ETV Bharat / health

భావోద్వేగాలతో ఏ అవయవంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా? - ఆసనాలతో అంతా సెట్!

యోగాసనాలు సంపూర్ణ ఆరోగ్యసాధనకు ఉత్తమ మార్గమంటున్న నిపుణులు - అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వెల్లడి!

Asanas
Asanas (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 21, 2026 at 5:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Asanas that Regulate Emotions : శరీరం, మనసు రెండు వేర్వేరు కాదు. అవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ప్రతి భావోద్వేగం మన శరీరంలోని అవయవాల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆనందం, ప్రేమ, కృతజ్ఞత వంటి సానుకూల భావాలను మనం అనుభవించినప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు వంటి సంతోషకర హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంచి, కణజాలం వేగంగా కోలుకునేలా చేసి, గుండెను ప్రశాంతంగా ఉంచుతాయి. దీనికి భిన్నంగా కోపం, భయం, బాధ వంటి ప్రతికూల భావాలు శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్లను ప్రేరేపిస్తాయట. ఇవి దీర్ఘకాలంలో మన అంతర్గత అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. ప్రతికూల భావోద్వేగాలు మానసిక అశాంతిని మాత్రమే కాకుండా, శారీరక క్షీణతకూ పునాది వేస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో యోగాసనాల ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని పేర్కొంటున్నారు.

భావోద్వేగం : కోపం

ప్రభావితం : కాలేయం

ఎందుకు? : కోపం వచ్చినప్పుడు శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్లు ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ తీవ్రమైన ఉద్వేగం కాలేయంపై (Liver) అధిక ఒత్తిడిని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. లివర్ మన శరీరంలోని విషతుల్యాలను తొలిగించే అవయవం. అయితే, ఎక్కువగా కోపానికి గురవ్వడం వల్ల కాలేయం పనితీరు మందగించి, బలహీనపడుతుంది.

నియంత్రించే ఆసనం - చంద్రభేదన ప్రాణాయామం : అంటే ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని కుడిముక్కు రంధ్రం ద్వారా వదలడం. ఇలా చేయడం వల్ల మనసును ప్రశాంత పరుస్తుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. లివర్​ను ప్రశాంతంగా ఉంచుతుంది.

పోషకాహార లోపం - మహిళలు తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ఇవేనట!

భావోద్వేగం : బాధ

ప్రభావితం : ఊపిరితిత్తులు

ఎందుకు? : మనం తీవ్రమైన బాధ లేదా విచారంలో ఉన్నప్పుడు శ్వాస తీరు మారుతుందట. ఊపిరితిత్తులు కుంచించుకుపోయినట్లు అనిపిస్తాయి. దీర్ఘకాలిక బాధ వల్ల ఊపిరితిత్తులు సామర్థ్యం తగ్గి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

నియంత్రించే ఆసనం - ఉష్ట్రాసనం : ఈ ఆసనం ఛాతీని వెడల్పుగా తెరిచి, ఊపిరితిత్తులకు గాలిని బాగా అందేలా చేస్తుంది. ఇది బాధాకరమైన భావాలను బయటకు పంపి, మనసులోని బరువును తగ్గిస్తుందట.

భావోద్వేగం : ఆందోళన

ప్రభావితం : జీర్ణాశయం/కడుపు

ఎందుకు : విపరీతమైన ఆందోళనలో ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఆందోళన, జీర్ణాశయాంతర వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తుందట.

నియంత్రించే ఆసనం - పశ్చిమోత్తాసనం : ఇది వెన్నెముకను సాగదీసి, జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అశాంతిలో ఉన్న మనసును వర్తమానంలోకి తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు.

భావోద్వేగం : అతి అనుబంధం

ప్రభావితం : గుండె

ఎందుకు? : ఏదైనా వస్తువు లేదా వ్యక్తి పట్ల విపరీతమైన ఎటాచ్​మెంట్ ఉండటం వల్ల, అది దూరమైతే కలిగే బాధ/ కోల్పోతామనే భయం గుండెపై భారాన్ని పెంచుతుంది. ఇది గుండె లయను దెబ్బతీస్తుంది.

నియంత్రించే ఆసనం - ఓంకార జపం : ఓంకారం గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు శాంతిని ఇచ్చి, అతి అనుబంధం వల్ల కలిగే మానసిక వేదన నుంచి విముక్తి కలిగిస్తుంది.

భావోద్వేగం : భయం

ప్రభావితం : మూత్రపిండాలు

ఎందుకు : భయం కలిగినప్పుడు మన శరీరం 'ఫైట్ ఆర్ ఫ్లైట్' స్థితిలోకి వెళ్తుంది. ఈ సమయంలో మూత్రపిండాల పైన ఉండే అడ్రినల్ గ్రంథులు అధికంగా పనిచేస్తాయి. ఇది మూత్రపిండాల పనితీరుపై ఒత్తిడిని పెంచుతాయి. భయాందోళనలను గురిచేస్తుంది.

నియంత్రించే ఆసనం - అనులోమ విలోమ ప్రాణాయామం : ఇది నాడీ వ్యవస్థను శాంతపరిచి, మనం సురక్షితంగా ఉన్నాం అనే సంకేతాన్ని మెదడుకు పంపి, భయాన్ని తగ్గిస్తుంది.

పరిశోధన మూలాలు :

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC7567196/

https://www.ijraset.com/fileserve.php?FID=24063

https://pmc.ncbi.nlm.nih.gov/articles/PMC3410188/

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'వరద ఉరవడి'కి దూరం, దూరం! - దరిచేరే ఆరోగ్య సమస్యలు అనేకం!

అలా చేస్తే పంచదార నీళ్లైనా ప్రమాదమే! - పసికందు ఆరోగ్యానికి పాటించాల్సిన నియమాలు ఇవి!