వెడ్డింగ్ ఆఫ్ విరోష్- ఒక్కటైన విజయ్, రష్మిక- అభిమానుల విషెస్
వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విజయ్, రష్మిక- రెండు పద్దతుల్లో పెళ్లి

Published : February 26, 2026 at 12:05 PM IST
Vijay Rashmika Wedding : విజయ్ దేవరకొండ, రష్మిక వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా గురువారం ఉదయం 10.10 గంటలకు హిందూ హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. విజయ్-రష్మిక పెళ్లి జరిగినట్లు వార్త రావడంతో అభిమానులు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. అలాగే సినీ ప్రముఖులు, పలు సంస్థలు అభినందనలు తెలుపుతూ ప్రత్యేకంగా గీతా గోవిందం సినిమాలోని పెళ్లి వీడియోలను షేర్ చేస్తున్నారు.
కొడువ సంప్రదాయంలో మరోసారి పెళ్లి
రెండు సంస్కృతులు, సంప్రదాయాల కలయికగా విరోష్ వెడ్డింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం విజయ్ వైపు నుంచి హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయం కొడువ సంప్రదాయంలో మరోసారి వివాహం జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
My #GeethaGovindham ❤️❤️
— Bunny Vas (@TheBunnyVas) February 26, 2026
Watching you both choose each other forever is beyond special. @TheDeverakonda, your fire and loyalty… @iamRashmika, your warmth and pure heart… together you are magic in its truest form.
May this marriage be filled with unstoppable love, strength,… pic.twitter.com/6A8QQTMUm8
విరోష్ వెడ్డింగ్‌లో డీజే గణేశ్
ఇదిలా ఉండగా, బాలీవుడ్ డీజే గణేశ్ వివాహ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వడానికి ఉదయ్‌పుర్ వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు లీక్ కాకుండా ఉండేందుకు విరోష్ జంట పలు జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లికి వచ్చిన వారు ఎవరూ ఫోన్ ఉపయోగించకూడదనే నిబంధన పెట్టారు. దీంతో వీరి పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు. కేవలం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #ViRoshWedding అనే హ్యాష్‌ట్యాగ్‌తో వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రష్మికకు స్పెషల్ గిఫ్ట్
ఇదిలా ఉండగా, సంగీత్ కార్యక్రమంలో విజయ్ తల్లి రష్మికకు స్పెషల్ గిప్ట్ ఇచ్చారు. మాధవి దేవరకొండ గారు తన కాబోయే కోడలు రష్మికకు తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న ఖరీదైన గాజులను కానుకగా ఇచ్చారు. తమ సంప్రదాయం ప్రకారం ఇంటికి రాబోయే కోడలికి ఇలాంటి ఆభరణాలు ఇవ్వడం వారి కుటుంబంలో ఒక ఆచారమని సమాచారం. ఈ గిఫ్ట్‌తో రష్మిక ఎంతో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది. అత్తా కోడళ్ల మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని చూసి అక్కడున్న వారంతా మురిసిపోయారు.
From Vijay 🤍 Rashmika to the forever #Virosh 🫶
— ahavideoin (@ahavideoIN) February 26, 2026
Congratulations on your beautiful beginnings @TheDeverakonda and @iamRashmika 🥰#aha #VijayDevarakonda #RashmikaMandanna pic.twitter.com/EAo3FGvqVp
పెళ్లి వేడుకల్లో 'విరోష్' ప్రీమియర్ లీగ్
పెళ్లి వేడుకల్లో భాగంగా 'విరోష్ ప్రీమియర్ లీగ్'ను పేరుతో ఒక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మార్చిన 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణ హోటల్లో జరగబోయే ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులందరికీ ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ వేడుకతో విజయ్, రష్మికల పెళ్లి ఉత్సవం ముగియనుంది.
The golden aesthetics of VIROSH’s Haldi celebrations 🌼💛
— SIIMA (@siima) February 25, 2026
Radiant smiles, sun-kissed hues, and moments dipped in love as Vijay Deverakonda and Rashmika Mandanna glow brighter than ever. ✨
Just a few hours to go for the big day. 💍👑@TheDeverakonda @iamRashmika #VIROSH… pic.twitter.com/XyQtiY6IDx
పెళ్లి తర్వాత కూడా స్క్రీన్ షేర్
2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమాతో విజయ్, రష్మిక జర్నీ మొదలైంది. ఆ సినిమాలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత 2019లో 'డియర్ కామ్రేడ్' తో మరోసారి మెప్పించారు. అయితే ఎప్పటి నుంచో వీరిద్దరు సీక్రెట్ రిలేషన్ షిప్లో ఉన్నట్లు పుకార్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ నటీనటులు ఎప్పుడూ దీని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రీల్ జోడీ రియల్ లైఫ్‌లో పెళ్లి చేసుకోవడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. కేవలం పెళ్లితోనే ఆగకుండా, రాబోయే రోజుల్లో 'రణబాలి' అనే సినిమాలో కూడా వీరు మళ్లీ కలిసి నటించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

