర్షాకాలం వచ్చిందంటే చాలు, జీర్ణక్రియ కొంచెం మందగిస్తుంది. జలుబు, దగ్గు, జ్వరాలు మన మీద దాడి చేస్తుంటాయి. ఈ క్రమంలో ఇలాంటి అనారోగ్య సమస్యల బారినపడకూడదంటే- రోగనిరోధక శక్తిని పెంచే, తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారమే ఔషధమని గుర్తించి కొన్ని నియమాలు పాటించాలంటున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

ఆరోగ్య రక్ష : పసుపు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం వంటి పదార్థాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలు జలుబు, దగ్గుల నుంచి రక్షణ కల్పిస్తాయంటున్నారు నిపుణులు. జలుబు, వికారం, ఆర్థరైటిస్, మైగ్రేన్లు, రక్తపోటు వంటి అనేక వ్యాధుల చికిత్సకు అల్లంను వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారని National Library of Medicine పేర్కొంది.

సిరి ధాన్యాలు : జొన్నరొట్టె, కొర్ర అన్నం, రాగి సంగటి ఇలాంటివి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్​ను సమతౌల్యం చేయడంలో సాయపడతాయి. అందుకే, ఈ చిరుధాన్యాలను ఆరోగ్యసిరి అనడంలో అతిశయం లేదు.

వేడివేడిగా : వర్షాకాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు వేడివేడిగా ఉండాలి. అవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయంటున్నారు నిపుణులు. గొంతు, జలుబు సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, జీర్ణక్రియ మెరుగుపడుతుందట.

న్యూస్ పేపర్లో ప్యాక్​ చేసిన ఫుడ్స్​ తింటున్నారా? - ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

ప్రొటీన్లు : శనగ, పెసర, కందిపప్పు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయంటున్నారు నిపుణులు. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందట.

పండ్లు : యాపిల్, బొప్పాయి, అరటి, దానిమ్మ, జామ తదితర పండ్లు తినడం వల్ల సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి బలం చేకూరి, అలసట తగ్గుతుందట. యాపిల్ శక్తిని సరఫరా చేయడమే కాకుండా శరీరంలో పెరుగుదల, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు మొదలైన అనేక ముఖ్యమైన ప్రక్రియలలో కూడా పాల్గొంటాయని National Library of Medicine పేర్కొంది.

షూటైన రసం : గ్లాసున్నర నీళ్లలో కొన్ని టొమాటో ముక్కలు, తగినంత అల్లం తరుగు, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, పసుపు వేసి మరిగించి.. తాలింపు వేయాలట. చివర్లో కొత్తిమీర జోడించాలి. ఇలా చేస్తే షూటైన రసం తయారైపోతుంది. ఇది జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వీటికి చెక్ పెట్టేయండి : పకోడీలు, బజ్జీలు లాంటివి ఈ సీజన్​లో తర్వగా జీర్ణం కావని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. కూరలు అవసరమైనంతే వండుకోవడం మంచిదట. ఎక్కువ మోతాదులో వండి, ఫ్రిజ్​లో నిల్వ చేసి తొనొద్దు. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే కానీ, వాటికి పురుగు చేరుతుంది కాబట్టి, దూరంగా ఉంటేనే మేలు.

వీటితో జాగ్రత్త : అనాస, బొప్పాయి తదితర పండ్లను ముక్కులుగా కోసి అమ్ముతుంటారు. వాటి మీద ఈగలు వాలతాయి. అలాగే, వాతావరణంలో తేమ వల్ల బ్యాక్టీరియా చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. దుమ్ము, ధూళితో అవి కలుషితమౌతాయట. అవి తింటే.. జలుబు, జ్వరాలు రావొచ్చు. అలాగే, చల్లటి పానీయాలతో దగ్గు, జలుబు వంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండటం మంచిది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బరువు తగ్గేందుకు "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్" - వీరు మాత్రం అస్సలు చేయొద్దట!

మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలో తెలుసా?