యశ్ ‘టాక్సిక్’ వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
మార్చి 19న విడుదల కావాల్సిన చిత్రం- జూన్ 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన టీమ్

Published : March 4, 2026 at 10:18 AM IST
Toxic Release Date Change : రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ వాయిదా పడింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా వాస్తవానికి ఈ సినిమా మార్చి 19 న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రమోషనల్ మెటీరియల్, పోస్టర్లు, గ్లింప్స్‌లు విడుదలవడంతో సోషల్ మీడియాలో ‘టాక్సిక్’ ట్రెండ్ అయ్యింది. యశ్ లుక్, సినిమా టైటిల్, స్టోరీ లైన్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ‘ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తోనే సినిమా ఓ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోందని స్పష్టమైంది. ఇది సాధారణ మాస్ ఎంటర్‌టైనర్ కాదని, పెద్దల కోసం ఓ డార్క్ ఫెయిరీ టేల్ స్టైల్ కథగా రూపొందుతోందని సినీ వర్గాలు తెలిపాయి.
యశ్ లీడ్ రోల్‌లో, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా స్టార్ ఇమేజ్ సంపాదించిన యశ్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా కావడంతో ఈ మూవీపై గ్లోబల్ లెవెల్లోనే ఆసక్తి నెలకొంది. కానీ విడుదల వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
Toxic : A Fairy Tale for Grown-Ups - in Cinemas Worldwide on 4 June 2026 pic.twitter.com/tg28qLUooH
— KVN Productions (@KvnProductions) March 4, 2026

