'బ్రెయిన్ ట్యూమర్' ప్రాణాంతకమేనా? - లక్షణాలు ఎలా ఉంటాయంటే!
బ్రెయిన్ ట్యూమర్ అపోహలు - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

Published : July 14, 2026 at 6:34 PM IST
Myths and Facts about Brain Tumour : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల వివిధ కారణాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో బ్రెయిన్ ట్యూమర్ ఒకటి. దీని పేరు వినగానే చాలామంది భయపడిపోతారు. సినిమాలు, సోషల్ మీడియా, అసంపూర్ణ సమాచారం దీని గురించి పూర్తిగా నిజం కాని అనేక అపోహలూ రాజ్యమేలుతున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్ ట్యూమర్‌పై ఉన్న అపోహలు, వాటి వెనకున్న వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సరా? : మెదడులో కణితి (ట్యూమర్) ఏర్పడిదంటే అది ప్రాణాంతకమైన క్యాన్సర్ అని, ఇక బతకడం కష్టమని చాలా మంది భావిస్తారు. కానీ, అన్నీ ట్యూమర్లు క్యాన్సర్ కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతంకి పైగా బ్రెయిన్ నిరపాయమైనవి అని పలు అధ్యయనాల్లో తేలింది. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. శస్త్రచికిత్స ద్వారా వీటిని పూర్తిగా తొలగించి నయం చేయవచ్చు. కేవలం కొన్ని మాత్రమే ప్రాణాంతకమైన క్యాన్సర్లుగా మారుతాయి.
ఈ క్రమంలో చాలా ట్యూమర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవు. అయితే, మెదడులో స్థలం తక్కువగా ఉండటం వల్ల, ఇటువంటి ట్యూమర్లు కూడా ఒత్తిడిని కలిగించి, మాట కదలిక, జ్ఞాపకశక్తి, చూపు లేదా శరీర సమతుల్యత వంటి ముఖ్యమైన విధులను ప్రభావితం చేస్తాయంటున్నారు. అందువల్ల ఒక ట్యూమర్ తీవ్రత అది క్యాన్సర్? కాదా? అనే దానిపైనే కాకుండా, అది ఉన్న స్థలం, దాని పరిమాణం, అది పెరిగే వేగంపై కూడా ఆధారపడి ఉంటుంది.
డెలివరీ తర్వాత పొట్టను తగ్గించుకునేదెలా? - నిపుణులు ఏమంటున్నారంటే!
తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ సంకేతమా? : తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తుంటే అది కచ్చితంగా బ్రెయిన్ ట్యూమర్ వల్లే అనుకుంటారు. అయితే, సాధారణంగా వచ్చే తలనొప్పులకు మైగ్రెయిన్, సైనస్, నిద్రలేమి, కంటి సమస్యలు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్న రోగులలో చాలా తీవ్రంగా ఉండటం, వాంతులు అవ్వడం, రోజురోజుకూ తలనొప్పి పెరగడం వంటి లక్షణాలతో కూడి ఉంటుంది.
బ్రెయిన్ ట్యూమర్ కేవలం పెద్దవారికే వస్తుంది : బ్రెయిన్ ట్యూమర్ కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇది ఏ వయసు వారికైనా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు, యువకులు, మధ్యవయస్కులలో కూడా వివిధ రకాల బ్రెయిన్ ట్యూమర్లు కనిపిస్తాయని అంటున్నారు. అందువల్ల వయసును బట్టి లక్షణాలను తేలికగా తీసుకోకూడదని సూచిస్తున్నారు.
మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? : మొబైల్ ఫోన్లకు, బ్రెయిన్ ట్యూమర్లకు మధ్య ఉన్న సంబంధంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. మొబైల్ ఫోన్లను క్రమం తప్పకుండా వాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ వాడకం, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదానికి మధ్య ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని American Cancer Society నివేదిక కూడా స్పష్టం చేస్తోంది.
బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే కోమాలోకి వెళ్తారా? : బ్రెయిన్ సర్జరీ చేయించుకుంటే జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, పక్షవాతం వస్తుందని లేదా మరణం సంభవిస్తుందని చాలామంది భయపడుతుంటారు. కానీ, ఆధునిక వైద్య శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైక్రో న్యూరో సర్జరీ, న్యూరో నావిగేషన్ సిస్టమ్స్, MDS వంటి అత్యాధునిక సాంకేతికత వల్ల మెదడు కణజాలానికి ఎలాంటి హాని జరగదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, సర్జరీ తర్వాత సాధారణ జీవితాన్ని గడపవచ్చని సూచిస్తున్నారు.
పరిశోధన మూలాలు :
https://braintumor.org/brain-tumors/about-brain-tumors/brain-tumor-facts/
https://www.uclahealth.org/news/article/4-brain-cancer-myths-debunked
https://www.americanoncology.com/blogs/brain-tumor-myths-vs-facts-can-you-really-prevent-them
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కిడ్నీలను సైలెంట్‌గా దెబ్బతీసే 'ప్రోటీన్యూరియా' - పురుషులు గుర్తించాల్సిన కీలక లక్షణాలు ఇవేొ!
చదువు ఒత్తిడిలో అధిక ఆహారం - ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంటున్న నిపుణులు!

