ETV Bharat / health

మీ పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్న నిపుణులు!

- ఆటిజం పిల్లల్లో తల్లిదండ్రులే శిక్షకులుగా - ప్రత్యేక నైపుణ్యాల మీద దృష్టి పెట్టాలంటున్న నిపుణులు!

Children with Autism
Children with Autism (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 31, 2025 at 1:27 PM IST

4 Min Read
Choose ETV Bharat

Precautions for Children with Autism: పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వంక చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం వంటి లక్షణాలు ఆటిజం(మంద బుద్ధి) సమస్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంటాయి. పిల్లల్లో వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్ని 'ఆటిజమ్'​ అంటారు. ఇదొక నాడీ సంబంధ రుగ్మత అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆటిజం లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని ప్రతి 68 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజం సమస్యతో బాధపడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఎదుటివారి మాటల్నీ, హావభావాల్నీ అర్థం చేసుకోకపోవడం, మేధోవికాసం లేకపోవడం, చేసిన పనిని పదే పదే చేయడం, మాటలు మాట్లాడటంలో తడబాటు, ఉద్వేగాల్ని అదుపుచేయలేకపోవడం ఇలా అనేక సమస్యల్ని కలిపే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారని National Institute of Mental Health అధ్యయనం పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని తగినంత ప్రోత్సాహం ఇస్తే ఆటిజమ్ పిల్లలు చాలా వరకు దీని నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఆడపిల్లల్లో కన్నా మగపిల్లలకు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా, తల్లిదండ్రులు చాలా ఆలస్యంగా సంతానాన్ని కనటం, కాన్పు సమయంలో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొన్న వారికి దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు.

Children with Autism
ఆటిజం పిల్లలు (Getty Images)

'దగ్గు'ను ఇంట్లోనే తగ్గించుకోవచ్చా? - డాక్టర్ దగ్గరికి వెళ్లాలా?- అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

నిర్థారణ : ఆటిజమ్​ను నిర్థారించటానికి ఎలాంటి పరీక్షలు లేవని, దీన్ని లక్షణాలతో మాత్రమే గుర్తిస్తారంటున్నారు నిపుణులు. బాల్యంలో ప్రవర్తన, ఎదుగులలో మార్పులు వంటివి సమస్యను గుర్తించటానికి తోడ్పడతాయని చెబుతున్నారు. ఆటిజమ్​తో బాధపడే పిల్లలు తొమ్మిది నెలల వయసు వచ్చినా తమ పేరుకు స్పందించకపోవచ్చని తెలియజేస్తున్నారు. మూడేళ్ల వయసు వచ్చినా ఇతర పిల్లలతో కలవటానికి అంతగా ఇష్టపడరని వివరిస్తున్నారు. ఐదేళ్ల వయసుకు చేరుకున్నా ముఖంలో బాధ, సంతోషం వంటి భావాలనూ అంతగా ప్రదర్శించకపోవచ్చని వెల్లడిస్తున్నారు. కానీ, ఇలాంటి లక్షణాలను తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకుండా, వారిని మరీ గారాబం చేస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి కీలకమైన ఎదుగుదల దశలో నిపుణుల సలహా తీసుకోవటం చాలా అవసరమంటున్నారు.. కొంత మంది పిల్లలు అతి చురుకుగానూ స్పందించవచ్చని, మరికొందరికి కుంగుబాటు, ఆందోళన వంటివీ ఉంచొచ్చని తెలియజేస్తున్నారు. వీటికి తగు చికిత్స ఇప్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

Children with Autism
ఆటిజం పిల్లలు (Getty Images)

చికిత్స : ఆటిజం స్పెక్ట్రమ్ రుగ్మతకు చికిత్స లేదని, కానీ ప్రీస్కూల్ సంవత్సరాల్లోనే చికిత్స పొందడం వల్ల ఈ పరిస్థితి ఉన్న చాలా మంది పిల్లల జీవితాల్లో పెద్ద మార్పు వస్తుందని mayoclinic అధ్యయనం పేర్కొంది. ప్రతి ఒక్కరికి వారి లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ లాంటి చికిత్స ఉంటాయని, ఆయా చికిత్సల ద్వారా కచ్చితంగా మెరుగుదల కనిపిస్తుందని cdc.gov అధ్యయనం పేర్కొంది. కానీ, తల్లిదండ్రులే శిక్షకులుగా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

వారితో పోల్చకండి : కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలాగా ఉండమని తమ పిల్లలకు చెబుతుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఆటిజమ్ సమస్యలు తగ్గుతాయని అనుకుంటారు. అయితే, ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగే, ఆటిజం ఉన్న వారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని, దాన్ని గుర్తించి అందుకు తగ్గ తోడ్పటు అందించాలని సూచిస్తున్నారు.

Children with Autism
ఆటిజం పిల్లలు (Getty Images)

ప్రత్యేక నైపుణ్యాల మీద దృష్టి : ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుంచి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు కొన్ని విషయాల్లో బాగా రాణిస్తుంటారని చెబుతున్నారు. సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి వాటిపై ఎనలేని నైపుణ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నారు. ASD ఉన్న పిల్లలలో బలహీనత స్థాయిలను తగ్గించడంలో ఆటల వినియోగం ప్రభావవంతంగా ఉంటుందని BMC అధ్యయనం పేర్కొంది.

కుదురు, ఏకాగ్రత : ఆటిజమ్ పిల్లల్లో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు. వ్యక్తిగతంగా ఆడే పరుగు, ఈత వంటి ఆటలు మేలని చెబుతున్నారు. ఎందుకంటే వీటిల్లో ఇతరులతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని, గెలిచామనే సంతోషమూ కలుగుతుందని వివరిస్తున్నారు. అదే పుట్​బాల్, క్రికెట్, బాస్కెట్​బాల్ వంటి ఆటలైతే ఎక్కువ మందితో కలిసి, ఆయా సందర్భాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. మొదట్లో వీళ్లు ఆటటానికి వెనకాడొచ్చని, కానీ తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించాలని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎముకలు బలహీనమవుతున్నాయా? - ఈ సలహాలు పాటిస్తే మంచిదంటున్న నిపుణులు!

బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? - తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!