విజయ్- రష్మిక 'సంగీత్' పిక్స్ చూశారా? కొత్త జంట డ్యాన్స్ ఎంత క్యూట్‌గా ఉందో!
అందమైన వ్యక్తులతో నిండిన పెద్ద సంతోషకరమైన పార్టీ అని చెప్పిన విజయ్ దేవరకొండ-సంగీతం, పాటలు, మెరుపులు, డ్యాన్స్‌తో నిండిన రాత్రి అంటూ రాసుకొచ్చిన రష్మిక

Published : March 3, 2026 at 10:17 AM IST
Virosh Sangeet Photos : టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ఇటీవల పెళ్లితో ఒకటవ్వగా, తాజాగా సంగీత్ ఫోటోస్‌ను వారిద్దరూ షేర్ చేశారు. "మా సంగీత్ నైట్.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, పాదాలు నొప్పించేంత వరకు నృత్యం డ్యాన్స్ చేస్తూ, ఎన్నో షాక్ లతో గడిపిన సాయంత్రం" అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంగీత్‌లో విరోష్ జంట కలిసి క్యూట్‌గా డ్యాన్స్ వేసినట్టు తెలుస్తోంది.
విజ్జూ, నేను సర్ప్రైజ్లు ఇవ్వాలనుకున్నాం!
అదే సమయంలో రష్మిక కూడా సంగీత్ నైట్లోని అనేక బెస్ట్ మూమెంట్స్‌ను షేర్ చేశారు. ప్రేమ, ఆనంద బాష్పాలు, నవ్వు, సంగీతం, పాటలు, మెరుపులు, డ్యాన్స్‌తో నిండిన రాత్రి, నేను విజ్జు ఒకరినొకరు ఆశ్చర్యపరచాలనుకున్నాం" అంటూ రాసుకొచ్చారు. అయితే రష్మిక పోస్ట్ ద్వారా ఆమె సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన మరిది, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో డ్యాన్స్ చేయడం విశేషం. మొత్తానికి రష్మిక పోస్ట్ చేసిన పిక్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి.
మెరిసిపోయిన విరోష్
రష్మిక ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్ తో అందంగా మెరిసిపోగా, విజయ్ క్లాసీ లుక్‌లో కనిపించారు. ఇద్దరూ కలిసి వేసిన క్యూట్ స్టెప్పులు, సరదా క్షణాలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంగీత్ ఫోటోలు బయటకు రాగానే అభిమానులు, నెటిజన్లు లైక్స్, కామెంట్స్‌తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి వేడుకల్లో ప్రతి ఘట్టాన్ని అభిమానులతో పంచుకుంటున్న విజయ్– రష్మిక జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతం
ఇక సోమవారం నాడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు వివాహం తర్వాత తొలిసారి విజయ్ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మెన్ పేటకు వెళ్లారు. గ్రామానికి చేరుకున్న నూతన వధూవరులకు గ్రామస్థులు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత తన ఫామ్ లో నూతనంగా నిర్మించిన గృహంలోకి విజయ్-రష్మిక దంపతులు గృహప్రవేశం చేశారు.
విద్యార్థులకు స్కాలర్షిప్లు
అనంతరం వేద పండితుల సమక్షంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య జరిగిన ఈ వేడుకలో విజయ్ దంపతులు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. ఆ తర్వాత ఊర్లో అందరికీ విందు భోజనం పెట్టారు. అదే సమయంలో తుమ్మన్‌పేట ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతుల్లో మంచి మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
అయితే విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తెలుగు, కొడవ సాంప్రదాయాల్లో ఒకేరోజున రెండుసార్లు జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బుధవారం నాడు హైదరాబాద్‌లో విరోష్ గ్రాండ్ రిసెప్షన్ కూడా జరగనుండగా, పెద్ద ఎత్తున సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో కలిసి నటించిన ఆ జంట ఇప్పుడు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్గా ఆ సినిమా నుంచి వచ్చిన వెడ్డింగ్ పోస్టర్ ఓ రేంజ్లో అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఆడియన్స్‌తోపాటు అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఆ మూవీ థియేటర్స్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌కు అన్నదానం- రష్మిక ట్వీట్!
'విరోష్' పెళ్లి నగల కోసం 10నెలల కష్టం- కిలోల కొద్దీ బంగారంతో 'రాజసం'- ఆ జ్యువెలరీ స్పెషాలిటీ తెలుసా?

