కొత్త లుక్‌లో మహేశ్ బాబు - ఫొటో వైరల్- 'వారణాసి' సినిమా కోసమేనా?
క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు- ఈ క్రమంలో రివీలైన కొత్త లుక్- మిల్క్ బాయ్‌గా కనిపిస్తున్న ఫొటో మీరు చూశారా?

Published : December 25, 2025 at 2:48 PM IST
Mahesh Babu New Look : సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'వారణాసి' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న లీకులు లేకుండా జాగ్రత్త పడుతూ షూటింగ్ చేస్తున్నారు. అయితే హీరో మహేశ్ తాజా లుక్ రివీల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ లుక్ ఫుల్ వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
అయితే సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో టైమ్ గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కుటుంబం కోసం ప్రత్యేకించి సమయం కేటాయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన సతీమణి నమ్రత శిరోద్రర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఫొటోకు ఫోజిచ్చారు.
కొత్త లుక్!
ఇందులో మహేశ్ బ్లూ కలర్ హుడీ, క్రీమ్ కలర్ ప్యాండ్ ధరించి ఉన్నారు. తలకు నీలం రంగు క్యాప్ పెట్టుకున్నారు. అయితే మొన్నటిదాకా గడ్డంతో మాస్ లుక్‌లో కనిపించిన మహేశ్ తాజాగా క్లీన్ షేవ్‌లో కనిపిస్తున్నారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటుంది. వారణాసి సినిమా షూటింగ్లో ఉన్న మహేశ్ మొన్నటిదాకా గడ్డం రగ్డ్ లుక్‌లో కనిపించి, ఇప్పుడు సడెన్‌గా క్లీన్ షేవ్ చేసుకోవడంతో ఫ్యాన్స్‌లో ఇంకా ఆసక్తి పెరిగిపోతుంది. అసలు జక్కన్న ఏం ప్లాన్ చేశాడో? అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సినిమా కోసమేనా?
అయితే మహేశ్ కొత్త లుక్ దేనికి సంబంధించిందో మాత్రం తెలియదు. వారణాసి సినిమా కోసమే మహేశ్ ఈ లుక్‌లోకి మారిపోయారా? లేదా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారా? అనేది క్లారిటీ లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఊహించుకుంటున్నారు. వారణాసిలో రుద్ర పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైందేమో అందుకే క్లీన్ షేవ్ చేశాడని కొందరు అంటుున్నారు. ఏదేమైనా మహేశ్ కొత్త మాత్రం సోషల్ మీడియాను చేస్తుంది.
🎄Merry Christmas 🎄
— Team Mahesh Babu (@MBofficialTeam) December 25, 2025
Wishing you love, peace, good health, and joy this festive season. Thank you for all the unwavering love and support.
- Team Mahesh Babu 🤍#MerryChristmas pic.twitter.com/Nag6snL5h2
ప్రకాశ్ రాజ్ కీ రోల్
ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. 'వారణాసి చిత్రంలో అద్భుతమైన షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. నాలో నటుడికి ఉన్న ఆకలిని ఇది తీర్చింది. మహేశ్‌బాబు, రాజమౌళి, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్. మీతో పనిచేయడం ఉత్సాహాన్ని ఇచ్చింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా' అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
ప్రకాశ్ రాజ్- మహేశ్ కాంబో
ప్రకాశ్ రాజ్- మహేశ్ కాంబోకు టాలీవుడ్లో సపరేట్ క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటిదాకా'రాజకుమారుడు', 'ఒక్కడు', 'పోకిరి', 'ఖలేజా', 'దూకుడు', 'సరిలేరు నీకెవ్వరు', 'గుంటూరు కారం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్నింట్లో ప్రకాశ్‌రాజ్ నెగిటివ్ పాత్రల్లో కనిపించగా, మరికొన్నింట్లో పాజిటివ్ రోల్స్ చేశారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ 'వారణాసి'లో మహేశ్ తండ్రిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. దీనికి క్లారిటీ రావాల్సి ఉంది.
Here’s the man you’ll meet in #Varanasi…
— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2025
RUDHRA… pic.twitter.com/SOAUsqQ5bv
వారణాసి విషయానికొస్తే, దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ విజయవంతం అయ్యింది. ఈ ఈవెెంట్లో విడుదల చేసిన 'వారణాసి' టైటిల్ గ్లింప్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. అందులోని విజువల్స్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.
'పులులతో షూట్ చేసేటప్పుడు చెప్పు- వారణాసి సెట్స్‌కు వస్తా'- రాజమౌళితో జేమ్స్ కామెరూన్
మహేశ్, రాజమౌళికి 'జీరో' రెమ్యునరేషన్- 'వారణాసి' రియల్ బడ్జెట్ ఎంతో తెలుసా?

