ETV Bharat / entertainment

'కేజీఎఫ్​ కంటే ముందే నా కొడుకు 5 హిట్లు ఇచ్చాడు' - యశ్ తల్లి కామెంట్స్ వైరల్​

టాక్సిక్ సినిమాపై వస్తున్న నెగిటివ్ ట్రోల్స్​పై మండిపడ్డ యశ్ తల్లి - కావాలనే కొందరు విషం చిమ్ముతున్నారని అసహనం వ్యక్తం చేసిన వైనం

Yash Mother Pushpa About Yash
టాక్సిక్​లో యశ్ (Source: Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : August 31, 2026 at 11:04 AM IST

3 Min Read
Choose ETV Bharat

Yash Mother Comments : తన కుమారుడి ఎదుగుదలను చూసి ఓర్వలేక కావాలనే కొందరు విషం చిమ్ముతున్నారని యశ్ తల్లి పుష్ప అరుణ్​ కుమార్ మండిపడ్డారు. ఇటీవల రిలీజైన 'టాక్సిక్' సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం, కేజీఎఫ్​ కంటే ముందు యశ్ ఎవరని గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్​గా అవుతున్నాయి.

'నా కొడుకు టెర్రరిస్ట్ కాదు'
'కేజీఎఫ్​ సినిమా కంటే కంటే ముందు యశ్​ వరుసగా 5 హిట్లు ఇచ్చాడు. నా కొడుకు ఏమీ టెర్రరిస్ట్ కాదు. అతడు అందరిలా ధనిక కుటుంబంలో పుట్టలేదు. కర్ణాటక మట్టిలోనే పుట్టి పెరిగిన ఓ సాధారణ వ్యక్తి. ఒక బస్ డ్రైవర్ కొడుకు, స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగాడు. మీరు అన్నట్లు అతను అంత గుర్తింపు లేనివాడు అయితే ఎందుకు యశ్​ను టార్గెట్​ చేస్తున్నారు. ఒక తల్లిగా నేను యశ్​ను చూసి గర్వపడుతున్నాను' అని పుష్ప అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

యశ్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు
అదే విధంగా యశ్ సాధించిన సక్సెస్ ఓవర్ నైట్​లో వచ్చింది కాదని, కేజీఎఫ్ కంటే ముందే అతను పడ్డ కష్టానికి ప్రతిఫలమే ఈ పాన్​ ఇండియా స్టార్​డమ్ ఇమేజ్ అని పుష్ప స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యల్లో పుష్ప ఎవరి పేరును ప్రస్తావించకపోయినప్పటికీ గతంలో కేజీఎఫ్​ కంటే ముందు యశ్ ఎవరనే కామెంట్స్ చేసింది అల్లు అరవింద్ కావడంతో ఆయన్ని ఉద్దేశించే మాట్లాడి ఉంటారని అందరూ భావిస్తున్నారు. యశ్ కోట్లాది మంది హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారని పుష్ప అన్నారు. అతనికి అండగా ఫ్యాన్స్ ఉన్నంత వరకు ఆయన ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ఆమె స్పష్టం చేశారు.

బాక్సాఫీస్ వద్ద టాక్సిక్​కు కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికితోడు సినిమాపై జరుగుతున్న నెగిటివ్ ట్రోలింగ్​పై కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఇది కన్నడ, తెలుగు సినిమాల్లో ఏది గొప్ప అనే స్థాయికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో యశ్ తల్లి పుష్ప చేసిన లేటెస్ట్ కామెంట్స్ దక్షిణాది ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

ఇక టాక్సిక్ సినిమా విషయానికొస్తే గీతూ మోహన్​దాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 26న రిలీజ్ కాగా మిక్స్​డ్ టాక్ అందుకుంది. ఇందులోని బోల్డ్ సీన్స్, రక్తపాతం తప్ప స్టోరీలో బలం లేదని నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటించగా, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్, మోన్​స్టర్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా రూ. 400 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించారు.

5 రోజుల్లో రూ. 200 కోట్ల కలెక్షన్స్
మరోవైపు ఫస్ట్ డే రికార్డ్ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీ ఆ తర్వాత రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా రూ. 101.10 కోట్ల భారీ నెట్ వసూళ్ల సాధించిన టాక్సిక్ ఐదు రోజుల్లో రూ. 200 కోట్ల మార్కును దాటింది. అయితే రికార్డు స్థాయి ఓపెనింగ్ తర్వాత రోజువారీ వసూళ్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఐదవ రోజు నాటికి ఈ చిత్రం 13,946 షోలలో రన్ అవుతుంది. కానీ కలెక్షన్స్ మాత్రం అంత ఆశాజనకంగా లేవు. దీని ప్రకారం చూస్తే మొదటి రోజు ఉన్న భారీ కలెక్షన్స్ ఆ తర్వాత రోజు నుంచి అదే స్థాయిలో కొనసాగలేదని అర్థమవుతోంది.

'టాక్సిక్' ఫస్ట్ డే వసూళ్లు- 'యశ్' గ్యాంగ్​స్టర్ డ్రామాకు తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

'టాక్సిక్' తర్వాత మరో పాన్ ఇండియా సినిమాపై దిల్ రాజు ఫోకస్- భారీ ధరకు డీల్?