టాలీవుడ్‌కు సంక్రాంతి కళ- ప్రమోషన్లు స్కిప్ చేస్తున్న స్టార్లు!- ఆ ఒక్క హీరో తప్ప
సంక్రాంతి సినిమాలపైనే సినీ ప్రియుల చూపు- కానీ ప్రమోషన్స్‌కు మాత్రం హాజరుకాని హీరోలు-

Published : January 7, 2026 at 1:29 PM IST
Tollywood Stars Skips Promotions : టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలు కాబోతుంది. తెలుగు ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన పండుగ సీజన్ కావడంతో బాక్సాఫీస్ బరిలో దిగేందుకు భారీ చిత్రాలు క్యూ కట్టాయి. అగ్ర హీరోలంతా తమ సినిమాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. పండగ సీజన్ అంతా సినిమాలతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. కోట్లాది రూపాయల బిజినెస్ జరగబోతోంది. ఇండస్ట్రీ అంతా ఎంతో పాజిటివ్ వైబ్‌తో కనిపిస్తోంది. అయితే సినిమాలు రిలీజ్‌కు దగ్గరపడుతున్న వేళ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. అదేంటంటే, సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి కానీ, హీరోలు మాత్రం ప్రమోషన్లకు కనపడటం లేదు.
అసలు చర్చ ఏంటంటే
సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయంటే ఆ హడావుడి వేరే లెవెల్లో ఉండాలి. కానీ మన స్టార్ హీరోలంతా ఎందుకో ప్రమోషన్లకు రావడం లేదు. దీనిపై ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. హీరోలు కూడా భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. కానీ సినిమాను ప్రమోట్ చేయడానికి మాత్రం బయటకు రావడం లేదు. మీడియా వాళ్లు ఎక్కడ ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతారనో లేదా, ఒకవేళ అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాక బయటకు రావడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రమోషన్స్‌కు రావడం రాకపోవడం అనేది పూర్తిగా హీరోల వ్యక్తిగతం అని, వాళ్ల షెడ్యూల్‌పై కూడా ఇలాంటివి ఆధారపడి ఉంటాయని మరికొందరు అంటున్నారు.
ప్రభాస్-ఒక్క ఇంటర్వ్యూతో!
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా 'ది రాజాసాబ్' సంక్రాంతి కానుకగా జనవరి 09న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇంత పెద్ద సినిమాకు ప్రమోషన్లు చాలా ముఖ్యం? కానీ డార్లింగ్ బిజీ షెడ్యూల్ వల్ల బయటకు రాలేక పోతున్నారు. రీసెంట్గా ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం వచ్చి వెళ్లారు. ఆ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తదుపరి సినిమాలతో బిజీ అయిపోయారు.
Couldn’t come out of the REBEL GOD trance…. theatres lo 🙏🏻🔥🔥#Prabhas #TheRajaSaab #NacheNache pic.twitter.com/e5Ii9ptcmd
— The RajaSaab (@rajasaabmovie) January 6, 2026
చిరు కూడా దూరం!
సీనియర్ హీరోల పరిస్థితి కూడా ఇదేననే టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో 'మన శంకరవరప్రసాద్' సినిమా తెరకెక్కింది. ఇందులో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్ర పోషించారు. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఇది తెరకెక్కింది. అయితే దీని గురించి హీరోలు మాట్లాడితే హైప్ పెరుగుతుంది. నిర్మాతలు ఈ మధ్యే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చిరు ప్రమోట్ చేయలేదు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఈ ఈవెంట్లో మెగాస్టార్ పాల్గొని సందిడి చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
రవితేజ, శర్వానంద్ సైలెంట్
టాలీవుడ్ హీరో రవితేజ నుంచి 'భర్త మహాశయులు' సినిమా వస్తోంది. ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సోషల్ మీడియాలో చేస్తున్నారు. కానీ అందులో రవితేజ ఉండడం లేదు. అటు శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' సినిమా చేస్తున్నారు. అయితే శర్వానంద్‌కు ఇప్పుడు మంచి విజయం అవసరం. కానీ, ఆయన స్వయంగా ప్రమెషన్స్ చేసుకుంటే బాగుంటుదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇంకో వారం రోజులే నేపథ్యంలో ఇకనైనా శర్వా ప్రమోషన్స్‌లో పాల్గొంటారా? లేదా? చూడాలి!
This Sankranthi is set to deliver a HATTRICK BLOCKBUSTER for our Charming Star @ImSharwanand! 🌟
— AK Entertainments (@AKentsOfficial) December 9, 2025
The celebration begins with #NariNariNadumaMurari, hitting theatres January 14th, 2026 from 5:49 PM onwards! 🤩🎋@AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju… pic.twitter.com/akIyawyACH
నవీన్ మాత్రమే
అందరూ ఒక దారైతే, యువ హీరో నవీన్ పోలిశెట్టిది మరో దారి. ఆయన సినిమా 'అనగనగా ఒక రాజు' సంక్రాంతి రేసులో ఉంది. ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ పొంగల్ రేసులో ఉన్న హీరోల్లో కేవలం నవీన్ ఒక్కరే తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సాంగ్స్ ఈవెంట్లో నవీన్ హుషారుగా పాల్గొని సందడి చేశారు. ఇకపైనా ఇంటర్వ్యులు, మీడియా చిట్ చాట్‌లో నవీన్ పాల్గొనే ఛాన్స్ ఉంది.
ChatGPT yavare ee beauty ??? I asked ChatGPT the same question. Let’s see what it says 😜 @Meenakshiioffl #BhimavaramBalma ❤️🥁🔥#AnaganagaOkaRaju pic.twitter.com/HqGW803NcY
— Naveen Polishetty (@NaveenPolishety) November 29, 2025
విజయ్ 'జననాయగన్'కు సెన్సార్ కష్టాలు- హైకోర్టుకు మూవీ టీమ్
రెండు రోజుల్లో 'రాజాసాబ్'- ప్రారంభం కాని అడ్వాన్స్ బుకింగ్స్- ఇంకా డైలమాలోనే

