ETV Bharat / entertainment

దసరా బరిలో విజయ్ 'రణబాలి'- కొత్త రిలీజ్ డేట్​ ఇదే!

విజయ్​దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో రానున్న 'రణబాలి' - కొత్త రిలీజ్​ డేట్​ను ఎక్స్ ఖాతాలో ప్రకటించిన మూవీటీమ్

Vijay Deverakonda Ranabaali
విజయ్​దేవరకొండ రణబాలి (Source: Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 12:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vijay - Rashmika Ranabaali : స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ అమెరికన్ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ విలన్ రోల్​లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న పాన్ ఇండియా చిత్రాన్ని సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు.

అయితే అనివార్య కారణాలతో విడుదల వాయిదా పడింది. దీనికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ గురువారం చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దసరా కానుకగా అక్టోబరు 16న 'రణబాలి'ని ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.

పెళ్లి తర్వాత విరోష్​కు ఇదే ఫస్ట్ సినిమా
విజయ్‌ దేవరకొండ -రష్మిక మందన్న వివాహం తర్వాత కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 'ది మమ్మీ' సినిమాలో విలన్ క్యారెక్టర్​తో క్రేజ్ తెచ్చుకున్న యాక్టర్ ఆర్నాల్డ్‌ రణబాలిలో నెగిటివ్ రోల్​లో చేస్తుండటంతో సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.

సినిమాకే హైలెట్​గా క్లైమాక్స్
ముఖ్యంగా ఇందులోని క్లైమాక్స్ సినిమాకు ప్రాణమని దర్శకుడు రాహుల్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు. కేవలం ఆ ఫైట్ కోసమే దాదాపు 16 రోజుల పాటు షూటింగ్ చేశారని తెలిసింది. అందులోని విజయ్-ఆర్నాల్డ్ మధ్య ఫైట్‌ సీన్​తో పాటు అద్భుతమైన డ్రామా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి.

రాయలసీమ కరవు బ్యాక్​డ్రాప్​లో రణబాలి!
1876-78 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో వచ్చిన కరవు బ్యాక్​డ్రాప్​లో రణబాలి సాగుతుందని సమాచారం. ఆ సమయంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఓ వీరుడి కథే రణబాలి అని ఇన్​సైడ్ టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ క్యారెక్టర్​లో 'ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ యాక్ట్ చేయనున్నారు.

విజయ్ దేవరకొండ నెక్ట్స్ లెవెల్ డెడికేషన్
ఈ సినిమాలో విజయదేవరకొండ పోషిస్తున్న చారిత్రక యోధుడి పాత్ర కోసం శారీరికంగా ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా ఇందులో గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలు ఎక్కువగా ఉండటంతో నెలల తరబడి పాత్ర కోసం విజయ్ కఠోర శ్రమ పడినట్లు తెలిసింది. గతంలో మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్​ను గమనిస్తే అందులో గుర్రపు స్వారీ చేస్తూ విజయ్ బ్రిటిష్ అధికారిపై పోరాటం చేస్తున్న షాట్​ మనకు కనిపిస్తుంది. నిజమైన ప్రొఫెషనల్ గుర్రపు స్వారీ చేసేవారి మాదిరిగానే ఆ విజువల్స్​లో విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ​

జానపద కథల ఆధారంగా రణబాలి
డైరెక్టర్ రాహుల్​ సంకృత్యాన్ 'టాక్సీవాలా' తర్వాత విజయ్​తో చేస్తున్న రెండో చిత్రమిది. రాహుల్ రాయలసీమ ప్రాంతంలో ప్రజలు చెప్పుకునే జానపద కథల్లో వీరుల గాథలు ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్​ను రాసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'ఏందయ్యా సామి' అనే సాంగ్ సోషల్ మీడియాలో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్​లో ఉంది. ఈ పాటలో విజయ్-రష్మిక మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా పండింది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా తన బెస్ట్ వర్క్​ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై వై. రవిశంకర్, నవీన్ యెర్నేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

కలిసి చేసింది రెండు సినిమాలే- కానీ ఎన్నో యుద్ధాలు చేశాం: విజయ్ దేవరకొండ

పెళ్లయ్యాక 'విరోష్'​ ఫస్ట్​ అప్డేట్​- 'రణబాలి' స్పెషల్ సర్​ప్రైజ్​ వావ్ అనేలా ఉందే!