ETV Bharat / health

ఝుంకారంతో "ఒత్తిడి' తగ్గుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే!

ఝుంకారం అంటే ఏమిటి? - దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Bhramari Pranayama
Bhramari Pranayama (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 25, 2025 at 3:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Health Benefits of Bhramari Pranayama: మన శరీరంపై శబ్దం లేదా నాదం విశేష ప్రభావం చూపుతుంది. ఓంకారం, ఐంకారం ఏదైనా కావచ్చు.. సకారాత్మక స్పందనలను ఉచ్ఛరించడం ద్వారా మన ఆరోగ్యం ఉజ్వలంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాంటి శబ్దాల్లో ఝుంకారం ఒకటని, దీన్నే 'హమ్మింగ్' అని కూడా అంటారు. ఈ క్రమంలో దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!

సహజ ఔషధం లాంటిది : హమ్మింగ్​.. తుమ్మెద చేసే శబ్దంలా చేసే ఈ ప్రక్రియను యోగాలో భ్రమరి ప్రాణాయామం అంటారు. యువత నుంచి వృద్దుల వరకు ఎక్కడ ఉన్నాసరే దీన్ని సాధన చేయొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల నాసిక మార్గాల్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అంటున్నారు. భ్రమరి ప్రాణాయామం వల్ల ఏకాగ్రత, నిద్ర నాణ్యత, పారాసింపథెటిక్, శ్వాసకోశ పనితీరు మెరుగుపడుతుందని Indian Journal of Physiology and Pharmacology ప్రచురించింది.

భ్రమరి ప్రాణాయామం ఒక సహజ ఔషధం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకుంటే, శ్వాస మార్గాలను శుభ్రం చేసి బ్యాక్టీరియా, వైరస్​లను అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు. సైనస్, అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలున్న వారికి బాగా మేలు చేస్తుందని తెలియజేస్తున్నారు. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపర్చడంతో పాటు, రక్త నాళాలను విశాలంగా చేసి హైబీపీని తగ్గిస్తుందని సూచిస్తున్నారు. రక్త ప్రవాహం పెరిగి శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగు పరుస్తుందని అంటున్నారు. తక్కువ తీవ్రత శబ్ద కంపనాలు నాడీవ్యవస్థను శాంతపరచి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, అన్నవాహిక, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

"అధిక కొలెస్ట్రాల్​"తో బాధపడుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!

ఒత్తిడి తగ్గుతుంది :

  • ఝుంకారం నుంచి వచ్చే కంపనాలు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గించి మనసు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుందని అంటున్నారు.
  • క్రమం తప్పకుండా ఇలా చేస్తుండటం వల్ల ఒత్తిడి తగ్గి, రోగ నిరోధక శక్తి ప్రతి స్పందన పెరుగుతుంది.
  • వేగస్ నాడిని ఉత్తేజపరిచే మెరుగైన సాధనమిది. నాడిపై ఒత్తిడిని తగ్గించడంలో, హృదయ స్పందనను మెరుగు పర్చడంలో ఝుంకారం కీలక పాత్ర పోషిస్తుంది.
  • భారతదేశంలో శతాబ్దాలుగా 'ఓం' అనే శబ్దం యోగా, ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా ఉంది. ఝుంకారం కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుంది.

హమ్మింగ్ చేసినా, ఓంకారం పలికినా శరీరంలోని నాడీకేంద్రాలు వైబ్రేట్ అవుతాయి. అ, ఉ, మ.. ఈ మూడు అక్షరాల కలయికే ఓంకారం. ఓంకారం, ఝుంకారాలను ధ్యాన ప్రక్రియలో ఎలా ఉపయోగించుకోవాలో యోగాలో నేర్పిస్తాం. ఈ ఉచ్ఛారణల వల్ల నాడీ కేంద్రాలు స్పందిస్తాయి. నాడీ కేంద్రాలతో ముడిపడిన అన్ని అవయవాల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ సైంటిఫిక్​గా రుజువైనవే -ప్రొఫెసర్ కె. రమేష్​బాబు, ఏయూ యోగా కేంద్రం విభాగాధిపతి

సమయం కేటాయించాలి :

  • ఝుంకారం కోసం ప్రతి రోజూ 5-10 నిమిషాల సమయం కేటాయించండి.
  • ఉదయం, నిద్రపోవడానికి ముందు ఝుంకారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
  • అవకాశం ఉన్నవారు నది, సముద్ర తీరాల్లో, దేవాలయ ప్రాంగణాల్లో, ప్రకృతి నడుమ చేయొచ్చు.
  • ప్రత్యేక పరికరాలు అవసరం లేని, ఎక్కడైనా చేయగల ప్రక్రియ ఇది.
  • ఓంకారాన్ని కూడా 21 సార్లు, కుదిరితే 108 సార్లు పలకడానికి ప్రయత్నించండి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య, మానసిక నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాబోయే అమ్మకు 'ఈ పోషకాలు' అందాల్సిందేనట! - ఎందుకో తెలుసా?

నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి? - అయితే మీలో 'ఆ సమస్య' ఉండొచ్చంటున్న వైద్యులు!