'మన శంకరవరప్రసాద్ గారు'కు తెలంగాణలోనూ టికెట్ రేట్ పెంపు- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా!
'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ రేట్లు పెంపు- హైదరాబాద్‌లోనూ ప్రీమియర్ షోలు- టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Published : January 10, 2026 at 1:18 PM IST
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ప్రీమియర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పెషల్ షోతో పాటుగా టికెట్ రేటు పెంపునకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా మెమో జారీ చేసింది. మరి రేట్లతో టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ సినిమా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీనకి ఒకరోజు ముందు, జనవరి 11 రాత్రి ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8గంటల నుంచి 10 గంటల మధ్య షో ను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్ ధరను రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్‌లో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర అదనంగా ఉంటుంది.
అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా శుక్రవారం రాత్రే ప్రీమియర్ షోతోపాటు టికెట్ పెంపునకు అనమతి ఇచ్చింది. ఏపీలో కూడా జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ షో ఉండనుంది. రాత్రి 8గంటల నుంచి 10 గంటల మధ్య షో ను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ షో టికెట్ ధరను రూ.500 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించింది. ఇక జనవరి 12వ తేదీ నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. ఈ సమయంలో సింగిల్ స్క్రీన్‌లో రూ.100 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.125 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర అదనంగా ఉంటుంది. అలాగే, ఈ 10రోజులు కూడా రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
సేల్స్ షురూ
ఈ సినిమా ప్రీమియర్స్‌కు మరో 24 గంటలే సమయం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్స్ కొద్దిసేపటి కిందే బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అడ్వాన్స్ సంబరాలు షురూ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్స్ బుక్ చేసుకోండి అని కొత్త పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాళ ఉదయమే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి.
Let the celebrations begin in advance🥳🔥
— Shine Screens (@Shine_Screens) January 10, 2026
ANDHRA PRADESH PREMIERE BOOKINGS ARE NOW OPEN for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
Book your tickets 🎟️
-- https://t.co/iMfq49Nhsg
GRAND PREMIERES TOMORROW 💥#MSG MASSIVE RELEASE WORLDWIDE IN THEATRES ON JANUARY 12, 2026.… pic.twitter.com/swNR9XUrjY
టికెట్ బుకింగ్ ప్రముఖ ప్లాట్‌ఫామ్ బుక్‌మై షో లో ఈ సినిమాపై సినీలవర్స్ భారీ సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2.60 లక్షల మంది లైక్ చేశారు. అటు ఓవర్సీస్లోనూ బుకింగ్స్ జోరుగానే కొనసాగుతున్నాయి. యూకేలో 30 వేలకుపైగా టికెట్లు సోల్డ్ అయ్యాయి. యూఎస్ఏలోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 5 లక్షల డాలర్లు వసూల్ చేసేసింది.
USA is going absolutely bonkers for #ManaShankaraVaraPrasadGaru 🇺🇸🔥
— Shine Screens (@Shine_Screens) January 10, 2026
30,000+ tickets sold already in premiere pre-sales ❤️🔥#MSG Grand Premieres on January 11th 🇺🇸
Overseas by @SarigamaCinemas
Megastar @KChiruTweets
Victory @venkymama@AnilRavipudi #Nayanthara@Shine_Screens… pic.twitter.com/yJCp46BgYs
ఇక సినిమా విషయానికొస్తే, ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటి నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.
'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్- ప్రీమియర్స్‌కు కూడా ఓకే!
వెంకీతో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తా- అనిల్‌తో సినిమా రాఘవేంద్రరావు కోరిక: చిరంజీవి

