'జన నాయకుడు' మూవీ ట్రైలర్ రిలీజ్- రీమేక్ ప్రచారంపై క్లారిటీ వచ్చేసినట్లే!
దళపతి విజయ్ జన నాయకుడు సినిమా ట్రైలర్ రిలీజ్- జనవరి 09న థియేటర్లలోకి రానున్న మూవీ

Published : January 3, 2026 at 7:29 PM IST
Jana Nayakudu Trailer : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన కొత్త సినిమా జన నాయకుడు ఈనెల 09న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో సినిమా మేకర్స్ ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు. తమిళ్‌తోపాటు తెలుగు, హిందీ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ రిలీజైన నిమిషాల్లోనే లక్షల కొద్దీ వ్యూస్‌లో ఇది ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
లాస్ట్ మూవీ
ఈ సినిమానే విజయ్ దళపతి కెరీర్లో ఆఖరిది కానుంది. ఆయన ఇకపై పూర్తిగా రాజకీయాల్లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో 'జన నాయకుడు' తన ఆఖరి సినిమా అని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఇటీవల మలేసియాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయ్ తల్లిదండ్రులు శోభా, చంద్రశేఖర్‌తో పాటు ప్రియమణి, నటులు బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గీత, దర్శకులు నెల్సన్, అట్లీ, లోకేష్ కనగరాజ్, నటులు నాజర్, సుదీప్ హాజరయ్యారు. వీళ్లతోపాటు వేలాది విజయ్ ఫ్యాన్స్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన విజయ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
రీమేక్‌పై క్లారిటీ
అయితే 'జన నాయకుడు' సినిమా నందమూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ మూవీ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని తొలి నుంచీ ప్రచారం సాగుతోంది. కానీ, దీనిపై మేకర్స్ ఎక్కడా స్పందించలేదు. ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఆ సినిమా రీమేకే అని అర్థమైపోతుంది. సినిమాలో మెయిన్ పాయింట్‌నే ఇందులోనూ వాడేశారు. అందులో శ్రీలీల పాత్రను ఇందులో మమిత బైజు పోషించారు. పైగా ఆ పాత్ర పేరు కూడా అదే (విజ్జి) కావడం విశేషం. ఈ పాయింట్‌తోపాటు కొన్ని సన్నివేశాల్లో పోలికలు ఉన్నట్లు కనిపిస్తుంది.
అయితే సెకండ్ హాఫ్ మాత్రం పొలిటికల్ టచ్ ఉండనుంది. 'ప్రజలకు మంచి చేయడానికి రాజకీయాల్లో రమ్మంటే, దోచుకోడానికంట్రా రాజకీయాల్లోకి వచ్చేది' అనే డైలాగుతో అది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే 'ఐయామ్ కమింగ్' అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ఆయన రియల్ లైఫ్‌కు సూట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు. ఆయకు కూడా ఇటీవల సొంతగా పార్టీ స్థాపించి, క్రీయాశీలక రాజకీయాల్లో ఉంటున్నారు. దీంతో ఈ సినిమా ఆయన పొలిటికల్ కెరీర్‌కు కూాడా వర్కౌట్ అయ్యేలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి థియేటర్లలో ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి!
కాగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనున్నారు. అలాగే మలయాళ బ్యూటీ మమితబైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.
భగవంత్ కేసరి
2023లో వచ్చిన 'భగవంత్ కేసరి' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కాజల్ అగర్వాల్‌తోపాటు శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. భారీ విజయం దక్కించుకున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు సైతం దక్కింది. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక నా జీవితం అభిమానులకే అంకితం- రాబోయే 33 ఏళ్లు వాళ్ల కోసమే: విజయ్ దళపతి
విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్- 'జన నాయకుడు' వచ్చేది అప్పుడే!

