సందీప్ కిషన్ కొత్త సినిమా అనౌన్స్మెంట్- కెరీర్లో తొలిసారి ఫాంటసీ అడ్వెంచర్ మూవీ!
సందీప్ కిషన్ అప్‌కమింగ్ సినిమా- ఈసారి కొత్త అవతార్‌లో కనిపించనున్న హీరో- రెండు భాగాలుగా రానున్న పీరియాడికల్ చిత్రం

Published : August 5, 2026 at 12:53 PM IST
Sandeep Kishan New Movie : లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్తో గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. అయితే ఈసారి ఆయన రూట్ మార్చారు. కెరీర్లో తొలిసారి ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో కనిపించనున్నారు. శంబాల మూవీతో డైరెక్టర్‌గా సత్తా చాటిన యుగంధర్ ముని కలయికలో సందీప్ చేయనున్న సినిమా నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు 'కరికాల' అనే పేరు ఫిక్స్ చేస్తూ మేకర్స్ బుధవారం టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఈ పోస్టర్‌ను అఫీషియల్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.
ఇంట్రెస్టింగ్గా 'కరికాల' టైటిల్ పోస్టర్
'రాజులు, తోడేలు, సింహాలు ఉన్న మాయాజాలం. కరికాల ప్రపంచంలోకి అడుగుపెట్టండి. యుగంధర్ ముని నుంచి ఒక అద్భుతమైన ఫాంటసీ సాహస గాథ రానుంది' అంటూ మేకర్స్ ఇంట్రెస్టింగ్గా తమ పోస్టులో రాసుకొచ్చారు. అయితే ఇక్కడే ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తీసుకురానున్నట్లు మూవీటీమ్ వివరించింది. ఈ పోస్టర్లో సందీప్ కిషన్ గుర్రపు స్వారీ చేస్తున్న ఓ యోధుడిగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో ఆడియెన్స్‌లో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
A world of Kings. Lions. Wolves. Magic.
— Shining Pictures (@ShiningPictures) August 5, 2026
Step into #Karikaala
An epic fantasy adventure from @ugandharmuni.
Releasing On:
Chapter 1—02 July 2027
Chapter 2 — 28 October 2027
Telugu - Tamil - Hindi
Produced by @bhavanidvd & @Mahidhar2003 @sundeepkishan @SricharanPakala pic.twitter.com/eACTMp8t5S
కరికాలుడిగా సందీప్!
కరికాల మూవీలో సందీప్ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ఆయన డ్రెస్సింగ్ కూడా ఒక యోధుడిగాలాగా కనిపిస్తుంది. పోస్టర్‌ను గమనించినట్లైతే, ఇందులో సందీప్ గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఒక చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో డాల్ ఉన్నాయి. ఆయనతోపాటుగానే పక్కన గర్జిస్తున్న సింహం ఉంది. అంటే ఆ సింహంతో కలిసి సందీప్ యుద్ధానికి వెళ్తున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఇక బ్యాగ్రౌండ్లో చెట్లు, వాటిపై కాంతివంతంగా మెరుస్తున్న ఫ్లవర్స్, చుట్టూ ఉన్న పరిసరాలతో దీనిని ఒక మ్యాజికల్ వరల్డ్లాగా క్రియేట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే, తెలుగు ఫేమస్ చందమామ కథల నుంచి స్ఫూర్తి పొంది దీనిని సృష్టించినట్లు అనిపిస్తుంది. ప్రాచీన ఇతిహాసాలు, రాజుల కాలం నాటి రాజ్యాలను ఇందులో చూపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఒకవరాల్గా సందీప్ తన కెరీర్లో తొలిసారి సినిమాలో కత్తి పట్టి యుద్ధం చేయునున్నారన్న మాట!
Teaming up for The incredibly Ambitious #KariKaala with visionary/passionate Director & Producers of #Shambala .. 🧿
— Sundeep Kishan (@sundeepkishan) August 5, 2026
Migathadi motham Cinema Matladuthundi… 🗡️
Telugu - Tamil - Hindi @ugandharmuni @Mahidhar2003 #RajaShekarAnnabhimoju @SricharanPakala #SK33 pic.twitter.com/W2TzHO9RuF
మూడు నెలల్లోనే రెండు భాగాలు
అలాగే ఇప్పుడే రెండు భాగాలకు సంబంధించిన విడుదల తేదీలను మేకర్స్ అనౌన్స్ చేసేశారు. వచ్చే ఏడాది 2027 జులై 02న కరికాల తొలి పార్ట్ రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత మూడు నెలలకు అంటే 2027 అక్టోబర్ 28న రెండో భాగాన్ని కూడా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం చూస్తే రెండు పార్టుల చిత్రీకరణను ఏకకాలంలోనే పూర్తి చేసే యోచనలో మూవీటీమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆది సాయికుమార్‌తో 'శంబాల' సినిమాతో మిస్టికల్ వరల్డ్ క్రియేట్ చేసి యుగంధర్ ముని తొలి సినిమాతోనే విజయం సాధించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే డిఫరెంట్ జోన్లో తీసుకురానున్నారు. కొత్త ప్రపంచంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్తిస్తున్న ఈ సినిమా ఎంతమేర థ్రిల్ పంచుతుందో వేచి చూడాలి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమాను షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు నిర్మిస్తున్నారు.
సందీప్ కిషన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల సందీప్ చేసిన 'సూపర్ సుబ్బు' అనే వెబ్ సిరీస్ నెట్‌ప్లిక్స్ వేదికగా రిలీజ్ అయింది. కామెడీ డ్రామా తెరకెక్కిన ఈ సిరీస్‌ను సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ అలరించారు. ఈ సిరీస్‌కు ఓటీటీలో మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్, తమిళనాడు సీఎం కుమారుడు జేసన్ సంజయ్ తో చేసిన 'సిగ్మా' విడుదలకు రెడీగా ఉంది. అదే విధంగా లిరిసిస్ట్ కమ్ డైరక్టర్ కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్‌పేట' అనే పీరియాడికల్ పొలిటికల్ డ్రామాలోనూ నటిస్తున్నారు. ఇలా సందీప్ కిషన్ లైనప్‌లో భారీ పాన్ ఇండియా చిత్రాలతో పాటు కంటెంట్ ప్రధానమైన సినిమాలను కూడా చేసుకుంటూ కెరీర్లో రాణిస్తున్నారు. ఇతను హీరోగానే కాకుండా ప్రస్థానం, రాయన్, కెప్టెన్ మిల్లర్ మొదలైన చిత్రాల్లో సైతం కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
టాలీవుడ్ హీరో మంచి మనసు - నెలకు నాలుగున్నర లక్షల ఫుడ్ ఫ్రీగా పంచుతూ!

