ETV Bharat / health

ఎవరు, ఎటువైపు తిరిగి పడుకోవాలో తెలుసా? - గర్భిణులు, గురక సమస్య ఉంటే ఇలా చేయండి!

ఎటు వైపు తిరిగి పడుకుంటే మంచిది? - అసలు ఎలా నిద్రపోవాలో మీకు తెలుసా?

Sleeping Position
Sleeping Position (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : May 5, 2026 at 2:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Best Sleeping Position : ఆరోగ్యానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఈ నిద్ర విషయంలోనే చాలామందికి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా బోర్లా పడుకోవాలా, వెల్లకిల్లా పడుకోవాలా? లేదంటే ఎడమ, కుడి ఈ రెండింట్లో ఎటు వైపు తిరిగి పడుకుంటే మంచిది? లాంటి సందేహలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఎలా పడుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలామందికి బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ రెండూ కాకుండా ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇలా నిద్రపోవడం వల్ల దీర్ఘకాలంలో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చట. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎడమ వైపు తిరిగి పడుకోవడమే మేలు. దీనివల్ల ఆరోగ్యకరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Sleeping Position
Sleeping Position (Getty Images)

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా : మన శరీరంలో మెటాబాలిజం సజావుగా జరగాలంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. ఈ క్రమంలో ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. మనం తిన్న ఆహారం జీర్ణం కాగా, మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు అనేవి మొదట పెద్ద పేగు ప్రారంభ భాగంలోకి చేరుతుంది. ఇది మన శరీరంలో కుడి భాగాన ఉంటుంది. ఆ తర్వాత ఇవి క్రమంగా శరీరానికి ఎడమ వైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వస్తాయట. అయితే, ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి కారణంగా కుడి నుంచి ఎడమ వైపు వ్యర్థాలన్నీ సులభంగా కిందకు వెళ్లిపోతాయి. ఫలితంగా, ఉదయాన్నే వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటకు వెళ్లిపోతాయి. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ అవ్వడం వల్ల పేగుల ఆరోగ్య మెరుగుపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచడానికి దోహదం చేస్తుంది. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల రాత్రిపూట రిఫ్లక్స్ తగ్గి, GERD సంబంధిత జీవన నాణ్యత మెరుగుపడుతుందని National Library of Medicine పేర్కొంది.

ఇమ్యూనిటీ పెరగాలంటే - ఈ విటమిన్స్ తప్పనిసరంటున్న నిపుణులు!

Sleeping Position
Sleeping Position (Getty Images)

గుండె ఆరోగ్యంగా : రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమ వైపు తిరిగి పడుకోవడమే మేలంట. ఇలా పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనకు గుండె ఎడమ వైపునకు ఉంటుందని అందరికి తెలిసిందే. అదే దిశలో పడుకుంటే గురుత్వాకర్షణ కారణంగా రక్తం సరఫరా బాగా అవుతుంది. ఫలితంగా, గుండెపై ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రెగ్నెన్సీ టైంలో : గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదని National Institutes of Health పేర్కొంది. ఇలా పడుకోవడం వల్ల వీపు, నడుము, వెన్నుముకపై ఒత్తిడి తగ్గి నిద్ర చక్కగా పడుతుంది. ఇంకా గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగు అవుతుంది.

గురక సమస్యలకు : ఒక్కోసారి మనకు తెలియకుండానే అతిగా తినేసి, ఆ తర్వాత ఆయాస పడుతుంటాం. అయితే, ఇలాంటప్పుడు ఓ పది నిమిషాలు ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. తద్వారా గురక సమస్యకు చెక్ పెట్టవచ్చట. బోర్లా పడుకుంటే గురకను నివారించడంలో సహాయపడవచ్చు, కానీ మెడ, నడుముపై ఒత్తిడిని కలిగించవచ్చని sleepfoundation పేర్కొంది.

ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా, ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోలేమంటున్నారు నిపుణులు. అందుకే కాసేపు కుడి వైపు, వెల్లకిలా పడుకున్నా, వీలైనంత ఎక్కువ సమయం ఎడమ వైపునకు పడుకోవాలని చెబుతున్నారు. ఇలా అప్పుడప్పుడూ అన్ని రకాల భంగిమల్లో పడుకోవడం వల్ల శారీరక నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లల్లో టైప్ -1 మధుమేహాన్ని గుర్తించండి - తొలిసారిగా మార్గదర్శకాలను జారీచేసిన కేంద్రం!

మీరు చేసే చిన్న తప్పులే మెదడును దెబ్బతీస్తాయట! - అవేంటో తెలుసా?