'జన నాయగన్' రీఫండ్ ప్రక్రియ మొదలు- సినీ చరిత్రలోనే ఇదే హెయ్యెస్ట్
బుక్ మై షో ద్వారా రూ.4.50 లక్షల టికెట్ల అడ్వాన్స్ బుకింగ్- సినిమా వాయిదా పడడంతో మొదలైన రిఫండ్ ప్రక్రియ

Published : January 9, 2026 at 8:03 AM IST
Vijay Thalapathy Jana Nayagan Refund : దళపతి విజయ్ 'జన నాయగన్' సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు రావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. సెన్సార్ సమస్యల వల్ల మూవీని వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలిపింది. దీంతో టికెట్ డబ్బులను వెనక్కి తిరిగి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. బుధవారం వరకూ బుక్ మై షో ద్వారా 4.50 లక్షల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇప్పుడు ఆ టికెట్స్‌కు సంబంధించిన మొత్తాన్ని బుక్ మై షో తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలు పెట్టింది. బుక్ మై షోలోనే ఇదే అత్యధిక రిఫండ్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమాను హెచ్. వినోథ్ తెరకెక్కించగా, యంగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనున్నారు. అలాగే మలయాళ బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ సెన్సార్ సమస్యల వల్ల వాయిదాపడింది. కొత్త రిలీజ్ డేట్‌ను ఇంకా మేకర్స్ ప్రకటించలేదు.
విజయ్‌ది ఇదే లాస్ట్ మూవీ
విజయ్ దళపతి కెరీర్లో ఈ సినిమానే ఆఖరిది కానుంది. ఆయన ఇకపై పూర్తిగా రాజకీయాల్లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో 'జన నాయకుడు' తన ఆఖరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఇటీవల మలేసియాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయ్ తల్లిదండ్రులు శోభా, చంద్రశేఖర్‌తో పాటు ప్రియమణి, నటులు బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గీత, దర్శకులు నెల్సన్, అట్లీ, లోకేష్ కనగరాజ్, నటులు నాజర్, సుదీప్ హాజరయ్యారు. వీళ్లతోపాటు వేలాది విజయ్ ఫ్యాన్స్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన విజయ్ కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు.
వివాదాలతోనే విజయ్ కెరీర్
హీరో విజయ్ సినిమాల విషయంలో వివాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఆయన నటించిన సినిమాలన్నీ విడుదలకు ముందు వివాదమవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. 'కావలన్' లా అండ్ ఆర్డర్ వచ్చింది. 'తుపాకి’ పై రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. తలైవా అయితే రాజకీయంగా దుమారం రేపింది. 'కత్తి’కి శ్రీలంకన్ వివాదం ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్,'మెర్సెల్'కు జీఎస్టీ, యానిమల్ వెల్ఫేర్ నుంచి నోటీసులు వచ్చాయి.
'సర్కార్'కు రాజకీయ విమర్శలు 'మాస్టర్'కు కొవిడ్ దెబ్బ, 'వారిసు'కి తక్కువ థియేటర్స్ కేటాయించడంపై ఆందోళన ఏర్పడింది. 'లియో'కు పరిమిత షోలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి సమస్యలతో విజయ్ సినిమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు 'జన నాయగన్'కు సెన్సార్ సమస్య చుట్టుముట్టింది. సీబీఎఫ్‌సీ సూచనల మేరకు మార్పులు చేసినా, బోర్డు సభ్యుల్లో ఒకరి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఆపేశారు. ఇది మద్రాసు హైకోర్టుకు చేరింది. జనవరి 9వ తేదీ ఉదయానికి తీర్పు వెల్లడిస్తామని కోర్టు చెప్పింది. దీంతో సినిమాను పూర్తిగా వాయిదా వేశారు.
సినీ ఇండస్ట్రీ నుంచి విజయ్‌కు పెరుగుతున్న సపోర్ట్
జన నాయగన్ వాయిదా పడటంతో సినీ ఇండస్ట్రీ నుంచి విజయ్‌కు మంచిమద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకులు, నటులు ఆయన సినిమాకు సపోర్ట్‌ను తెలిపారు. పెద్ద సినిమాల పరిస్థితి ఇలా ఉంటే చిన్న సినిమాల పరిస్థితి ఇంకెలా ఉంటుందోనంటూ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ విచారం వ్యక్తం చేశారు. ఒక సినిమా విడుదలకు ముందు ఇలా జరగడం సరైనదని కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వినోద రంగంలో ఓటీటీ, శాటిలైట్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో థియేటర్‌ను మరింత ప్రోత్సహించాలన్నారు. ఇది ఫిల్మ్స్ మేకర్స్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుందన్నారు.
'జన నాయకుడు' మూవీ ట్రైలర్ రిలీజ్- రీమేక్ ప్రచారంపై క్లారిటీ వచ్చేసినట్లే!
బాలయ్య మూవీనే విజయ్ రీమేక్ చేస్తున్నారా?- క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

