అనుకున్న సమయం కంటే ముందే 'ఉస్తాద్ భగత్‌సింగ్!'- 'టాక్సిక్' పోస్ట్‌పోన్‌తో ప్లాన్ మార్చనున్న మేకర్స్!
పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్- ప్రీపోన్ కానున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్!'- సిద్ధంగా ఉండాలని డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతల మెసేజ్!

Published : March 4, 2026 at 3:59 PM IST
Ustaad Bhagat Singh Release Date : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా 'ఉస్తాద్ భగత్‌సింగ్' అనుకున్న సమయం కంటే ముందే రీలీజ్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీని 19కే రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. కానీ అది ఇప్పుడు జూన్ 4కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆ డేట్‌ను తీసుకోవాలని 'ఉస్తాద్ భగత్‌సింగ్' మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అయితే తెలుగు వారి నూతన సంవత్సరమైన ఉగాది పండగ ఈ ఏడాది మార్చి 19న ఉంది. ఈ పండగ సందర్భంగా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతోపాటుగా రంజాన్ కూడా ఉండడంతో లాండ్ వీకెండ్ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారట. అందుకే మార్చి 19న సినిమా విడుదలకు సిద్ధంగా ఉండాలని డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం అందించారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌పై అప్డేట్
ఈ సినిమాను ఓవర్సీస్లో 'ప్రత్యంగిరా సినిమాస్' రిలీజ్ చేయనుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్‌లు మార్చి 08 (ఆదివారం) నుంచి ప్రారంభమవుతాయని ఆ సంస్థ వెల్లడించింది. ఈనెల 25న ప్రీమియర్స్ పడనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ అప్డేట్ను షేర్ చేసుకుంది. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత టాక్సిక్ వాయిదా పడింది. దీంతో ఉస్తాద్ ప్రీపోన్ ప్రచారం వేళ అడ్వాన్స్ బుకింగ్స్‌పై కన్ఫ్యూజ్ నెలకొంది. ఏదేమైనా ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Ika Dhada Dhada Pidugulu Padinatte ⚡#UstaadBhagatSingh NORTH AMERICA BOOKINGS Open on Sunday, 8th MARCH
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 3, 2026
11:30 AM PST | 1:30 PM CST | 2:30 PM EST ❤️🔥
GRAND PREMIERES On 25th MARCH, 2026 💥
North America by @PrathyangiraUS
Power Star @PawanKalyan @harish2you @MythriOfficial… pic.twitter.com/R6xZXQGM05
డీఎస్పీతోపాటు తమన్ కూడా!
కాగా, 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ అందించిన పాటలకు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాాయి. అయితే ఈ సినిమాలో బీజీఎమ్ కోసం మేకర్స్ తమన్‌ను సంప్రదించారు. ఆయన ఉస్తాద్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్లు మేకర్స్ అధికారికంగా బుధవారం ప్రకటించారు. గతేడాది పవన్ హీరోగా రిలీజైన ఓజీకి తమనే మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమా బీజీఎమ్ సెన్సేషనల్ అయ్యింది. ఇక గతంలో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' విషయంలో కూడా ఇలాగే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించగా, తమన్, సామ్ సీఎస్ సంయుక్తంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
సినిమాలు- రాజకీయం వేర్వేరు
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ రిఫరెన్స్‌లతో లేదా మరొక మూవీకి రీమేక్‌గా అవుతుందా అనే సందేహాలు వచ్చాయి. ఈ విషయంలో దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది రీమేక్ కాదని, స్టైయిట్ సినిమానేే అని అన్నారు. అలాగే ఈ చిత్రానికి రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. ఇందులో ఎలాంటి పొలిటికల్ రిఫరెన్స్‌లు ఉండవని, అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదం అందించడమే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు. సినిమాలు- రాజకీయాలను వేర్వేరుగా చూడాలని తనకు పవన్ కల్యాణ్ తొలి రోజే చెప్పారని అన్నారు. ఇక మూవీ విషయానికి వస్తే పవన్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రవిశంకర్ నిర్మిస్తున్నారు.
'ఉస్తాద్ భగత్‌సింగ్'లో పొలిటికల్ రిఫరెన్స్?- క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ హరీశ్

