చిరంజీవి సినిమాలో తమిళ స్టార్ హీరో- డైరెక్టర్ బాబి ప్లాన్ ఏంటో?
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబో ఈజ్ బ్యాక్- ఈసారి తమిళ హీరోతో ప్లాన్!

Published : October 27, 2025 at 7:46 AM IST
Chiru Bobby Movie : మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ తెరపైకి రానుంది. గతంలో 'వాల్తేరు వీరయ్య' తో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన ఈ జోడీ ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ డ్రామాతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే దీనిపై తాజా సమాచారం ఒకటి వైరల్‌గా మారింది. తమిళ్ స్టార్ హీరో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరి ఆ హీరో ఎవరంటే?
తమిళ స్టార్ కీ రోల్!
'ఊపిరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు హీరో కార్తి. అక్కినేని నాగార్జున- కార్తి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆయన టాలీవుడ్ మరో బిగ్ స్టార్ చిరంజీవి సినిమాలో కీ రోల్ చేయనున్నారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. డైరెక్టర్ బాబి ఈ సినిమాలో ఓ మంచి సపోర్టింగ్ రోల్ రాసుకున్నారట! దానికి కార్తి పక్కాగా సెట్ అవుతారని భావిస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తి మరోసారి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
బాబీ అప్పుడు కూడా
అయితే, చిరు సినిమాలో సపోర్టింగ్ రోల్ పెట్టడం బాబీకి కొత్తేం కాదు. గతంలో ఆయన తెరకెక్కించిన 'వాల్తేరు వీరయ్య'లో రవితేజను చిరంజీవి సోదరుడిగా ఫుల్ లెంగ్త్ రోల్లో చూపించారు. ఈ క్రమంలో ఇప్పుడు కార్తీ పాత్ర ఎలా ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకపోతే దీని పై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రీ- ప్రొడక్షన్ దశలో ఉంది. చిరంజీవి ప్రస్తుతం ఉన్న సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. కాస్ట్, షూటింగ్ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Megastar #Chiranjeevi and director #BobbyKolli project:
— MOHIT_R.C (@Mohit_RC_91) October 27, 2025
Rumours indicate that #Karthi may play an important role in this project, although neither the actor nor the team has issued an official statement yet.
The film is expected to launch soon.#ChiruBobby2 | #Mega158 pic.twitter.com/I33oBxANXT
కార్తి బిజీబిజీగా!
ప్రస్తుతం కార్తి కూడా బిజీబిజీగా ఉన్నారు. ఆయన నెక్స్ట్ రిలీజ్ 'వా వాతియార్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ తర్వాత 'సర్దార్ 2' (సర్దార్ సీక్వెల్), 'మార్షల్' సినిమాలతో ఫుల్ టైట్ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా ఆఫర్ వచ్చింది. మరి ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలి! ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా బ్లాక్‌బస్టర్ అవుతుందా?
చిరంజీవి సినిమాల విషయానికి వస్తే
చిరంజీవి ప్రస్తుతం 'మన శంకర వర ప్రసాద్ గారు', 'విశ్వంభర' సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందు విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. మెగా ఫ్యాన్స్ వీటిపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. చిరంజీవి- బాబి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనుంది. తమన్ సంగీతం అందిచనున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు కార్తీక్ గట్టమనేని చేపట్టనున్నారు.

