'వారణాసి' షూటింగ్‌కు నీటి కష్టాలు- జక్కన్న టీమ్‌కు నో చెప్పిన అధికారులు!
మహేశ్ రాజమౌళి వారణాసి- షూటింగ్‌కు ఎదురైన నీటి సంక్షోభం- దీంతో సినిమా షూటింగ్ ఆలస్యం!

Published : May 3, 2026 at 5:31 PM IST
Varanasi Latest Update : ప్రిన్స్ మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న 'వారణాసి'పై బోలెడు అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది టాప్ ప్లేస్‌లో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 07న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. దీంతో అప్పటిలోగా సినిమాను కంప్లీట్ చేసేందుకు మేకర్స్ తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇటీవల వారణాసి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక హైదరాబాద్‌లో మరో కీలక షెడ్యూల్ జరగాల్సి ఉంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట! దీనికి సంబంధించిన చిత్రీకరణ కోసం భారీగా నీరు అవసరం ఉంటుందట! అందుకే సుమారు 150 నీటి ట్యాంకర్లు కావాలని వారణాసి టీమ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులకు విజ్ఞప్తి చేసిందని తెలిసింది. అయితే మూవీటీమ్ విజ్ఞప్తిని నీటి సరఫరా అధికారులు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో నగరంలో నీటి డిమాండ్ గరిష్ఠ స్థాయిలో ఉంది. అందుకే ప్రజల అవసరాలే తొలి ప్రాధాన్యంగా భావించిన అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఈ షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని సినీబృందం ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి!
కాగా, ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ షోయింగ్ బిజినెస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్పానిష్‌లో కూడా ఒకే సమయంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సహ నిర్మాత కార్తికేయ ఇటీవల చెప్పారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యాటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ. 1200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.
#VARANASI will also be released in Spanish!!#CCXPMX26 pic.twitter.com/envxLLtP8A
— Varanasi (@VaranasiMovie) May 1, 2026

