ETV Bharat / entertainment

రిషబ్ శెట్టికి బర్త్​డే విషెస్ చెప్పని హోంబలే ఫిల్మ్స్- గ్యాప్ ఏమైనా వచ్చిందా?

రిషబ్​కు హోంబలే ఫిల్మ్స్ బర్త్​డే విషెస్ చెప్పకపోవడం నెటిజన్ల చర్చ - ప్రతి సంవత్సరం వచ్చే విషెస్ రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం

Hombale Films Skips Rishabh Bday Wishes
Hombale Films Skips Rishabh Bday Wishes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 8, 2026 at 10:57 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hombale Films Skips Rishabh Birthday Wishes: 'కాంతార' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్​శెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రిషబ్ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్​తో, విలక్షణమైన నటనతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. అయితే కాంతార చిత్రాలను రూపొందించిన హోంబలే సంస్థ తాజాగా రిషబ్​ శెట్టికి బర్త్​డే విషెష్ చెప్పకపోవడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వీరిద్దరి మధ్య విబేధాలు ఏమైనా ఉన్నాయా అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

కొన్ని నెలల క్రితం హీరో రిషబ్​ శెట్టి తన ఇన్‌స్టాలో తోటి నటీనటులను అన్‌ఫాలో చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను సైతం ఆయన అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు హోంబలే నిర్మాణ సంస్థ రిషబ్​కు బర్త్​ డే విషెస్​ను తెలియజేయలేదు. దాంతో ఇరువురి మధ్య ఏమైనా అభిప్రాయబేధాలు వచ్చాయా? లేక ఏమై ఉంటుందనే దానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం హోంబలే నుంచి రిషబ్​కు బర్త్​డే విషెస్ అందుతున్నాయి. కానీ ఈ సంవత్సరం బర్త్ డే విషెస్ రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇటు రిషబ్, అటు హోంబలే సంస్థ మౌనం వహిస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలకు తెరపడాలంటే అఫీషియల్​గా ఇద్దరిలో ఎవరొకరు క్లారిటీ ఇస్తే గాని తెలియని పరిస్థితి ఉంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం రిషబ్ 'హనుమాన్‌' కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'జై హనుమాన్​'లో నటిస్తున్నారు. దీనితో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్' లోనూ కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలు భిన్నమైన కథాంశాలతో రూపొందుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు

'ఒకేసారి రెండు సినిమాల్లో నటించడం కొంచెం కష్టమైన పనే. రెండింటికీ వేర్వేరు గెటప్​లతో కూడిన లుక్స్ అవసరం. అందుకే ‘జై హనుమాన్’ పూర్తయిన తర్వాతే శివాజీ మహారాజ్ సినిమా చేస్తాను. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా సరే, డైరెక్టర్‌ బాధ్యతలను వదిలిపెట్టను. దర్శకత్వం వహించడం నాకెంతో ఇష్టం. ఆ పని నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. 'రిషబ్ శెట్టి ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ ఏడాది చివర్లో మరో రెండు ప్రాజెక్టులు ప్రకటించబోతున్నాం. నేను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును మంచి చిత్రాల నిర్మాణానికే ఖర్చు పెడతాను' అని స్పష్టం చేశారు.

అలాగే, బెంగళూరులో ఫిల్మ్ సిటీ కావాలనే డిమాండ్‌పై రిషబ్ స్పందించారు. ''ఫిల్మ్ సిటీ లేదనే అసంతృప్తి కన్నడ చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో ఉంది. కానీ, నేను నా సొంతూరు ‘కెరాడి’లో ఒక ‘సినిమా విలేజ్‌’ను సృష్టించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాన్నాను. 'కాంతార చాప్టర్ 1' పనులన్నీ ఎక్కువగా అక్కడే చేశాం' అని ఈ సందర్భంగా రిషబ్​శెట్టి గుర్తు చేసుకున్నారు.

రిషబ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ జై హనుమాన్’ లో భాగమయ్యారు. కొన్ని నెలల క్రితం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆయన హనుమంతుడి పాత్రలో కనువిందు చేయనున్నారు. ఇతిహాసంతో కూడిన సూపర్‌హీరో మూవీ ‘హను-మాన్‌’కు ‘జైహనుమాన్‌’ సీక్వెల్​గా రానుంది. ఈ రెండూ ‘ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగం కావడం గమనార్హం. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంతో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్​పై రవిశంకర్, నవీన్ ఎర్నేని కలిసి నిర్మిస్తున్నారు.

'కాంతార' హీరో ఇంట్రెస్టింగ్​ కామెంట్స్.. పార్ట్​-2 కథ ఇదేనన్న రిషబ్​ శెట్టి!

బాలీవుడ్‌పై రిషబ్‌ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు - ఏం అన్నారంటే?