తొలి ఇండియన్ సినిమాగా 'వారణాసి' రికార్డ్- రిలీజ్ డేట్ ఇదేనా!
పారిస్‌లోని ప్రఖ్యాత 'లే గ్రాండ్ రెక్స్' థియేటర్‌లో సోమవారం రాత్రి 'వారణాసి' టీజర్‌ను ప్రదర్శన. మొదటి భారతీయ సినిమాగా రికార్డు

Published : January 6, 2026 at 11:21 AM IST
Varanasi le grand rex screening: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'వారణాసి'. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఒకటి ఏంటంటే, పారిస్‌లోని ప్రఖ్యాత 'లే గ్రాండ్ రెక్స్' థియేటర్‌లో సోమవారం రాత్రి 'వారణాసి' టీజర్‌ను ప్రదర్శించారు. ఈ ప్రతిష్టాత్మక థియేటర్‌లో ఒక ఇండియన్ సినిమా టీజర్‌ను ప్రదర్శించడం ఇదే మొదటిసారి.
'లే గ్రాండ్ రెక్స్' అనేది థియేటర్ మాత్రమే కాదు లగ్జరీ ఆడిటోరియం కూడా. ఇందులో దాదాపు 2800 మంది ఆడియెన్స్ ఒకేసారి సినిమా చూడొచ్చు. హాలీవుడ్‌కు చెందిన భారీ సినిమాల స్క్రీనింగ్స్ ఇక్కడ జరుగుతాయి. ఇందులో భారీ లైవ్ కాన్సర్ట్స్, ఆర్కెస్ట్రా ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇలాంటి ఐకానిక్ వేదికపై టీజర్‌ను ప్రదర్శించిన మొదటి ఇండియన్ సినిమా వారనాసి కావడం విశేషం. అంతర్జాతీయ వేదికపై లభించిన అద్భుత స్పందనకు మేకర్స్ ఆనందం వ్యక్తం చేసారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
Premières images du très attendu film de S. S. Rajamouli, #Varanasi, qui arrivera sur grand écran en 2027. #FestivalDeLaBandeAnnonce pic.twitter.com/ZIdRHBpfyn
— Le Grand Rex (@LeGrandRex) January 5, 2026
'లే గ్రాండ్ రెక్స్'లో ప్రతి జనవరిలో కొత్త సినిమాల ట్రైలర్స్, టీజర్ల ప్రదర్శన ఉంటుంది. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న సినిమాల ట్రైలర్లను ఇందులో ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గ్లోబల్ సినీ మేకర్స్ తమ ట్రైలర్స్‌ను ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. వారణాసి కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా ఇప్పటి నుంచే ప్రమోట్ చేసేందుకు 'లే గ్రాండ్ రెక్స్' థియోటర్లో టీజర్ ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
అలాగే, ఈ సినిమా రిలీజ్‌పై కూడా చర్చ నడుస్తోంది. 2027 ఏప్రిల్‌లో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ రాముడి నేపథ్యంలో ఉంటుంది, కాబట్టి వచ్చే ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Merci au Le Grand Rex pour cette projection exceptionnelle.
— Varanasi (@VaranasiMovie) January 6, 2026
Et merci Paris, merci au public français, pour cet accueil incroyable. ✨
De Varanasi à Paris, l’aventure commence. Rendez-vous en 2027 pour l’épopée complète https://t.co/igKZd75rRY
గ్లోబల్ ట్రాటర్ గ్లింప్స్
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓపెన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన టైటిల్ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేసిన గ్లోబ్ ట్రాటర్ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పిచ్చెకించాయి. ఆ గ్లింప్స్‌లో వారణాసి 512 CE, గ్రహశకలం శాంభవి 2027 CE, అంటార్కిటికా ఆఫ్రికా, ఉగ్రభట్టి కేవల్, లంకా నగరం త్రేతా యుగం, వారణాసి మణికర్ణిక ఘాట్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. వీటిని చూశాక టైమ్ ట్రావెలర్, సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, యాక్షన్ అడ్వేంచర్ ఒక్కటేమిటి ఇలాంటి అన్ని జాన్రాలతో మిక్స్ అయి ఈ సినిమా ఉండనుందని అంచనాలు వెలువడుతున్నాయి.
అయితే ఈ గ్లింప్స్‌లో మహేశ్ నందిపై కూర్చొని రౌద్రంగా చూస్తూ, చేతిలో త్రిశూలం పట్టుకొని రావడం మరింత ఆకట్టుకున్నది. చిన్నమస్తాదేవి విజువల్స్ పురాణగాథ ఇతివృత్తాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా విజువల్స్ ప్రకారం 'వారణాసి' కథ భూత, భవిష్యత్, వర్తమానాల్ని కలిపిన స్టోరీగా ఉండనుందని తెలుస్తోంది.
వారణాసి టీమ్ఈ సినిమా విషయానికొస్తే దీంట్లో గ్లోబల్ స్టార్ ప్రియంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే విజయేంద్రప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు.
కొత్త లుక్‌లో మహేశ్ బాబు - ఫొటో వైరల్- 'వారణాసి' సినిమా కోసమేనా?
'పులులతో షూట్ చేసేటప్పుడు చెప్పు- వారణాసి సెట్స్‌కు వస్తా'- రాజమౌళితో జేమ్స్ కామెరూన్

