ETV Bharat / entertainment

పెద్దిలో మూడు ఆటలు- తెలుగు ప్రేక్షకులకు కిక్ ఇచ్చిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలివే!

విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ పెద్ది సినిమా- పెద్దిలో మూడు ఆటలు- గతంలో టాలీవుడ్​లో స్పోర్ట్స్ బ్యాక్​డ్రాప్​లో వచ్చిన సినిమాలు ఇవే!

Peddi Movie
Peddi Movie (Source : Movie Poster)
author img

By ETV Bharat Telugu Team

Published : June 3, 2026 at 9:43 PM IST

4 Min Read
Choose ETV Bharat

Sports Backdrop Movies : వెండితెర మీద హీరో విలన్ల మధ్య జరిగే పోరాటాల కంటే గ్రౌండ్​లో ఆడే ఆటను చూస్తే వచ్చే కిక్ చాలా డిఫరెంట్​గా ఉంటుంది. ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోబెట్టి ఉత్కంఠ రేపడంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు సాటి మరొకటి లేదు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా ఆటల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎన్నో ఘన విజయాలను సాధించాయి. ఇప్పుడు అలాంటి ఒక భారీ అంచనాలు ఉన్న రామ్​చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో చెర్రీ స్పోర్ట్స్ అథ్లెట్​గా కనిపించనున్నారు. ఈ క్రమంలో పెద్ది సినిమా ఇప్పుడు టాలీవుడ్​లో మరోసారి స్పోర్ట్స్ డ్రామాలను గుర్తు చేస్తోంది. మరి తెలుగులో ఇప్పటిదాకా స్పోర్ట్స్ బ్యాక్​డ్రాప్​లపై వచ్చిన సినిమాలపై ఒక లుక్కేద్దామా?

మూడు ఆటలతో వస్తున్న పెద్ది
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్​చరణ్- జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ 1980ల కాలం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పల్లెటూరి వాతావరణంలో సాగుతుంది. ఇందులో చరణ్, పెద్ది పాత్రలో భిన్నమైన ఆటలు ఆడే క్రాసోవర్ అథ్లెట్​గా కనిపించనున్నారు. క్రికెట్, కుస్తీ, రన్నర్​గా మూడు ఆటల్లో పెద్ది సత్తా స్క్రీన్​పై చూపించనున్నారు. అందులో కుస్తీ ఎపిసోడ్స్ కిక్ ఇచ్చేలా, రన్నింగ్ రేస్​ సన్నివేశాలు ఏమోషన్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఊరి కోసం దిల్లీ దాకా పెద్ది తన ఆటతో ఎలా వెళ్లాడు అనే ఓలా బలమైన స్టోరీ లైన్​తో ఈ కథ ఉండనుంది.

తమ్ముడు, ఒక్కడు సృష్టించిన సెన్సేషన్
తెలుగులో క్రీడల నేపథ్యంలో వచ్చిన ఆల్ టైమ్ బెస్ట్ సినిమాల్లో పవన్ కల్యాణ్ 'తమ్ముడు' సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్​గా నిలిచింది. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ అప్పట్లో యూత్​కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'ఒక్కడు' సినిమా కబడ్డీ నేపథ్యంలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. యాక్షన్, లవ్ స్టోరీ మాత్రమే కాకుండా కబడ్డీ ఆటను కథలో బలంగా చూపించిన విధానం ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్‌గా నిలబెట్టింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి.

రగ్బీ ఆటతో నితిన్ 'సై', నాని 'భీమిలి కబడ్డీ జట్టు'
అప్పటి వరకు పెద్దగా పరిచయం లేని రగ్బీ ఆటను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత దర్శకుడు రాజమౌళికి దక్కుతుంది. నితిన్ హీరోగా 2004లో వచ్చిన 'సై' సినిమా రగ్బీ ఆట నేపథ్యంలో ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. యాక్షన్ కు ఆటను జోడించి తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత నాని హీరోగా పల్లెటూరి కబడ్డీ నేపథ్యంలో వచ్చిన 'భీమిలీ కబడ్డీ జట్టు' కూడా ప్రేక్షకులను ఎమోషనల్​గా ఆకట్టుకుంది. ఒక సాధారణ పల్లెటూరి కుర్రాళ్లు కబడ్డీ మీద ఉన్న పిచ్చితో పడే కష్టాలను ఈ సినిమాలో చాలా సహజంగా చూపించారు.

కన్నీళ్లు పెట్టించిన ఎమోషనల్ 'జెర్సీ'
క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో నాని 'జెర్సీ' ఒక క్లాసిక్​గా నిలిచిపోతుంది. వయసు మళ్లిపోయిన ఒక క్రికెటర్ తన కొడుకు కోసం మళ్లీ బ్యాట్ పట్టి గ్రౌండ్​లోకి దిగే కథ అందరి మనసులను కదిలించింది. స్పోర్ట్స్ డ్రామాలో కేవలం గెలుపు ఓటములే కాకుండా దాని వెనుక ఉండే ఎమోషన్, కుటుంబ బాధ్యతలను దర్శకుడు గౌతమ్ అద్భుతంగా తెరకెక్కించాడు. కష్టాలు ఎదురైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించింది. అందులో ఉండే రైల్వేస్టేషన్ సీన్ ఇప్పటికి సోషల్ మీడియాలో మీమ్ గా వైరల్ అవుతుంటోంది. 2019లో వచ్చిన ఈ సినిమా క్లీన్ హిట్​గా నిలిచింది.

వెంకీ 'గురు', శ్రీహరి 'భద్రాచలం'
మహిళల బాక్సింగ్ నేపథ్యంలో విక్టరీ వెంకటేశ్ నటించిన 'గురు' సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఒక కోపదారి కోచ్ తన శిష్యురాలిని ఎలా ఛాంపియన్ గా మార్చాడు అనే అంశాన్ని ఈ సినిమాలో ఎంతో స్ఫూర్తిదాయకంగా చూపించారు. అలానే రియల్ స్టార్ శ్రీహరి హీరోగా వచ్చిన 'భద్రాచలం' సినిమా కూడా అప్పట్లో పెద్ద హిట్. తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు క్రీడాభిమానులను కూడా ఆకట్టుకుంది. ఒక పల్లెటూరి యువకుడిలో ఆట పట్ల ఉన్న డెడికేషన్ ను ఈ సినిమాల్లో స్పష్టంగా చూపించారు.

మజిలీ మ్యాజిక్
అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన 'మజిలీ' సినిమా కూడా క్రికెట్ నేపథ్యంతోనే మొదలవుతుంది. లోకల్ క్రికెట్ ఆడే ఒక కుర్రాడు ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రేమ కథ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆటతో పాటు బరువైన ఎమోషన్స్ ఉండటంతో ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టింది. ఇలా తెలుగులో స్పోర్ట్స్ నేపథ్యంతో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు కుస్తీ క్రికెట్ రన్నింగ్ లాంటి బ్యాక్ డ్రాప్స్ లో రాబోతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా ఆ హిట్ లిస్ట్​లో చేరుతుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.

పెద్ది సినిమా టికెట్​ ధరల పెంపు- ​ఎంతంటే?

'చేతులు విరగొట్టుకోవడమే కాదు- రక్తమైనా చిందిస్తా'- పెద్ది ఈవెంట్​లో రామ్​చరణ్ పవర్ఫుల్ స్పీచ్