ETV Bharat / health

'వరద ఉరవడి'కి దూరం, దూరం! - దరిచేరే ఆరోగ్య సమస్యలు అనేకం!

వరద ముప్పు - తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు ఉన్నాయంటున్న నిపుణులు!

Health Precautions During Floods
Health Precautions During Floods (PTI)
author img

By ETV Bharat Health Team

Published : July 21, 2026 at 3:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

Health Precautions During Floods and Heavy Rain : వరదలు అనేవి ప్రకృతి సృష్టించే అత్యంత వినాశకరమైన విపత్తులలో ఒకటి. ఇవి మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అధిక వర్షాల వల్ల చుట్టూ నీరు చేరడం వల్ల అడుగుతీసి అడుగు వేయడమే కష్టమే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తినడానికి తిండి ఉండదు. తాగడానికి మంచినీరు అందుబాటులో ఉండదు. ఈ వరదల కాలంలో ముంచెత్తే ఆ నీటిలో హానికరమైన పదార్థాలు చేరొచ్చు. పాము, తేళ్లు లాంటి విష పురుగులూ ఉండొచ్చు. ఇలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా ఉరవడిలోకి వెళితే అనుకోని ఉపద్రవాలూ తలెత్తొచ్చు. అంతేకాదు, వరద మిగిల్చిన బురదలోనూ ఎన్నో ప్రమాదాలు దాగుంటాయి.

Health Precautions During Floods
Health Precautions During Floods (WHO)

అవి అనర్థాలు : వరద నీటిలో కొట్టుకొచ్చే రసాయన, పారిశ్రామిక అవశేషాలు మంచి నీటిని కలుషితం చేస్తాయి. అంతేకాదు, నీళ్లలో ఉండే గాజు ముక్కలు, ఇంజక్షన్ సూది లాంటివి నడిచే వారికి గుచ్చుకుంటే ప్రమాదకరంగా మారొచ్చు. ఎరువులు, పురుగు, కలుపు మందుల అవశేషాలు ఆ నీటిలో ఉంచొచ్చు. ఫార్మాస్యూటికల్స్, డ్రెయిన్ క్లీనర్లు, వైద్య వ్యర్థాలు, డ్రెస్సింగ్​లు, ఆటో మొబైల్, ద్రవాలు, వంటివి చాలా హానిచేస్తాయి. హెవీ మెటల్స్, హైడ్రోకార్బన్ల, రంగులు, ఆమ్లాలు, రేడియో యాక్టివ్ పదార్థాలతో కూడిన నీటితో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే, ఆర్సెనిక్, క్రోమియం, పాదరసం వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలను కలిగి ఉండే బొగ్గు బూడిద వ్యర్థాలు ఉండవచ్చు.

వర్షాకాలంలో కామెర్ల ముప్పు - ఈ జాగ్రత్తలు పాటించాలట!

వ్యాధుల ముప్పు : వరద నీటిలో ఉండే ఈ-కొలై వంటి బ్యాక్టీరియా తీవ్ర జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఆ నీరు కళ్లు, చెవుల్లోకి చేరినా తీవ్ర ఇబ్బందికరమని చెబుతున్నారు. చేతులు, కాళ్లులకు చిన్నగాయం ఉన్నా బ్యాక్టీరియా చేరుతుందట. అంతేకాకుండా, శ్వాసకోశ సమస్యలతో పాటు కణజాలాన్ని దెబ్బతీసే తీవ్ర చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదమూ ఉంది. నీటిలో ఉన్న కీటకాలూ ప్రమాదాలను సృష్టిస్తాయి.

Floods
Floods (ETV Bharat)

ఈ ఉరవడి చాలా ప్రమాదం : లోతు తక్కువగా ఉందని వరద నీటితో నిర్లక్ష్యం వద్దని, పారే నీటిలో వాహనం నడపొద్దు. కొత్త రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. వరదల తాకిడికి పాములు, ఎలుకలు కొట్టుకొస్తుంటాయి. ఒకవేళ అవి బతికి ఉంటే కాటేసే అవకాశం ఉంది. అవి చనిపోయి ఉంటే కుళ్లిపోయిన కళేబరాలు వ్యాధులకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటి ద్వారా ఫంగస్ వృద్ధి చెందుతుందంటున్నారు.

ఒకవేళ వరదనీరు ఇంట్లోకి వస్తే క్యాబిన్లు, గోడ అంచులు, కార్పెట్ల కింద, ఫర్నిచర్, ఫ్యాబ్రిక్​లపై బూజు పెరిగే అవకాశం ఉంది. ఇది త్వరగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో శ్వాసకోశ సమస్యలు రావొచ్చట. వర్షాలు, వరదల సమయంలో దోమలు వాటి గుడ్లు కొట్టుకుపోతాయి. కానీ, ఒకటి లేదా రెండు వారాలకు మళ్లీ మొదలవుతాయి. కాబట్టి, నీరు నిలిచే మురుగు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, బకెట్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి.

Health Precautions During Floods
Health Precautions During Floods (CDC)

అడుగేస్తున్నారా? :

  • వరద నీటిలో దిగాల్సి వస్తే లాంగ్ స్లీవ్స్, వాటర్​ప్రూప్ బూట్లు ధరించాలి.
  • చిన్నగాయమైనా సరే వరద నీటిలో అడుగేసే ముందు వాటర్ ప్రూఫ్ బ్యాండేజి వేసుకోవాలి.
  • గాయం తడిస్తే వెంటనే సబ్బు, శుభ్రమైన నీటితో శానిటైజ్ చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజ్, వెబ్ వైప్స్ వినియోగించాలి.
  • వరద నీటిలో తడిచిపోయిన దుస్తుల్ని అత్యధిక ఉష్ణోగ్రతలో బ్లీచింగ్ లాంటి క్రిమిసంహారకాలతో క్లీన్ చేసుకోవాలి.
  • వరద ద్వారా తాగునీటిలోనూ సూక్ష్మజీవులు ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే పైపుల్లోకి నీటిని కొద్దిసేపు ప్రవహించనీయండి.

పరిశోధన మూలాలు :

https://www.redcross.org/get-help/how-to-prepare-for-emergencies/types-of-emergencies/flood.html?srsltid=AfmBOorIPfMpeGJwl_H3Qg7gyiK-NskMlIXA6bKwlzdzv640zqfINyau

https://www.cdc.gov/floods/safety/floodwater-after-a-disaster-or-emergency-safety.html

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వర్షాకాలంలో అనారోగ్యం ముప్పు! - ఏవి తినాలి? ఏవి తినకూడదో తెలుసుకోండి!

వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!