ETV Bharat / entertainment

భయం, హాస్యం, విజువల్​ ఫీస్ట్- అదిరిపోయిన రాజాసాబ్ 2.0 ట్రైలర్

ది రాజాసాబ్​ 2.0 ట్రైలర్ - అదరగొట్టిన రెబల్ స్టార్​ ప్రభాస్​

The Raja Saab
The Raja Saab (Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : December 29, 2025 at 5:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

The Raja Saab Trailer 2.0 Release : మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రాజాసాబ్'. 2026 జనవరి 9న సంక్రాంతికి ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే ఒక ట్రైలర్​ను విడుదల చేసిన మేకర్స్ సోమవారం సాయంత్రం మూవీకి సంబంధించిన రెండో ట్రైలర్​ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ను మరింత హీటెక్కించారు. భయం, హాస్యం, విజువల్​ ఫీస్ట్ తో రెండో ట్రైలర్ అదిరపోయింది.

సంజయ్ దత్ ప్రభాస్ తాతగా నటిస్తున్నారు. తాత మరణించిన తర్వాత అతను ప్రేతాత్మగా మారుతాడు. అతని ఆత్మ ఒక భవనంలో తిరుగుతింది. ప్రభాస్ తన తాత గురించి వివరాలు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఒకవైపు నవ్వు పుట్టిస్తూనే, మరోవైపు భయపెట్టేలా ఉన్నాయి. రెండో ట్రైలర్​ను బట్టి చూస్తే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీని మారుతి చాలా సస్పెన్స్ తో తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.

ది రాజాసాబ్​ విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. రెండు రోజుల క్రితం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అందులోనే ప్రభాస్ ఆదివారం ట్రైలర్​ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఒక్క రోజు ఆలస్యంగా ట్రైలర్​ 2.0 రిలీజ్ చేశారు.

ఒక రోజు ఇరగదీస్తా!
ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ప్రభాస్ తన స్పీచ్​తో అభిమానులను అలరించారు. తాను వేదికలపై సరిగ్గా మాట్లాడలేనని, అయితే ఏదో ఒక రోజు స్పీచ్​ను ఇరగదీస్తా అని అన్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన సీనియర్ హీరోల సినిమాలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాము అన్నీ సీనియర్స్ నుంచే నేర్చుకున్నామని, సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమాలో తన నాన్నమ్మ పాత్ర కూడా ఒక హీరో లెవల్లో ఉంటుందని అన్నారు. ఐ లవ్ యూ డార్లింగ్స్ అంటూ అభిమానులను ఖుషీ చేశారు.

ప్రభాస్ స్పీచ్ ఇచ్చేటప్పుడు అభిమానులు బాహుబలి, బాహుబలి అని గట్టిగా అనడంతో, ప్రభాస్​ వారితో ,'నేను బోరింగ్ మాట్లాడుతా. అందుకే మీరు బాహుబాహు బాహుబలీ అని అంటున్నారు. కానీ ఒక రోజు నేను మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్​టైన్​ చేస్తా' అని అన్నారు. దీనితో అభిమానులు కేరింతలతో తమ సంతోషం వ్యక్తం చేశారు. డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడుతూ, 'నీవు డైలాగ్స్​ పెన్​తో రాశావా, మెషీన్​గన్​తో రాశావా?' అని కొనియాడారు. హైదరాబాద్​లో నిర్వహించిన ది రాజాసాబ్​ ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్ ఈ మేరకు తన అభిమానులను, ప్రేక్షకులను అలరించారు.

పెద్ద సినిమానే!
టికెట్​ బుకింగ్​ పోర్టల్​ ప్రకారం, ఈ సినిమా రన్​టైం 195 నిమిషాలుగా చూపిస్తుంది. అంటే దాదాపు 3 గంటల 15 నిమిషాలు. కానీ ఈ చిత్రం నిడివి గురించి అఫిషియల్​ సమాచారం ఇంకా బయటికి రాలేదు. విడుదల తేది దగ్గర పడుతున్న కొద్దీ దీనిపై మరింత క్లారిటి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్​లో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి.

కాగా, ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కించారు. థమన్ మ్యూజిక్ అందించారు. ఇది రొమాంటిక్‌ కామెడీ హారర్‌ జాన్రాగా రూపొందింది. ఇందులో ప్రభాస్‌ సరసన నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఇందులో చాలా రోజుల తర్వాత ప్రభాస్​ను వింటేజ్ లుక్​లో ప్రేక్షకులు చూడనున్నారు. మారుతి దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంక్రాంతి కానుకగా జనవరి 09న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. థియేటర్ రిలీజ్​కు ఒక రోజు ముందు అంటే జనవరి 08న రాజాసాబ్ ప్రీమియర్లు ఉండనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదిక ఎక్స్​లో పోస్ట్ షేర్ చేశారు.