OTTలోకి వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కొరియన్ కనకరాజు మూవీ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచంటే?

Published : August 30, 2026 at 5:06 PM IST
Korena Kanakaraju OTT Details : మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 50+ కోట్లకు పైగా వసూళ్లను సాధించి వరుణ్ తేజ్ కెరీర్లోనే సూపర్హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇందులో వరుణ్ తేజ్ చేసిన రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే దీని థియేటర్ రన్ దాదాపు పూర్తి అవ్వడంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓటీటీ
కొరియన్ కనకరాజు చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లో మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ రూ. 26 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 4 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
50.30 CRORE+ GROSS worldwide in 10 DAYS for the NON-STOP ENTERTAINER #KoreanKanakaraju 🤩🔥
— UV Creations (@UV_Creations) August 17, 2026
Running successfully all over in its second week 💥
Book your tickets now!
— https://t.co/zYQjFkvUIg@IamVarunTej @RitikaNayak_ @GandhiMerlapaka #Satya @MusicThaman #ManojhReddy… pic.twitter.com/iiinAn6pzh
వరుణ్ తేజ్‌కు సాలిడ్ కంబ్యాక్
ఇందులో వరుణ్ తేజ్‌కు జోడీగా హీరోయిన్ రితికా నాయక్ నటించారు. కమెడియన్‌గా సత్య చేసిన నటన ప్రేక్షకులకు నవ్వులు పూయించింది. హీరోగా, విలన్‌గా వరుణ్‌తేజ్ డ్యూయెల్ రోల్స్‌లో చేసిన పెర్ఫార్మెన్స్కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం నుంచి సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సెట్చేసుకున్నారు హీరో వరుణ్‌తేజ్.
తాను చేసే ఒక్కో సినిమాకు వేరియేషన్ చూపిస్తూ యాక్టర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. అదే మాదిరిగా ఈ కొరియన్ బ్యాక్‌డ్రాప్‌తో మరో సూపర్‌హిట్‌ను వరుణ్ తేజ్ సాధించారు. ఆత్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్టోరీలో సత్య కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ యాక్టింగ్, రితికా నాయక్ గ్లామర్, తమన్ మ్యూజిక్ ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సత్య, మురళీధర్ గౌడ్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.
స్టోరీ ఇదే!
కనకరాజు (వరుణ్‌తేజ్) అనే యువకుడిది అనంతపురం జిల్లా పెనుగొండ గ్రామం. అతడు చెక్క భజనలు చేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని చూసుకుంటాడు. ఊరు అన్నాక మిత్రులు, గొడవలు కామన్‌గానే ఉంటాయి. కనకరాజుకు కిష్టప్ప (సత్య) ఫ్రెండ్షిప్, చెంగారెడ్డి (సునీల్) గ్యాంగ్‌తో గొడవలు ఉంటాయి. అయితే పక్క ఊళ్లో ఉన్న ఓ కారు షోరూమ్‌లో హీరోయిన్ రితిక పనిచేస్తుంది. ఆమెతో హీరో ప్రేమలో పడతాడు. ఈ గ్యాప్‌లోనే కొరియా నుంచి ఓ వస్తువు వస్తుంది. అందులోంచి ఓ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పట్నుంచి కనకరాజు చేష్టలు మారుతాయి. ఆ తర్వాత ఆత్మ కోరిక తీర్చేందుకు కనకరాజు తన మిత్రుడితో కలిసి కొరియాకు బయలుదేరుతాడు. అయితే కనకరాజులో ప్రవేశించిన ఆత్మ ఎవరిది? కొరియాలో ఏం జరిగింది? చివరికి ఆత్మ నుంచి విముక్తి లభించిందా? అనే విషయాలు బిగ్ స్క్రీన్‌పై చూసి తెలుసుకోవాల్సిందే.
మెగా హీరోల సినిమాల్లో కామన్ పాయింట్- 'కొరియన్ కనకరాజు'లోనూ అదే!- రిజల్ట్ రిపీట్ అవుతుందా?
ఆగస్టులో బాక్సాఫీస్ సందడి- వరుణ్, రవితేజ, సూర్య సినిమాలు- స్పెషల్ ఫోకస్ ఆ పాన్ఇండియాపైనే!

