'ఆస్కార్' రేసులో 2 సూపర్ హిట్ ఇండియన్ మూవీస్- జనరల్ ఎంట్రీ జాబితాలో చోటు
ఆస్కార్ అవార్డ్స్‌లో రేసులో కాంతార చాఫ్టర్ 1, మహావతార్ నరసింహ - జనరల్ ఎంట్రీ జాబితాలో స్థానం కైవసం

Published : January 9, 2026 at 10:57 AM IST
Kannada Films Into Oscars : కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు సినిమాలు 'కాంతార చాఫ్టర్ 1', 'మహావతార్ నరసింహ' ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి వచ్చాయి. ఆ రెండు చిత్రాలను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. గతేడాది థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. 'కాంతార చాఫ్టర్ 1' జనరల్ ఎంట్రీ జాబితాలో చోటు దక్కించుకోవటంతో పాటు ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ సహా పలు కేటగిరీల్లో అర్హతను సంపాదించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
రెండు కన్నడ సినిమాలేే
హోంబలే ఫిల్మ్స్ సంస్థ నుంచి 'సలార్', 'కేజీఎఫ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ చిత్రాలు ప్రభాస్, యశ్ కెరీర్లో మంచి హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత గతేడాది ఎటువంటి అంచానాలు లేకుండా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించినప్పటికీ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ఇండియా లెవల్లో సరికొత్త రికార్డును సాధించింది.
A sacred journey born from faith, glory, and eternal belief.
— Hombale Films (@hombalefilms) January 9, 2026
Truly honoured and elated as #MahavatarNarsimha enters Best Picture contention at the #Oscars Academy Awards 2026.#MahavatarForOscars#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/CIFlY8nxci
ఈ సినిమా కూాడా 2026 ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో పలు దేశాల నుంచి వచ్చిన 35 సినిమాల్లో 'మహావతార్ నరసింహ' కూడా ఒకటిగా నిలిచింది. భారత్ నుంచి ఎంపికైన తొలి యానిమేటెడ్ చిత్రంగా ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన సినిమాగానూ 'మహావతార్' నిలిచింది. ఒకవేళ ఈ సినిమా అవార్డ్ దక్కించుకుంటే మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నట్లే అవుతుంది.
Rooted in our culture, driven by divinity.
— Hombale Films (@hombalefilms) January 9, 2026
Proud and privileged as #KantaraChapter1 enters the Best Picture contending race at the #Oscars Academy Awards 2026.#KantaraForOscars#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets… pic.twitter.com/xSCsH28Qjr
ఈ సినిమా కథేంటంటే
శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రాక్షసరాజు హిరణ్యకశిపుడు, బ్రహ్మ దేవుడి తాను సృష్టించిన ఏ జీవి వల్ల, ఎలాంటి కాలంలోనూ ఏ అస్త్ర శస్త్రాల నుంచి తన ప్రాణాలకి ముప్పు కలగకూడదని వరం పొందుతాడు. ఆ తర్వాత ముల్లోకాలకు తానే అధిపతినని, తానే భగవంతుడినని స్వయంగా అతనే ప్రకటించుకుంటాడు. భూలోక ధర్మాన్ని కాలరాస్తాడు. తన సోదరుడి మరణానికి కారణమైన మహావిష్ణువుపై ద్వేషం పెంచుకుంటాడు. కానీ, తన కుమారుడు ప్రహ్లాదుడు శ్రీవిష్ణువుకి భక్తుడిగా మారతాడు. ఇది సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ అనర్థం జరగకుండా మహావిష్ణువు ప్రహల్లాదున్ని ఎలా కాపాడాడు, విష్ణువు మహా అవతారం ఎలా ఎత్తాల్సి వచ్చింది? అనే విషయాలు ఇందులో చూడవచ్చు.
కాంతార ప్రీక్వెల్
అలానే హోంబాలే రూపొందించిన మరో చిత్రం 'కాంతార ఛాప్టర్- 1'. ఈ చిత్రానికి హీరో రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైన 'కాంతార'కు ప్రీక్వెల్‌గా రిలీజ్ చేశారు. తొలి భాగంలాగానే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. ఆస్కార్ నామినేషన్స్‌లో బెస్ట్ పిక్చర్ కేటగిరిలో కూడా స్థానం సంపాదించుకుంది.
98వ ఆస్కార్ అవార్డ్స్
98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ జాన్రాకు చెందిన సినిమాలు నామిమేషన్లకు పంపుతున్నారు. దీనికి సంబంధంచిన తుది ప్రకటన జనవరి 22న ప్రకటిస్తారు. ఈసారి ఆస్కార్ అధికారిక ఎంట్రీ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) పరిశీలించిన 24 చిత్రాలలో ఐదు తెలుగు సినిమాలు ఉన్నాయి. 'పుష్ప 2: ది రూల్', 'కన్నప్ప', 'సంక్రాంతికి వస్తున్నాం', 'కుబేర', 'గాంధీతాత చెట్టు'. అయితే, తుది ఎంపికలో 'హోమ్‌బౌండ్' సినిమాకే అవకాశం దక్కడంతో ఇవి అఫీషియల్ ఎంట్రీ రేసు నుంచి తప్పుకున్నాయి.
ఆస్కార్ అవార్డ్స్ వేడుక- 2029 నుంచి యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్
ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లోకి ఇండియన్ మూవీ- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాన్వీ సినిమా

