ETV Bharat / health

"అలర్ట్" శరీరం పంపే సంకేతాలను మీరు గుర్తిస్తున్నారా? - నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమంటున్న నిపుణులు!

థైరాయిడ్, ఫ్యాటీ లివర్, డయాబెటిస్ - శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దంటున్న నిపుణులు!

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 15, 2026 at 4:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

First Signs of Thyroid, Type 2 Diabetes and Fatty Liver : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వివిధ కారణాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో శరీరం పంపే కొన్ని ప్రారంభ సంకేతాలను ఇస్తుందట. కానీ, చాలామంది వీటిని తప్పుగా అర్ధం చేసుకోవడం లేదా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ మార్పులను నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే, ఇవి రాబోయే ఆరోగ్య సమస్యలకు సంకేతాలని చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్యలు : థైరాయిడ్ సమస్య మొదటి సంకేతం బరువు పెరగడం అని చాలా మంది అనుకుంటారు. కానీ, మానసికంగా బలహీనపడటం, చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, మెదడు మొద్దుబారినట్లు అనిపించడం దీని ప్రారంభ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బరువు వచ్చే మార్పులు కంటే మెదడు చాలా ముందే స్పందిస్తుందని అంటున్నారు.

టైప్ 2 డయాబెటిస్ : టైప్ 2 డయాబెటిస్​లో మొదటి సంకేతంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే అని చాలా మంది భావిస్తారు. కానీ, భోజనం చేసిన తర్వాత కూడా సాధారణం కంటే ఎక్కువగా వచ్చే అలసట దీని లక్షణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గుల వల్ల మొదట అలసట వస్తుందని చెబుతున్నారు.

వర్షాకాలంలో వచ్చే వ్యాధులు - ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు!

ఫ్యాటీ లివర్ : ఫ్యాటీ లివర్ ఎల్లప్పుడూ కడుపు నొప్పితోనే బయటపడదు. చిన్నచిన్న పనులకే శక్తి తగ్గిపోవడం, తీవ్రమైన అలసటగా అనిపించినప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య కావచ్చట. కడుపు నొప్పి రావడానికి ముందే శక్తిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు అసాధారణమైన అలసట అనిపిస్తే, ఆ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.

ఆటోఇమ్యూన్ సమస్యలు : చాలామంది ఆటోఇమ్యూన్ వ్యాధిని కీళ్ల నొప్పితో ముడిపెడతారు. కానీ, అది నిజం కాదంటున్నారు నిపుణులు. ఉదయం నిద్ర లేచినప్పుడు శరీరం పట్టేసినట్లు ఉండటం, ఎలాంటి కారణం లేకుండానే వాపు లేదా మంట ఉన్నట్లు అనిపించడం దీని లక్షణాలని చెబుతున్నారు. శరీరం దెబ్బతినడానికి ముందే వాపు నిశ్శబ్దంగా పెరుగుతుందని వివరిస్తున్నారు.

B12 లోపం : ఎలాంటి కారణం లేకుండా చిరాకు, మెదడు మొద్దుబారడం లాంటి సమస్యలు క్రమక్రమంగా వస్తాయంటున్నారు నిపుణులు. నరాలు చాలా ముందే సంకేతాలను పంపుతాయని చెబుతున్నారు. అలాగే, చాలామంది అనుకునేటట్లు పాదాల్లో తిమ్మిర్లు లేదా నరాల బలహీనత కాదట.

దీర్ఘకాలిక డీ హైడ్రేషన్ : ఇది మన తీసుకునే నీటిపై ఆధారపడి ఉంటుందని అనుకుంటారు. కానీ, అది నిజం కాదంటున్నారు నిపుణులు. మన రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయినప్పటికీ తలనొప్పి రావడం, ఏకాగ్రత లోపించడం దీని మొదటి సంకేతాలని చెబుతున్నారు. ఇక్కడ కూడా మెదడే మొదట సమస్యను గుర్తిస్తుందట. అందుకే, రోజంతా తగినంత నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హై కార్టిసాల్ : కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటానికి మొదటి సంకేతంగా బెల్లీ ఫ్యాట్ అని భావిస్తారు. కానీ, రోజు ప్రారంభం కాకముందే ఆందోళనతో నిద్ర లేవడం దీని లక్షణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి హార్మోన్ అయిన్ కార్టిసాల్, జీవక్రియను ప్రభావితం చేయడానికి ముందే మానసిక స్థితిని దెబ్బతీస్తుందంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'బ్రెయిన్ ట్యూమర్' ప్రాణాంతకమేనా? - లక్షణాలు ఎలా ఉంటాయంటే!

"చెవిలో మోత" అధిక రక్తపోటుకు రిలేటివ్? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!