రెండు రోజుల్లో 'రాజాసాబ్'- అడ్వాన్స్ బుకింగ్స్‌పై నో క్లారిటీ- ఇంకా డైలమాలోనే
సంక్రాంతి సినిమాలకు అడ్డంకులు- రిలీజ్ దగ్గరపడుతున్నా ఇంకా డైలమాలోనే! - ఆ సినిమాల ట్రైలర్లపైనా నో క్లారిటీ!

Published : January 7, 2026 at 10:47 AM IST
Upcoming Sankranthi Movies 2026 : ఈ సంక్రాంతికి టాలీవుడ్లో అగ్రకథానాయకుల సినిమాలతో పాటు యంగ్ హీరోల చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగు, డబ్బింగ్ కలుపుకొని మొత్తం ఏడు సినిమాలు ఈ పండుగ సీజన్‌కు రానున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే విడుదల దగ్గరపడుతున్న క్రమంలో సాధారణంగా సినిమా ప్రమోషన్లు, అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని సినిమాలు ఇప్పటికీ డైలమాలో ఉన్నాయి.
ది రాజాసాబ్
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన హారర్- ఫాంటసీ ఎంటర్‌టైనర్ ది రాజాసాబ్ ఈనెల 09న విడుదల కావాల్సి ఉంది. రిలీజ్‌కు రెండో ఉన్నప్పటికీ ఇంకా అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం కాలేదు. టిక్కెట్ ధరల పెంపు అలాగే ప్రీమియర్ షోల కోసం అనుమతి కోరుతూ నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత టిక్కెట్ల సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. జనవరి 9న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్‌లను ఏర్పాటు చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మార్నింగ్ 4గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది.
మన శంకర వరప్రసాద్
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ మూవీ టీమ్ కూడా టిక్కెట్ రేట్లను పెంచాలని, అలాగే ప్రీమియర్ షోల అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ జాన్రాలో అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 12న థియేటర్లలో విడుదల కానుంది. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు. వాటిని సస్పెండ్ చేయాలని కోరారు.
టికెట్ రేట్లను పెంచడంతో పాటు స్పేషల్ షోల కోసం హోంశాఖ కార్యదర్శికి అప్లికేషన్ పెట్టినట్లు తెలిపారు. ఎమర్జేన్సీ పిటిషన్ కింద విచారణ జరపాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేయనున్నట్లు తెలిపింది. అంటే ఇవాళే క్లారిటీ దీనిపై రానుంది. కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా సినీమా టీమ్ టికెట్ ధరల విషయంలో డెసిషన్ తీసుకోనుంది.
ఇతర తెలుగు సినిమాలు
ఈ రెండు సినిమాలతో పాటు రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి , నవీన్ పొలిశెట్టి హీరోగా కీ రోల్ ప్లే చేసిన చిత్రం అనగనగా ఒక రాజు, అలాగే శర్వానంద్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా నారీ నారీ నడుమ మురారి ఈ సినిమాలకు సంబంధించి ట్రైలర్‌లు ఇంకా విడుదల కాలేదు. అయితే ట్రైలర్లే సినిమాపై హైప్ పెంచుతాయి. కామన్ ఆడియెన్స్‌ను కూడా ట్రైలర్‌లోని కొన్ని సీన్లే థియేటర్ దాకా రప్పిస్తాయి. అలాంటింది మరో వారం రోజుల్లో సినిమా విడుదల ఉన్నప్పటికీ ఈ సినిమాల ట్రైలర్‌లు ఇంకా రాలేదు.
మరో వైపు తమిళ డబ్బింగ్ చిత్రం విజయ్ దళపతి 'జన నాయకుడు' సినిమా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. జనవరి 9నే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉండగా, దీనికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ అందలేదు. ఇప్పటికే చిత్రాన్ని సెన్సార్‌కు పంపగా, ఇప్పటి వరకు సర్టిఫికేట్‌ను రాలేదు. దీంతో ఈ సినిమా టీమ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కూడా బుధవారమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలా సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ భారీగానే ఉన్నా, ఏ ఒక్క సినిమా కూడా అన్ని పనులు పూర్తి చేసుకోలేదు. అన్నీ ఇంకా డైలామాలోనే ఉన్నాయి.
విజయ్ 'జననాయగన్'కు సెన్సార్ కష్టాలు- హైకోర్టుకు మూవీ టీమ్
సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్- బరిలో 7 సినిమాలు - ఎవరైనా కాంప్రమైజ్ అవుతారా?

