ETV Bharat / health

నిజంగా సబ్బు శరీర రంగును మార్చగలదా? - ఎలాంటి సబ్బు వాడాలి?

- ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్న నిపుణులు!

Soaps
Soaps (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : November 27, 2025 at 2:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Soaps For Skin Health: సబ్బులు మన చర్మంపై ఉన్న మురికి, మలినాలను తొలగించడానికి.. శరీరాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడతాయని అందరికీ తెలుసు. అయితే, కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. అందులో చర్మం తెల్లగా మారడం ఒకటి! సబ్బుతో చర్మం తెల్లగా మారుతుందా? ఒకవేళ మారితే ఏ రకం సబ్బు వాడాలి? వంటి డౌట్స్ వ్యక్తం చేస్తుంటారు. వీటికి నిపుణులు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

పొడిచర్మం ఉంటే : అలోవేరా, కొబ్బరినూనె, ఆల్​మండ్, ఆలివ్ ఆయిల్, షియా బటర్, కోకో బటర్, గ్లిజరిన్, హైల్​రోనిక్ యాసిడ్ వంటివి ఉన్న మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి తేమను కాపాడతాయని, చర్మం బిగుసుకుపోకుండా, పొలుసులుగా మారకుండా నిరోధిస్తాయని అంటున్నారు. వీటిని ఏ చర్మం ఉన్నవారైనా శీతాకాలంలో వాడొచ్చని సిఫార్సు చేస్తున్నారు.

అబ్బాయిలూ పాత్రలు కడుగుతున్నారా? - ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

మీది సున్నిత చర్మమా : లిక్విడ్​ ఫ్రీ క్లెన్సర్ వాడితే మంచిదంటున్నారు నిపుణులు. వీటిలో గాఢ రసాయనాలు ఉండవని చెబుతున్నారు. గ్లిజరిన్ బేస్డ్​, సెటైల్ ఆల్కహాల్, స్టెరైల్ ఆల్కహాల్, ప్రొపిలిన్ గ్లైకాల్ వంటి కాంపోనెంట్స్ ఉంటాయని, ఇవి శరీరంలోని తేమను కాపాడుతాయని, చర్మం దెబ్బతినకుండా ఉంచుతాయని వివరిస్తున్నారు. ఓట్​మీల్, గోట్స్ మిల్స్ వంటి సున్నిత పదార్థాలు ఉన్న ఫ్రాగెన్స్ ఫ్రీ సబ్బుల్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. కఠిన రసాయనాలు ఉన్న వాటిని దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు. అలాగే, హెర్బల్ సోప్స్ కూడా మంచివని సలహా ఇస్తున్నారు.

సాధారణ చర్మం ఉన్నవారు : కొబ్బరి నూనె, అలోవేరా తదితర సహజ పదార్థాలతో చేసే సబ్బులు మంచి ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.

రంగును నిర్ణయించేది జన్యువులు : తెల్లగా మారాలంటే ఎటువంటి సబ్బు వాడాలి? అనే ప్రశ్నకు నిపుణుల ఆన్సర్​ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే సబ్బు వాడటం వల్ల తెలుపు రంగు రాదని స్పష్టం చేస్తున్నారు. శరీరం రంగు అనేది జన్యువుల ఆధారంగా వస్తుందని తెలియజేస్తున్నారు. అందుకే.. ఏ రంగుతో పుట్టామో, జీవితాంతం అదే ఉంటుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలతో ఉన్న చర్మం నిగనిగలాడుతూ, ఆకర్షణీయంగా కనిపిస్తుంది తప్ప, రంగు పూర్తిగా మారదని వివరిస్తున్నారు. చర్మాన్ని కాంతివంతం చేసే సబ్బులు, క్రీముల్లో స్టెరాయిడ్లు, హైడ్రోక్వినోన్, క్యాన్సర్ కారకమైన పదార్థం, పాదరసం వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయని United Nations Environment programme పేర్కొంది. కాబట్టి సబ్బులు వాడితే తెల్లగా అవుతారు అనే అపోహలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

చర్మనికో రకం : మనది ఏ తరహా చర్మమో తెలుసుకొని, దానికి తగ్గట్టు సబ్బును ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.

జిడ్డు చర్మం, మొటిమలు ఉంటే : గ్లెకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, యాక్టివేటెడ్ చార్​కోల్, టీ ట్రీ ఆయిల్ వంటి పదార్థాలు ఉన్న సబ్బులు వాడాలంటున్నారు. ఇవి చర్మం మీద ఏర్పడే అదనపు తైలాల్ని తొలగిస్తాయని చెబుతున్నారు. స్వేద రంధ్రాల్ని శుభ్రం చేస్తాయని తెలియజేస్తున్నారు. సాలిసిలిక్ యాసిడ్ ఉంటే క్లెన్సింగ్ సబ్బులు, యాంటీ బాక్టీరియల్, లావెండర్, చమోమిలే, థైమ్ సబ్బులు వాడటం మంచిదని వివరిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణ, సలహా మేరకే వీటిని వినియోగించాలని, ఎక్కువగా వాడకూడదని సూచిస్తున్నారు. మొటిమల చర్మం అయితే, నూనె తొలగించే తేలికపాటి క్లెన్సర్‌ను ఉపయోగించాలని, అదే పొడి చర్మం వారికి హైడ్రేటింగ్ క్లెన్సర్‌తో మెరుగ్గా పనిచేస్తుందని American Academy of Dermatalogy Association అధ్యయనం పేర్కొంది.

ఎలా ఎంచుకోవాలి? :

  • సబ్బులు కొనే ముందు వాటిలో ఏ పదార్థాలు వాడారో చూడాలి. మన చర్మతత్వానికి సరిపోయే దాన్ని ఎంచుకొని, దీర్ఘకాలం వాడొచ్చు. ముఖానికి, శరీరానికి ఒకే సబ్బు వాడినా పెద్దగా సమస్య ఉండదు.
  • సబ్బు టోటల్ ఫ్యాటీ మ్యాటర్ (టీఎఫ్ఎం) కనీసం 76 శాతం ఉండే వాటిని సమర్థవంతమైనవిగా భావిస్తారు. సబ్బు కొనే ముందూ వీటిని పరిశీలించాలి.
  • హానికరమైన రసాయనాలు, స్ట్రాంగ్ డిటర్​జెంట్లు, ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులు, గాఢ రసాయనాలు, సల్ఫేట్లు, పారబిన్స్, కృత్రిమ రంగులు, కృత్రిమ ఫ్రాగ్రెన్స్ తదితరాలు ఉండేవి ఎంచుకోవద్దు.
  • గాఢ సబ్బులు ఎక్కువగా వాడితే చర్మం తేమను కోల్పోయి పొడిబారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బోరింగ్ వ్యాయామాలతో విసిగెత్తిపోతున్నారా? - జుంబా డ్యాన్స్​తో ఫన్​ అండ్​ ఫిట్​నెస్​!

"బాడీ స్ప్రే" అతిగా వాడుతున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!