ట్రెడిషనల్ ఔట్ఫిట్లో 'విజయ్ రష్మిక'- పెళ్లి తర్వాత తొలిసారి ఫ్యాన్స్ ముందుకు!
Vijay Rashmika mandanna Wedding : మిస్టర్ అండ్ మిసెస్ విజయ్ రష్మిక- పెళ్లి తర్వాత తొలిసారి ఫ్యాన్స్ ముందుకు- వీడియో వైరల్

Published : February 27, 2026 at 4:05 PM IST
Vijay Devarakonda Rashmika Mandanna : విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా జంట ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఈ జంట పెళ్లి ఫొటోలే ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా విజయ్ - రష్మిక గురువారం వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే వివాహం తర్వాత ఈ ఇద్దరు భర్యాభర్తలుగా తొలిసారి బయట కనిపించారు. శుక్రవారం ఉదయ్‌పుర్ విమానాశ్రయంలో విరోష్ జంట సింగిల్ ఫ్రేమ్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది.
ఇందులో రష్మిక రెడ్ కలర్ లెహంగాలో గ్రాండ్ లుక్‌లో కనిపిస్తున్నారు. పక్కనే విజయ్ సింపుల్ కుర్తాలో ఆమె చేయి పట్టుకొని నడుస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడికి వచ్చిన అభిమానులందరికీ విజయ్- రష్మిక అభివాదం చేస్తూ, థాంక్స్ చెప్పారు. ఫ్యాన్స్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పలుమార్లు కనిపించినా, భార్యభర్తలుగా తొలిసారి బయటకు రావడంతో అందరి దృష్టి ఈ జంటవైపే మళ్లింది.
#WATCH | Newlyweds Vijay Deverakonda and Rashmika Mandanna arrive at Udaipur airport, greet their fans pic.twitter.com/ZRJAFVUrYz
— ANI (@ANI) February 27, 2026
మోదీకి ఆహ్వానం
కాగా, గురువారం విరోష్ వెడ్డింగ్ జరగ్గా, వచ్చే నెల 04న హైదరాబాద్‌లోని తాజ్ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో తమ రిసెప్షన్ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీకి విజయ్- రష్మిక ఆహ్వానం అందించారు. శుక్రవారం విరోష్ జంట ఆయనను స్వయంగా కలిసి ఆహ్వానం అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ఈ కొత్త జంట కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసింది. ఆయనకు వినాయకుడి ప్రతిమ బహుకరించి, రిసెప్షన్‌కు ఆహ్వానించింది. ఇక ఈ వేడుకకు తెలుగుసహా పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
The #VIROSH Jodi personal Invitation 🤩@TheDeverakonda & @iamRashmika personally met Hon'ble Prime Minister @narendramodiji invited for the grand reception in Hyderabad ❤️❤️✨#VijayDeverakonda #RashmikaMandanna #ViRoshWedding pic.twitter.com/Y23v5XduyD
— Vamsi Kaka (@vamsikaka) February 27, 2026
29.9 మిలియన్ లైకులు
గురువారం ఉదయం తమ పెళ్లి జరగ్గా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక, విజయ్ సాయంత్రం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లోనే ఈ ఫొటోలకు ఫుల్ వైరల్ అయ్యాయి. కేవలం మూడు గంటల్లోనే వారి పోస్ట్‌లకు 29.9 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ఇందులో విజయ్ అకౌంట్ నుంచి షేర్ చేసిన పోస్టుకు 13.6 మిలియన్లు, రష్మిక షేర్ చేసిన పోస్టుకు 16.3 మిలియన్ల లైకులు వచ్చాయి. ఇలా మొత్తం విరోష్ జంట పెళ్లి వేడుకకు సంబంధించి పోస్టుకు మూడు గంటల్లో 29.9 లైక్స్ వచ్చాయి.
ఈ క్రమంలో ఈ జంట కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ సమయంలోనే అత్యధిక లైక్స్ పొందిన భారతీయ సెలబ్రిటీ వెడ్డింగ్ పోస్టుగా విరోష్ కపుల్ రికార్డ్ కొట్టారు. ఇంతకుముందు ఈ రికార్డ్ బాలీవుడ్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్ర- కియారా అడ్వాణీ పెళ్లి ఫొటో పోస్టుకు ఉండేది. వారిద్దరి పెళ్లి పోస్టుకు 27.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇందులో కియారా పోస్టుకు 15.7 మిలియన్ లైక్‌లు రాగా, సిద్ధార్థ్ పోస్టు 11.8 మిలియన్లు పొందింది.
ఈ లిస్ట్‌లో మరికొందరు ప్రముఖ సెలబ్రిటీ కపుల్స్ ఉన్నారు. ఆయా నటీనటుల వెడ్డింగ్ పోస్టులకు లక్షల్లో లైకులు వచ్చాయి. అందులో ఆలియా భట్ - రణబీర్ కపూర్ జంటకు 14 మిలియన్లు, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ 12.6 మిలియన్లు, అతియా శెట్టి - కేఎల్ రాహుల్ వెడ్డింగ్ పోస్టుకు 8.3 మిలియన్ల లైకులు, విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ పెళ్లి ఫొటలకు 7.8 మిలియన్ల లైకులు వచ్చాయి. అయితే ఈ అందరు సెలబ్రిటీల కంటే తాజాగా రష్మిక- విజయ్ పోస్టుకు భారీ స్థాయిలో లైక్స్ రావడం విశేషం.
'మేం ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం'- రష్మిక పెళ్లి వేళ రక్షిత్ కామెంట్స్ వైరల్
Mrs.విజయ్: పెళ్లి తర్వాతా ఫుల్ బిజీబిజీ- రష్మిక చేతిలో 8 సినిమాలు!

