యశ్ 'టాక్సిక్' మళ్లీ వాయిదా - కారణం ఏంటంటే?
కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామన్న చిత్రబృందం - డిస్ట్రిబ్యూషన్, పార్ట్‌నర్‌షిప్ కోసం ప్రయత్నాలు

Published : April 29, 2026 at 12:36 PM IST
Toxic Movie Postponed : యశ్ నటించిన టాక్సిక్ చిత్రం మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని యశ్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. టాక్సిక్ చిత్ర నిర్మాణం పూర్తయిందని, ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్, పార్ట్‌నర్‌షిప్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ఈ మూవీ జూన్ 4న విడుదల కావాల్సి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఒకే తేదీకి రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్, పార్ట్‌నర్‌షిప్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చిత్రబృందం పేర్కొంది. "అంతర్జాతీయంగా డిస్ట్రిబ్యూషన్, భాగస్వామ్యాలు జరుగుతున్న కారణంగా విడుదల తేదీని మారుస్తున్నాం. ప్రపంచవ్యాంప్తగా ఒకే తేదీకి రిలీజ్ చేసేలా కొత్త డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. ఆడియెన్స్ అంచనాలు అందుకునేలా కొంచెం టైమ్ తీసుకుని, బెస్ట్ ఔట్‌పుట్ అందించాలనుకుంటున్నాం"
"మేము తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, అలాగే సినిమాపై మాకు ఎందుకు ప్రేమ పుట్టిందో గుర్తుచేసే సినిమాలు మరికొన్ని ఉంటాయి. 'టాక్సిక్' అలాంటి ఒక ప్రయాణమే. సినిమాకాన్‌లో మా చిత్రాన్ని ప్రదర్శించి, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అద్భుతమైన స్పందనను చూడడం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అర్హత కలిగినదని నిరూపిస్తాం" అని హీరో యశ్ ఓ నోట్ రిలీజ్ చేశారు.
— KVN Productions (@KvnProductions) April 29, 2026
మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో
మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో యష్ హీరో కాగా రుక్మిణి వసంత్, నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కించారు. 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని కూడా యష్ ( మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ) తో కలిసి నిర్మించింది. తొలుత మార్చి 19 అనుకున్నారు కుదర్లేదు. తర్వాత జూన్ 4 అన్నారు. అది కూడా వర్కౌట్ కాలేదు. మరి ఈసారైనా ఓ తేదీ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. ఈ చిత్రం కన్నడ, ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం వెర్షన్లలో విడుదల కానుంది.
పెద్ది జూన్ 4!
'టాక్సిక్' సినిమా మరోసారి వాయిదా పడటంతో ఇప్పుడు ఆ తేదీ ఖాళీ అయ్యింది. దీంతో జూన్ 04ను ఏ సినిమా తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. అయితే రాణ్చరణ్- బుచ్చిబాబు 'పెద్ది' షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా జూన్ 25న వస్తుందని డైరెక్టర్ బుచ్చిబాబు ఓ సినిమా ఈవెంట్లో చెప్పినా, దీనిని మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.
అయితే ఈ సినిమా జూన్ 4 న విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే జూన్ 5న విడుదల కానున్న 'రావ్ బహదూర్' మినహా ఆ వారంలో మరే పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. దీంతో కావాల్సినన్ని స్క్రీన్లు కూడా లభించే అవకాశం ఉంటుంది.
లెనిన్‌కు లైన్ క్లియర్ చేస్తారా?
మరోవైపు, అఖిల్ అక్కినేని 'లెనిన్' జూన్ 26 తేదీన విడుదల కానుంది. బుచ్చిబాబు కామెంట్స్ ప్రకారం పెద్ది 25న వస్తే క్లాష్ ఉంటుంది. అయతే ఇప్పటికే పెద్ది కోసం లెనిన్ సినిమాను మే 1నుంచి జూన్‌కు మార్చుకున్నారు. ఈ క్రమంలో పెద్ది మేకర్స్ కూడా లెనిన్ కోసం లైన్ క్లియర్ చేస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ పెద్ది సినిమాను జూన్ 4 న విడుదల చేస్తే లెనిన్తో క్లాష్ ఉండదు. మరీ ఈ రెండు సినిమాలపై మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
అఖిల్ 'లెనిన్'కు పోటీగా రామ్‌చరణ్ 'పెద్ది'- బాక్సాఫీస్ క్లాష్ తప్పేలా లేదుగా!
చరణ్ 'పెద్ది' వాయిదా పడనుందా? రేసులోకి మరో పాన్ ఇండియా సినిమా! నిజమెంత?

