ETV Bharat / health

తరచూ "తలనొప్పి" ఎందుకు వస్తుందో తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

నీరు తక్కువగా తాగినా, నిద్రలేకపోయిన తలనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు

Reasons Behind Headache
Reasons Behind Headache (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : December 17, 2025 at 2:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Reasons Behind Headache : తలనొప్పి ఏదో సమయంలో అందరినీ వేధిస్తుంది. చిరాకు, సహనం కోల్పోయేలా చేస్తుంది. అయితే, దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కాఫీ తాగడం,పెయిన్ రిలీవర్స్ వాడడం, ఇంకా ఎక్కువైతే డాక్టర్​ని సంప్రదిస్తుంటారు. ఈ క్రమంలో తలనొప్పికి కారణమయ్యే కొన్ని సాధారణ కారణాలు జీవనశైలికి సంబంధించినవి ఉంటాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

Decrease in water content
నీటి శాతం తగ్గటం (Getty Images)

నీటిశాతం తగ్గటం : అకారణంగా తలనొప్పి వేధిస్తుంటే రోజూ ఎన్ని నీళ్లు తాగుతున్నారో ఒకసారి చెక్​ చేసుకోవాలంటున్నారు నిపుణులు. నీటి శాతం తగ్గినా తలనొప్పి రావొచ్చని చెబుతున్నారు. శరీరంలో నీరు తగ్గినప్పుడు మెదడు తాత్కాలికంగా కుంచించుకుపోతుందని పేర్కొంటున్నారు. దీంతో మెదడు పుర్రె నుంచి కాస్త వెనక్కి జారి, నొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తగినన్ని నీళ్లు తాగగానే యథాస్థితికి వస్తుందని తెలియజేస్తున్నారు. ఫలితంగా, నొప్పి తగ్గుతుందని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ తలనొప్పికి కారణమవుతుందని National Institutes of Health అధ్యయనం పేర్కొంది.

సరిగా తినకపోవటం : భోజనం దాటవేయడం వల్ల కూడా తలనొప్పి రావొచ్చంటున్నారు నిపుణులు. తరచూ తలనొప్పితో బాధపడేవారు దీన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. కొందరికి పిండి పదార్థాలు, మిఠాయిల వంటివి తిన్నప్పుడూ నొప్పి వస్తుండొచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటివి గమనిస్తే ఆయా పదార్థాలకు దూరంగా ఉండటం మేలని సలహా ఇస్తున్నారు.

నిద్రలేవగానే ఈ పనులు చేస్తున్నారా? - ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్న నిపుణులు!

Not sitting properly
సరిగా కూర్చోకపోవటం (Getty Images)

భంగిమ దెబ్బతినటం : సరిగా కూర్చోకపోవటం, నిలబడకపోవటం వల్ల తల, మెడ, దవడలు, భుజాల వెనక కండరాలు ఒత్తిడికి లోనవుతాయంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు ఇలాగే ఉండిపోతే అక్కడి నాడుల మీదా ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. ఇది తలనొప్పికి దారితీస్తుందని వివరిస్తున్నారు. పేలవమైన భంగిమ కారణంగా తలనొప్పి రావొచ్చని clevelandclinic అధ్యయనం పేర్కొంది.

సరైన నిద్ర లేకపోయినా : రాత్రిళ్లు గాఢ నిద్రపోకుండా మధ్య మధ్యలో మేల్కొవడం, తగినన్ని గంటలు నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. నిద్రలో దంతాలను బిగించడం, నిద్రకు ముందు గట్టిగా ఉన్న ఆహారాన్ని నమలడం వల్ల తలనొప్పి రావొచ్చని చెబుతున్నారు. అలాగే, దిండు సరిగా లేకపోతే భుజం, మెడ కండరాలు ఒత్తిడికి గురవుతాయని, ఇది తలనొప్పికి కారణమవుతుందని వివరిస్తున్నారు.

ధూమపానం, మద్యం అలవాటు : రాత్రిళ్లు స్మోకింగ్ చేయడం, మద్యాన్ని తీసుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మద్యంతో మూత్రం ఎక్కువగా వస్తుందంటున్నారు. మూత్రంతో పాటు ఉప్పు, విటమిన్లు, ఖనిజాలు బయటకు పోతాయని పేర్కొంటున్నారు. దీంతో శరీరంలో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత అస్తవ్యస్తమై తలనొప్పి రావొచ్చని వివరిస్తున్నారు. ఆల్కహాల్, ముఖ్యంగా రెడ్ వైన్ కారణంగా తలనొప్పి రావొచ్చని mayoclinic అధ్యయనం పేర్కొంది.

Health problems
అనారోగ్య సమస్యలు (Getty Images)

అనారోగ్య సమస్యలు : జలుబు, ఫ్లూ, అలర్జీ కారణంగా ఊపిరి సరిగ్గా అందకపోవడం, వాతావరణ కాలుష్యమూ తలనొప్పికి దారితీస్తాయంటున్నారు నిపుణులు. అలాగే, ఒత్తిడి, ఆందోళన కారణంగా హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. దీంతో తలపట్టేసినట్టుగా ఉండి నొప్పి వస్తుందని పేర్కొంటున్నారు.

సహజంగా ఎలా తగ్గించుకోవాలి :

  • తలనొప్పి వచ్చినప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవాలని nhs.uk అధ్యయనం పేర్కొంది. మజ్జిగ వంటి చలవ చేసే పదార్థాలు తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
  • చెవి దగ్గర, నుదురు, తలపై భాగాల్లో మసాజ్ చేయడం మేలని సూచిస్తున్నారు. ముక్కు పై నుంచి కిందికి మసాజ్ చేయడం, నొక్కడం వంటివి చేయాలని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి తలనొప్పి తగ్గుతుందని వివరిస్తున్నారు. అలాగే, చెవి వెనక మసాజ్​ చేయాలని తెలియజేస్తున్నారు. చెవిని బాగా తిప్పి పైకి కిందకి కొద్దిగా లాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుందని వివరిస్తున్నారు.
  • శ్వాస వ్యాయామం చేయడం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మెదడుకి ఆక్సిజన్ అంది రక్తప్రసరణ బాగా జరుగుతుందని చెబుతున్నారు. దీని వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు.
  • కుర్చీలో కూర్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలంటున్నారు నిపుణులు. పాదాలు నేలకు సమాంతరంగా ఆని ఉండాలని సూచిస్తున్నారు
  • నిద్రకు ఉపక్రమించే ముందు ధూమపానం, మద్యం జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చలికాలంలో "గుండెపోటు"కు కారణాలివే! - వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

జర్నీ చేస్తే వాంతులు, తల తిరుగుతోందా? - ఈ టిప్స్​తో చెక్ పెట్టొచ్చంటున్న నిపుణులు