ETV Bharat / entertainment

విజయ్ కుటుంబంలో ముదురుతున్న వివాదం!- తండ్రికి షాక్ ఇచ్చిన కొడుకు- ఏమైందంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ కుటుంబం కాంట్రవర్సీ- కోర్టులో విడాకుల కోసం విజయ్ భార్య సంగీత దరఖాస్తు- వివాదం నడుస్తుండగానే, కుమారుడు జేసన్ షాకింగ్ డెసిషన్

Thalapathy Vijay
Thalapathy Vijay (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 1:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Thalapathy Vijay : తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు వివాదంగా మారింది. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో దశాబ్దాల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్థలు రావడం కోలీవుడ్​లో కలకలం రేపుతోంది.

ముఖ్యంగా విజయ్ ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, అదే తమ విడాకులకు ప్రధాన కారణమని సంగీత ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ గొడవల మధ్య వారి పిల్లలు కూడా మానసిక వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విజయ్ కుటుంబంలో విభేదాలు మరింత సీరియస్​గా మారినట్లు అర్థమవుతోంది. తాజాగా ఆయన కొడుకు చేసిన పని ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. ఇంతకీ కొడుకు సంజయ్ ఏం చేశాడు? తెలుసుకుందాం!

తండ్రికి షాకిచ్చిన కొడుకు!
విజయ్, సంగీత దంపతులకు 25 ఏళ్ల కొడుకు జేసన్ సంజయ్, 20 ఏళ్ల కూతురు దివ్య సాషా ఉన్నారు. సాధారణంగా జేసన్ సంజయ్ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతుంటారు. అయితే ఇటీవల తన తండ్రి విజయ్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కుటుంబంలో జరుగుతున్న గొడవలపై తన నిరసనను ఇలా మౌనంగా వ్యక్తం చేస్తున్నారని సన్నిహితులు భావిస్తున్నారు. తల్లికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే సంజయ్ తండ్రికి దూరంగా ఉంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ కొడుకు దర్శకుడిగా కూడా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. యువ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న సిగ్మా సినిమాకు సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. రేపో మాపో ప్రమోషన్స్ కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది. అలాంటిది ఈ టైమ్​లో కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరగడం పెద్ద షాక్.

2021 నుంచే మొదలైన గొడవలు
సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్​లో విజయ్​పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2021 నుంచి విజయ్ తనతో మాట్లాడటం మానేశారని, కనీసం మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఒకే ఇంట్లో ఉంటూనే తనను విడిగా ఉండాలని బలవంతం చేశారని, మానసికంగా ఎంతో వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనతో కాకుండా ఒక నటితో కలిసి విదేశీ ప్రయాణాలు చేయడం, బహిరంగంగా తిరగడం వంటి విషయాలను కూడా పిటిషన్ లో ప్రస్తావించారు. శాశ్వత భరణంతో పాటు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనే నివసించే హక్కు కల్పించాలని సంగీత కోర్టును కోరారు.

విజయ్ మౌనం
దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకుడు'తో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లే తరుణంలో ఇటువంటి విడాకుల వివాదం అతనికి తలనొప్పిగా మారింది. భార్య చేసిన ఆరోపణల మీద గానీ, కొడుకు తనను అన్‌ఫాలో చేయడం మీద గానీ విజయ్ ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు.

ఈ వివాదం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విజయ్ వ్యక్తిగత జీవితంలో రేగిన ఈ తుఫాను ఎటు దారితీస్తుందో చూడాలి. సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే తమిళ ప్రజలు ఈ విడాకుల అంశాన్ని ఎలా స్వీకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.