ETV Bharat / entertainment

ఫ్లైట్​లో నటి హల్​చల్​- విమాన సిబ్బందిపై దాడి- ఆ తర్వాత ఏకంగా కొరికి!

విమాన సిబ్బందిపై విచక్షణారహితంగా ప్రవర్తించారు హాలీవుడ్ నటి సెల్మా బ్రెయిర్. వారిపై దాడి చేసి కొట్టినట్లు ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

US Actress Selma Blair
హాలీవుడ్‌ నటి సెల్మా బ్లెయిర్‌ (Source: Eenadu)
author img

By ETV Bharat Telugu Team

Published : October 13, 2026 at 5:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Actress Flight Issue : విమాన ప్రయాణంలో చోటుచేసుకున్న ఘటనతో తాజాగా హాలీవుడ్‌ నటి సెల్మా బ్లెయిర్‌ వార్తల్లో నిలిచారు. లాస్‌ ఏంజెలెస్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఆమె హడావుడి చేశారు. విమాన సిబ్బందిని చేయిచేసుకుని కొట్టడమే కాకుండా, కొరికినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు విమానం దిగిన తర్వాత పోలీసు ఆఫీసర్, ఆస్పత్రి నర్సుపైన కూడా విచక్షణారహితంగా ఆమె దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఆ ఘటనలో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్​లు గాయపడ్డారు.

మరోవైపు, 54 ఏళ్ల సెల్మా బ్లెయిర్‌ నాడీ సంబంధిత సమస్యలకు వాడే మందులు తీసుకోలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనితోపాటు విమానంలో సెల్మా బ్లెయిర్ తలకు గాయం కావడం వల్ల అయోమయానికి గురయ్యారంటూ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆ టైమ్​లో సెల్మా బ్లెయిర్‌ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలిపారు. బ్రేక్ లేకుండా ఎక్కువ గంటలు వర్క్ చేయడం, అలసట, తలకు తగిలిన గాయం కూడా ఆమె పరిస్థితిపై ప్రభావం చూపి ఉండవచ్చని న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఇక ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని వాదించారు. దీనిపై తదుపరి విచారణ జనవరి 19న జరగనుంది.

విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు అలా!
సెల్మా బ్లెయిర్‌ మానసిక పరిస్థితి విషయానికొస్తే, ఆమె గతంలోనూ పలువురు సెలబ్రిటీలను కొరికినట్లు స్వయంగా ఆమె రాసిన పుస్తకంలో స్వయంగా వెల్లడించడం గమనార్హం. పబ్లిక్‌ ఎక్కువగా ఉండే పరిసరాల్లో విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు తాను ఆ విధంగా ప్రవర్తిస్తానని పుస్తకంలో ఆమె రాసుకొచ్చారు. 2006 సంవత్సరంలో మరో నటి సియన్నా మిల్లర్‌ను మొదటిసారి కలిసినప్పుడు ఆమె తన చేతిని కొరికారు. కానీ సియన్నా మిల్లర్ దీనికి పెద్దగా కోపడలేదు. అదే విధంగా లండన్‌లోని హోటల్‌లో సూపర్ మోడల్ కేట్ మోస్ వేలిని కొరకగా, కేట్ మోస్ ఆమెకు రివర్స్‌లో పంచ్ ఇచ్చి బొటనవేలిని గట్టిగా కొరికారు. ఇక ఆ ఘటన తర్వాతే తాను ఎదుటివారికి ఎంత కష్టం కలిగిస్తున్నానో అర్థమైందని సెల్మా బ్లెయిర్ గతంలో తెలపడం గమనార్హం.

సెల్మా బ్రెయిర్ నటించిన సినిమాలు
1999లో 'క్రూయల్ ఇంటెన్షన్స్' లో సెల్మా బ్రెయిర్ హీరోయిన్​గా నటించారు. ఈ టీనేజ్ డ్రామా చిత్రం సెల్మా బ్లెయిర్‌కు హాలీవుడ్‌లో మొదటి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో ఆమె 'సిసిల్ కాల్డ్‌వెల్' అనే అమాయకపు అమ్మాయి పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను MTV మూవీ అవార్డ్ కూడా దక్కింది.

2001లో 'లీగల్లీ బ్లాండ్' అనే కామెడీ మూవీలో సెల్మా బ్లెయిర్‌ నటించారు. ఇందులో మరో నటి రీస్ విథర్‌స్పూన్‌తో కలిసి ఆమె నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో సెల్మా పోషించిన 'వివియన్ కెసింగ్టన్' అనే సీరియస్ లా స్టూడెంట్ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయింది. 2002లో కామెరాన్ డియాజ్, క్రిస్టినా యాపిల్​గేట్​లతో కలిసి నటించిన ఆ రొమాంటిక్ కామెడీ మూవీలో సెల్మా 'జాన్ మెక్​ఫాడెన్' అనే కామెడీ క్యారెక్టర్​తో అలరించారు. ఆపై 2004లో వచ్చిన సూపర్​ హీరో మూవీ 'హెల్ బాయ్​' లో 'లిజ్ షెర్మాన్' అనే కీ రోల్​లో నటించారు. దీనికి ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ 'గిల్లెర్మో డెల్ టోరో' దర్శకత్వం వహించారు. అయితే దీనికి సీక్వెల్​గా 2008లో 'హెల్​బాయ్: ది గోల్డెన్ ఆర్మీ' రూపొందింది. ఈ సినిమాతోనూ సెల్మా బ్రెయిర్ మంచి పాపులారిటీని సంపాదించారు.

ఒక్క కట్ కూడా లేకుండా 'రణబాలి'కి సెన్సార్ క్లియరెన్స్

'టీజర్ కాదు- కానీ ఓ సర్​ప్రైజ్ ఉంటుంది'- ప్రభాస్ బర్త్​డేకు ఫౌజీ అప్డేట్