ETV Bharat / health

బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

- విపరీతమైన డైటింగ్​తో ప్రమాదం - మరణానికి కూడా దారితీస్తుందంటున్న నిపుణులు

Representational image
Representational image (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 4, 2026 at 5:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Negative Impacts of Extreme Dieting : అందంగా, నాజూగ్గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా సమతులాహారం తీసుకోవడం, వ్యాయామం లాంటివి చేస్తుంటారు. అయితే, కొంతమంది మాత్రం ఆహారాన్ని తూకం వేసుకుని తింటుంటారు. మరికొందరు అవి వద్దు, ఇవి తినొద్దని లేనిపోని నిబంధనలు పెట్టుకుంటారు. ఈ క్రమంలో తినే తిండి విషయంలో శ్రద్ధ అవసరమే కానీ, అది అతిగా మారితే విపరిణాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కొలత పెట్టి తినే వారిలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!

ఈ రోజుల్లో శరీర ఆకృతిపై, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఈ క్రమంలో చాలా మంది వివిధ రకాల ఆహార నియమాలు పాటిస్తున్నారు. కొంతమంది నిపుణుల సూచనలతో డైటింగ్ చేస్తుంటే, ఇంకొంతమంది యూట్యూబ్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​ లాంటి వాటిలో చూసి అమలు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే భావన మంచిదే కానీ, కొందరిలో ఆ స్పృహ అదుపు తప్పుతోంది. ఆ ఆలోచన ఇంతలంతలై అది కఠినమైన నియమంగా మారి ఆరోగ్యానికి హానికరం అవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తింటే ఏమవుతుందోనని ఆలోచిస్తూ ఉండడం ప్రపంచ వ్యాప్తంగా ఓ రుగ్మతగా మారుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఈటింగ్ డిజార్డర్​ అంటారు. దీనివల్ల గుండె, మూత్రపిండాల సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు, లేదా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చని medlineplus పేర్కొంది.

మహిళలు తప్పక తినాల్సిన పండు 'ఇది' - ఆరోగ్యానికే కాదు అందానికి మంచిదట!

అతి సర్వత్ర వర్జయేత్ : అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, తిండి విషయంలో మితిమీరిన శ్రద్ధ.. రెండూ హాని చేస్తాయంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక డైటింగ్ లేదా అతిగా తినడం. చాలా కాలం ఒకే పదార్థాన్ని తినడం, తింటూ ఆందోళనకు, అపరాధ భావనకు గురికావడం, బలవంతపు వ్యాయామం ఇవన్నీ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయని చెబుతున్నారు. కొన్ని సార్లు ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చని హెచ్చరిస్తున్నారు. మరీ, సూత్ర బద్ధంగా తినాలనే ధ్యాసతో కొన్ని పదార్థాలకు పూర్తిగా దూరమవడం వల్ల విటమిన్ల కొరత తలెత్తుతుందని పేర్కొంటున్నారు. బరువు మరీ ఎక్కువగా తగ్గి కొత్త సమస్యలకు కారణం కావచ్చని తెలియజేస్తున్నారు.

ఈ రెండూ ప్రమాదమే :

రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్​ టేక్ డిజార్డర్ (ARFID) : ఈ సమస్య ప్రధాన లక్షణం తిండిపై ఆసక్తి ఉండదని National Institute of Mental Health పేర్కొంది. ఈ డిజార్డర్​ బాధపడుతున్నవారు కొన్ని రకాల ఆహారాలకు పూర్తిగా దూరమవుతారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారని తెలియజేస్తున్నారు. ఇది చిన్నతనంలోనే మొదలవుతుందట. దీనివల్ల వీరిలో చాలా మందికి పోషకాహార లోపాలు తలెత్తుతాయని mayoclinic పేర్కొంది.

అనోరెక్సియా నెర్వోపా : ఈ సమస్య ఉన్నవారు బరువు పెరుగుతామనే భయంతో, శరీరాకృతిపై అధిక స్పృహతో భోజనం విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. తక్కువ తినాలి, లేదా పూర్తిగా మానెయ్యాలని అనుకుంటారట. దీర్ఘకాలంలో ఇది మరీ తీవ్రమైన అలవాటుగా మారి ఆయా ఆహార పదార్థాలపై విరక్తి పెరుగుతుందని తెలియజేస్తున్నారు. కొందరైతే ఆహారాన్ని చూడగానే వాంతి చేసుకోవడం, ఇతర ఆహార రుగ్మతల వంటి అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుందని sciencedirect పేర్కొంది.

ఈ క్రమంలో ఆహారం విషయంలో అతి జాగ్రత్త తీసుకునే అలవాటు 50 ఏళ్లు పైబడిన వాళ్లలో ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరితో పాటు సన్నగా, నాజూగ్గా ఉండాలనుకునే యువతలో మరీ ఎక్కువగా యువతుల్లో తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా ఉంటే సమస్యే :

  • కొన్ని ఆహార పదార్థాలను మంచివి/చెడ్డవి అని ముద్రవేయడం. వాటికి కఠినమైన నియమాలను పెట్టుకోవడం
  • చెడ్డ ఆహారం తిన్నామన్న ఆందోళన, అపరాధభావం పెరిగిపోవడం, కుంగుబాటుకు గురవడం.
  • ఆహార నిబంధనలను ఉల్లంఘిస్తామనే భయంతో సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం. బయట ఎక్కడ భోజనం చేయకపోవడం
  • ఆహారం గురించి ఆలోచించడానికి, ప్రణాళిక వేయడానికి, పరిశోధించడానికి ఎక్కువ సమయం కేటాయించడం
  • తినడాన్ని ఆస్వాదించలేక ఒత్తిడికి గురికావడం, పరిమితులు ఎక్కువగా పెట్టుకోవడం

ఇవన్నీ ఈటింగ్ డిజార్డర్ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉన్నప్పుడు అవసరమైతే డాక్టర్లు సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? - "మ్యూజిక్​ థెరపీ"తో పరిష్కారమట!

మీ ఆరోగ్యాన్ని "పాదాలు" చెప్పేస్తాయట - ఎలాగో తెలుసా?