"నూనె" మార్చడం ఊబకాయంపై పోరులో తొలి అడుగు! - "రైస్ బ్రాన్ ఆయిల్"తో మంచి ఫలితాలు!
కొలెస్ట్రాల్ నియంత్రించే రైస్ బ్రాన్ నూనె - ఇండియన్లకు సరైన ఎంపిక!

Published : January 21, 2026 at 9:13 AM IST
|Updated : January 21, 2026 at 4:49 PM IST
Rice Bran Oil : ఊబకాయులు ముందుగా దృష్టిపెట్టాల్సిన అంశం ఆహారం. నూనెలు మార్చడం ఊబకాయంపై పోరులో తొలి అడుగుగా వర్ణించవచ్చు. అందుకు రోజు వారీ ఆహారంలో నూనెలను కొలిచి వాడుకోవాలి. ఎలాంటి నూనెలు, ఎంత పరిమాణంలో వాడాల్సి ఉంటుందో "ఫిట్ హోగా భారత్" మీకు సహకరిస్తుంది, సాయం చేస్తుంది.
ఫోన్‌లో ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేయడం, నచ్చిన హోటల్ నుంచి ఇష్టమైన ఫుడ్ క్లిక్ చేసి ఆర్డర్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఆహార పదార్థాలు అందుబాటులో ఉండటం, ఆకలికి, అవసరానికి మించి తినడం పెరిగిపోయింది.

సాధారణంగా రోజుకు 1500 నుంచి 1800 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం సరిపోతుంది కానీ, చాలామంది 2000 క్యాలరీలకు మించి తినేస్తున్నారు. సగటున 200 నుంచి 500 క్యాలరీలు అదనంగా తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతోంది. ఫలితంగా బరువు పెరుగుతూ ఊబకాయం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. రోజుకు 1200 క్యాలరీలు మాత్రమే తీసుకుంటే లోటు ఏర్పడి మిగిలిన 300 క్యాలరీల శక్తిని కొలెస్ట్రాల్ నుంచి శరీరం పొందుతుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశాలుంటాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వంట నూనె
రోజువారీ వంటకు తోడు గుండె ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు రైస్ బ్రాన్ నూనెలో ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఉత్తమమైన ఎంపికగా రైస్ బ్రాన్ నూనెను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫారసు చేసింది. రైస్ బ్రాన్ ఆయిల్లో 'ఒరైజనాల్' అనే సహజమైన యాంటీఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.

రైస్ బ్రాన్ నూనె అంటే?
రైస్ బ్రాన్ నూనె అంటే బియ్యం నుంచి తయారైందని అనుకుంటారు కానీ, బియ్యం పైన గోధుమ రంగు పొర నుంచి దీనిని తయారు చేస్తారు. అంటే వడ్ల పొట్టు (తవుడు) నుంచి తయారైన నూనె అని అర్థం. అందుకే చాలా మంది పాలిష్ చేసిన బియ్యం కంటే సెమీ పాలిష్ బియ్యం తింటుంటారు. ఈ నేపథ్యంలో ఫిజికల్లీ రిఫైన్డ్ చేసిన రైస్ బ్రాన్ నూనె ఇప్పుడు ఈ అన్ని లక్షణాలతో మార్కెట్లలో అందుబాటులో ఉంది.
గుండెకు మేలు చేసే "ఒరైజనాల్"
బియ్యంపైన కనిపించే గోధుమ రంగు పొట్టులో ఒరైజనాల్ అనే సూక్ష్మపోషకం శరీరంలో చెడు కొలెస్టెరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఇదే సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా సిఫారసు చేసింది. ఫిజికల్లీ రిఫైన్డ్ చేసిన నూనెలో 10,000+ ppm వరకు ఒరైజనాలు ఉంటే సహజ యాంటీఆక్సిడెంట్ మాదిరిగా పనిచేసి, మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది.

మన వంటకాలకు రైస్ బ్రాన్ నూనె ఎందుకు సరైనది
భారతీయులు ఆహార పదార్థాలను అధికంగా ఉడికించి తీసుకుంటారు. రైస్ బ్రాన్ నూనె 232 డిగ్రీ సెంటిగ్రేడ్ (450 డిగ్రీ ఫారన్‌హీట్)గా ఉండటం వల్ల ఇది భారతీయ వంటకాలకు సరైనదని, డీప్ ఫ్రైకి బెస్ట్ చాయిస్. ఎందుకంటే తక్కువ నూనె పీల్చుకోవడంతోపాటు డీప్ ఫ్రై లాంటి ఆహార పదార్థాలకు మంచిది. సంపూర్ణ ఆరోగ్యానికి కేవలం నూనె మార్చడం ఒక్కటే కాదు! శారీరక వ్యాయామాలు తప్పనిసరి.
రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు
రైస్ బ్రాన్ ఆయిల్ కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ రైస్‌బ్రాన్ ఆయిల్లో 120 కేలరీలు ఉంటాయి. కొవ్వు 14 గ్రాములు, ఒమేగా-6, ఒమేగా-3 లభిస్తాయి. తక్కువ కొలెస్ట్రాల్, గుండెకు మేలు చేసే ఒరైజనాల్ లభిస్తుంది.
ఒరైజనాల్, టోకోఫెరోల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. కణాలు దెబ్బతినకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థవంతంగా పోరాడటానికి సహాయపడతాయి. మధుమేహ బాధితులకు రైస్ బ్రాన్ ఆయిల్ మంచి ఎంపిక. తక్కువ గ్లైసెమిక్ లోడ్, ప్రయోజనకరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటిలోని బ్యాక్టీరియా తగ్గిపోతుంది.
ETV Bharat - Freedom Healthy Cooking Oil నిర్వహిస్తున్న 30 రోజుల Fit Hoga Bharat ఛాలెంజ్‌లో పాల్గొనండి. మరిన్ని వివరాలు, ఆరోగ్యకరమైన వంటకాలు, జీవనశైలి చిట్కాల కోసం ETV భారత్ క్లిక్ చేయండి.

