18 ఏళ్ల కల- అల్లు అర్జున్ 'రాకా'తో నిజమవుతోంది: అట్లీ
పోస్టర్‌ను చూసి తెగ మురిసిపోతున్న అల్లు అర్జున్ అభిమానులు - దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్

Published : April 8, 2026 at 5:18 PM IST
Atlee Latest X Post: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ఈ కోవలోనే అట్లీ – అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి 'రాకా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు కొత్తగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్ గుండుతో, కంటి చూపుతోనే శత్రువులను భయపెట్టే వాడిలా చూస్తూ, తోడేలు లాంటి చేతులతో కనిపించారు. ఈ పోస్టర్‌ను చూసి అల్లు అర్జున్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. దర్శకుడు అట్లీ ఈ సినిమాకు తన పోస్ట్‌తో మరింత హైప్ తెచ్చారని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు.
రెండు దశాబ్దాల కల
అట్లీ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో 'రాకా' కేవలం భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కాదని, ఇది అతను దాదాపు రెండు దశాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక కల అని తెలిపారు. "18 ఏళ్లుగా నేను ఒకే ఆలోచనను పట్టుకుని, దాన్ని మసకబారనివ్వలేదు. అది నన్ను పరీక్షించింది, తీర్చిదిద్దింది, అన్ని సమయాల్లో నాతోనే ఉంది. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని అన్నారు. అట్లీ వ్యాఖ్యలతో 'రాకా' సాధారణ సినిమాలాగా ఉండదనే చర్చ సినీ వర్గాల్లో నడుస్తోంది. 2027 వేసవిలో ఏడు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.
Specially made for our #Raaka...❤️🔥
— Bunny Vas (@TheBunnyVas) April 8, 2026
Once again, happy birthday to my dearest Icon star, @alluarjun garu. As you continue to leap beyond limits, we’re here to celebrate you, as always✨❤️❤️#HappyBirthdayAlluArjun #AA22XA6 @Atlee_dir @deepikapadukone @sunpictures#राका | #రాకా… pic.twitter.com/Oe3v4OpixP
ఇదే కాన్సెప్ట్ ఫస్ట్ లుక్‌లో
సినీ నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోవైపు అల్లు అర్జున్ ఆర్మీ అతని 44వ పుట్టినరోజును ఘనంగా జరిపింది. ఈ బృందం 'రాకా' లుక్‌తో ఉన్న ఒక ప్రత్యేకమైన కేక్‌తో అల్లు అర్జున్ అభిమానులను సర్ప్రైజ్ చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియోలో చెప్పారు.
#Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.
— atlee (@Atlee_dir) April 8, 2026
It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs
ఇండియన్ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక చిత్రంగా
మ్యూజిక్ విషయానికి వస్తే, మొదట ఈ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాకా నిజంగా పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి రాకా టైటిల్, బన్నీ షాకింగ్ లుక్, అట్లీ మార్క్ ప్రెజెంటేషన్ అన్నీ కలిసి ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ ప్రత్యేక చిత్రంగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి. బన్నీ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రియులందరూ ఇప్పుడు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఆసక్తిగా బన్నీ, అట్లీ మూవీ టైటిల్- ఇంతకీ ఏం పేరు పెట్టారంటే?
విమర్శల నుంచి నేషనల్ అవార్డ్ వరకు- బన్నీ ప్రయాణం 'తగ్గేదేలే'!- ఐకాన్ స్టార్ బర్త్ డే స్పెషల్

