కృష్ణ మనవడి అల్లరిని మాటల్లో చెప్పలేం- నన్ను చాలాసార్లు చీట్ చేశాడు: రషా థడానీ
మరో 9 రోజుల్లో థియేటర్లలోకి 'శ్రీనివాస మంగాపురం' - ప్రమోషన్స్‌లో మూవీటీమ్ జోరు- జయకృష్ణపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రషా థడానీ

Published : July 21, 2026 at 12:52 PM IST
Rasha Thadani About Jayakrishna : సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. జులై 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ నాటి విశేషాలను హీరోయిన్ రాషా ప్రమోషన్స్‌లో గుర్తుచేసుకున్నారు. సెట్స్‌లో జయకృష్ణ చేసే అల్లరి చెప్పలేమంటూ రషా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంకా ఆమె ఏమేం షేర్ చేసుకున్నారంటే?
సెట్స్‌లో జయకృష్ణ చేసే అల్లరి చెప్పలేం - రషా థడానీ
సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడు దివంగత రమేశ్‌బాబు కుమారుడే జయకృష్ణ. ఈయన ఘట్టమనేని మూడవ తరం నట వారసుడిగా శ్రీనివాస మంగాపురంతో ఇంట్రడ్యూస్ కావడం విశేషం. అయితే సినిమా గురించి జయకృష్ణ చేసే అల్లరి గురించి హీరోయిన్ రషా థడానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జయకృష్ణ చాలా మంచి వ్యక్తి. బయటికి చాలా సైలెంట్‌గా కనిపిస్తాడు. కానీ, సెట్స్‌లో మాత్రం అల్లరి చేసేవాడు. షూటింగ్ సమయంలో మేమిద్దరం బోర్డ్ గేమ్స్ ఆడేవాళ్లం. తను ఎప్పుడూ చీటింగ్ చేసేవాడు' అంటూ నవ్వుతూ రషా థడానీ అన్నారు.
సినిమా గురించి ఆమె మాట్లాడుతూ, తనకు తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో మొదట్లో డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడ్డానన్నారు. కానీ అజయ్ ఆమె ఇబ్బందిని అర్థం చేసుకుని కొన్ని సన్నివేశాలను హిందీలో వివరించేవారని గుర్తు చేసుకున్నారు. ఎమోషన్స్ నేచురల్‌గా రావడం కోసం దర్శకుడు తగినంత సమయం ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో పనిచేయడం చాలా సరదాగా అనిపించిందని రషా ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తన తల్లితో నటించిన రోజులను, ఆనాటి అనుభవాలను తనతో షేర్ చేసుకున్నారని తెలిపారు.
SRINU & MANGA 🫶#JaiKrishnaGhattamaneni and #RashaThadani are coming to surprise you all with an intense and emotional performance ❤️🔥❤️🔥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 21, 2026
Watch #RaaveCheliya lyrical song here! 🎵
-- https://t.co/l5ayDcLBXX#SrinivasaMangapuram GRAND RELEASE IN THEATRES ON JULY 30th🔥
An… pic.twitter.com/PdEuZuMMsQ
నా ఫేవరెట్ సాంగ్ ఇదే!
నటనకు సంబంధించి తన తల్లి ఎలాంటి సూచనలు ఇవ్వలేదని అన్నారు. కానీ తెలుగు సినిమా అనగానే అక్కడ షూటింగ్ చాలా సరదాగా సాగుతుందని చెప్పినట్లు వివరించారు. తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. అలాగే తన తండ్రి అనిల్ థడానీకి ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో స్థిరపడాలని కోరిక ఉందని, తాను ఈ సినిమా చేస్తున్నందుకు ఆయన ఎంతో ఆనందించారని ఈ సందర్భంగా రషా పేర్కొన్నారు. అదే విధంగా ఈ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయని, తనకు మాత్రం 'మంగ మంగ' అనే సాంగ్ బాగా ఇష్టమని వివరించారు. ఇక సినిమాలో 6 పాటలు ఉంటాయని, అన్ని సాంగ్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్ బెస్ట్ ఇచ్చారని తెలిపారు.
10 Days to Experience the Most Beautiful & Intense Love Story of the Season ❤️🔥❤️🔥❤️🔥 #SrinivasaMangapuram GRAND RELEASE WORLDWIDE ON JULY 30th 🔥🔥🔥#RaaveCheliya Song 🎵
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2026
-- https://t.co/l5ayDcM9Nv
An @DirAjayBhupathi Film 💥 #JaiKrishnaGhattamaneni #RashaThadani… pic.twitter.com/QjJ7eYrHGS
ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి డిఫరెంట్ స్టోరీలతో ఆడియెన్స్‌ను అలరించారు అజయ్ భూపతి. అయితే ఈసారి ఆయన ఘట్టమనేని జయకృష్ణ, రషా థడానీని హీరో హీరోయిన్లుగా శ్రీనివాస మంగాపురంతో తెలుగు తెరకు పరిచయం చేయనున్నారు. దీనిపై డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ, ఇది ఓ కొత్త తరహా లవ్‌స్టోరీ అన్నారు. అదే విధంగా ఇందులో ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో జయకృష్ణ, రషా థడానీ బాగా నటించారని ఇరువురినీ ప్రశంసించారు. ఇక ఈ సినిమాను చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తుండగా స్టార్ నిర్మాత అశ్వనీదత్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
స్టార్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వైజయంతీ మూవీస్
మరోవైపు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సూపర్స్టార్లను అందించిన ఖ్యాతి వైజయంతీ మూవీస్ బ్యానర్‌కు దక్కుతుంది. ఎందుకంటే 'రాజకుమారుడు' తో మహేశ్, 'స్టూడెంట్ నెం.1'తో జూనియర్ ఎన్టీఆర్, 'చిరుత'తో రామ్‌చరణ్, 'గంగోత్రి' తో అల్లు అర్జున్ వెండితెరకు హీరోలుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరంతా పాన్ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ సంస్థ ద్వారానే జయకృష్ణ సైతం పరిచయం కావడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి బాబాయ్ మహేశ్ బాబులాగా ఫస్ట్ మూవీతోనే ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తారో? వేచి చూడాలి.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో- సెన్సేషనల్ డైరెక్టర్‌తో డెబ్యూ
ఘట్టమనేని జయకృష్ణ సినిమా టైటిల్ రిలీజ్- ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ పోస్టర్

