ఒక్క కట్ కూడా లేకుండా 'రణబాలి'కి సెన్సార్ క్లియరెన్స్
విజయ్ దేవరకొండ రణబాలి సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది.

Published : October 13, 2026 at 4:50 PM IST
Ranabaali Censor : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తయ్యింది. అయితే ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా 'యు/ఏ' సర్టిఫికేట్ లభించడం గమనార్హం.
బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ కథలో కరువు కాటకాల మధ్య అణచివేతకు గురైన ప్రజల తరపున పోరాడే యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. ట్రైలర్‌లోని విజువల్స్ చూస్తే సినిమాలో పోరాట ఘట్టాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు భారీ స్థాయిలో ఉన్నట్లు అర్థమవుతుంది. భారీ పోరాట సన్నివేశాలు, హింస, రక్తపాత దృశ్యాలు ఈ చిత్రంలో కనిపిస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ చెప్పకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం సినిమా తెరపై చూస్తేనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్ సుమారు 2 గంటల 50 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
నార్త్ అమెరికాలో ప్రీ-బుకింగ్స్ అదరహో
ఈ సినిమా కోసం విదేశాల్లోనూ సినీ ప్రేక్షకులు, విజయ్, రష్మిక అభిమానులు ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రాంతంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ బుకింగ్స్ ద్వారా లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సినిమాపై రాబోయే రివ్యూలు, ప్రీ-రిలీజ్ బజ్ ఆధారంగా విడుదల రోజు దగ్గరపడుతున్న కొద్దీ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
#Ranabaali censor Works Completed without any cuts.❤️🔥 With U/A Certificate.❤️ Run Time: 2hr 50mins.🔥 Dussera - Family Entertainment Loading In 3 Days. 🤗 #RanabaaliOnOCT16th https://t.co/rGg0vhYuuI
— Vijay Deverakonda Trends (@VDTrendsOffl) October 13, 2026
తిరుమలలో విజయ్-రష్మిక ప్రత్యేక దర్శనం
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో పాటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మంగళవారం సందర్శించారు. తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం వారు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌లో జరగబోయే 'రణబాలి' ప్రీ-రిలీజ్ వేడుకకు బయలుదేరారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో వీరు కనిపించిన విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక 'జయమ్మ' అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా, హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ విలన్ పాత్రలో పోషిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. బ్రిటీష్ కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటిదాకా తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ రాహుల్ ఈ స్టోరీలో ఏదైనా కొత్త పాయింట్‌ను టచ్ చేశారేమో చూడాలి.
3 రోజుల్లోనే 20 మిలియన్ల వ్యూస్
రణబాలి మూవీలో సెకండ్ సింగిల్‌గా ఇటీవల 'కోబలి' అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ పాట కేవలం 3 రోజులకు 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను అందుకున్నట్లు మూవీటీమ్ అధికారికంగా వెల్లడించింది. ఇక అప్పుడెప్పుడూ రిలీజైన 'ఏందయ్యా సామి' కూడా ఇప్పటీకీ ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో పాటను ఏమైనా రిలీజ్ చేస్తారేమో వేచి చూడాలి.

