Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ చరిత్రలో "ఇద్దరు కెప్టెన్లు" - టాస్క్ ఓడిపోవడంతో ఏడ్చిన మాధురి, ఆయేషా!
- కెప్టెన్లుగా గెలిచిన గౌరవ్, సుమన్ శెట్టి - కంటెండర్‌షిప్ పవర్‌ను ఉపయోగించుకున్న నిఖిల్!

Published : October 17, 2025 at 5:08 PM IST
Two Captains in Bigg Boss 9 Telugu: సీజన్ 9లో ఆరో వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీలు నిర్వహిస్తున్నారు బిగ్‌బాస్. నిన్నటి ఎపిసోడ్లో టాస్క్ గెలిచినవారు ఈ పోటీలో ఉన్నారు. వైల్డ్‌కార్డ్స్ నుంచి గౌరవ్, రమ్య మోక్ష, మాధురి, ఆయేషా, శ్రీనివాస్ సాయి, పాత కంటెస్టెంట్స్ నుంచి సుమన్ శెట్టి కెప్టెన్సీ కాంపిటేషన్‌లో ఉన్నారు. ఈ ఆరుగురికి (నేడు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్) పలు టాస్క్‌లు నిర్వహించారు బిగ్‌బాస్. ఈ మేరకు ప్రోమోలు రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ టాస్క్‌లు ఏంటి? ఎవరు గెలిచారు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
జంటలుగా టాస్క్‌లు: "కెప్టెన్సీ కోసం ఈ బిగ్‌బాస్ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారు" అంటూ బిగ్‌బాస్ అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నిన్న జరిగిన టాస్క్ తర్వాత మొత్తం ఆరుగురు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వారిని మూడు జంటలుగా డివైడ్ చేసి ఈరోజు కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. సుమన్ శెట్టి-గౌరవ్, ఆయేషా-మాధురి, రమ్య-సాయి జంటలుగా ఈ టాస్క్ ఆడారు.
"ఇప్పుడు కెప్టెన్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ 'విడిపించు గెలిపొందు'. ప్రతి జంటలోనూ ఒకరు యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమాధి లోపల బ్లాక్ అయి ఉంటారు. జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి అక్కడ తన పార్టనర్ ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి. ఎవరైతే సమాధి నుంచి బయటకి వచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న బెల్ కొడతారో ఆ జంట విజేతలుగా నిలుస్తారు" అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో సుమన్, మాధురి, రమ్య సమాధుల్లో పడుకున్నారు. ఇక వీటికి లాక్ చేసేసి ప్లేయర్ల చేతిలో వాకీ టాకీ పెట్టారు. దీంతో వాళ్లు తమ పార్టనర్‌కి సంకేతాలు ఇవ్వొచ్చు.
వెక్కివెక్కి ఏడ్చిన ఆయేషా: ఇక స్టార్ట్ బజర్ మోగగానే మాధురి తెగ టెన్షన్ పడింది. "ఆయేషా రెస్పాండ్ అవ్వు" అంటూ అరుస్తుంటే "వింటున్నా వింటున్నా" అని ఆయేషా కోడ్ కోసం పరుగులు పెట్టింది. మరోవైపు సుమన్ శెట్టి కూడా "గౌరవ్ ప్లీజ్ త్వరగా రా" అంటూ టెన్షన్ పడ్డాడు. ఈ టాస్కులో ముందుగా సమాధి డోర్ తెరిచి సుమన్ శెట్టి-గౌరవ్ గెలిచారు. ఇక కొద్దిలో ఓడిపోయినందుకు అయేషా తనని తానే చెంప మీద కొట్టుకుంటూ బాధపడింది. "నా కళ్ల వల్ల పోయింది ఇమ్మూ నాకు కనబడలేదు" అంటూ అయేషా బాధపడుతుంటే.. ఎందుకు అలా చేస్తున్నావ్.. అంటూ మిగిలిన వాళ్లు ఓదార్చారు. మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో మొదటి ప్రోమో ఎండ్ అయ్యింది.
ఇక రెండో ప్రోమోలో కెప్టెన్సీ విషయంలో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో గెలిచిన సుమన్ శెట్టి-గౌరవ్‌లని కెప్టెన్లుగా ప్రకటించి చేతికి కెప్టెన్సీ బ్యాండ్ పెట్టారు. ఇంతలో ఓ అనౌన్స్మెంట్ చేశాడు బిగ్‌బాస్. "నిఖిల్.. మీదగ్గర ఉన్న కంటెండర్‌షిప్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అయ్యే సమయం వచ్చింది. కొత్త కెప్టెన్స్ ఇద్దరిలో నుంచి ఒకరిని మీరు నేరుగా ఛాలెండ్ చేయవచ్చు. ఆ ఛాలెంజ్‌లో మీరు గెలిస్తే వారి స్థానంలో మీరు కెప్టెన్ అవుతారు" అని చెప్పాడు బిగ్‌బాస్. దీంతో గౌరవ్‌ను ఛాలెంజ్ చేస్తున్నట్లు నిఖిల్ చెప్పాడు.
దీంతో గెలుపు కోసం చివరి వరకు అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. పోటీదారులు తమ ఫ్లాట్‌ఫారమ్‌పై ఉన్న కర్రలపై నిలబడి రోప్స్‌కు కట్టిన వెయిట్ బ్యాగ్స్‌ను హ్యాండిల్స్ ద్వారా లాగుతూ కాళ్లు కింద పెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. బజర్ మోగిన ప్రతిసారి సంచాలకులు చెప్పినన్నీ వెయిట్ బ్యాగ్స్‌ను తాను పిలిచిన ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వకూడదనుకునే పోటీదారుని రోప్‌కు హుక్ చేయాల్సి ఉంటుంది" అని టాస్క్ గురించి వివరించాడు బిగ్‌బాస్. ఇక బజర్ మోగగానే గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇద్దరూ కూడా ఈక్వల్‌గానే ఉన్నారు. దీంతో ప్రోమో ఎండ్ అయ్యింది. అయితో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రకారం గౌరవ్ ఈ టాస్క్‌లో గెలిచినట్లు సమాచారం. దీంతో బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారి ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు.
హుషారుగా సుమన్ శెట్టి: ఇక కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి ఫుల్ హుషారుగా గెంతులేసి అరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "అధ్యక్షా.. సుమన్ అనే నేను.. నీతిగా, నిజాయతీగా ఉంటానని హామీ ఇస్తున్నా" అంటూ సుమన్ శెట్టి చెప్పగానే కొంతమంది కంటెస్టెంట్స్ సుమన్‌ని భుజాల మీద ఎక్కించుకొని అటూ ఇటూ తిరిగారు.
Bigg Boss 9 Telugu Day 39 Episode: కెప్టెన్సీ రేసులో "ఆరుగురు" - పవన్ అంటే ఇష్టమంటున్న రమ్య!
Divvela Madhuri Rules: బిగ్‌బాస్ హౌజ్‌లో మాధురి రూల్స్ - మాకేంటీ కర్మ అంటున్న ఆడియన్స్!

