'స్పిరిట్' షూటింగ్‌పై అప్డేట్- ఈసారైనా సందీప్ మాట నిలబెట్టుకుంటాడా?
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సందీప్ రెడ్డి- కానీ ఇది నిజమయ్యేనా?

Published : November 14, 2025 at 11:46 AM IST
Prabhas Spirit Shooting Update : పాన్ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్- డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న సినిమా 'స్పిరిట్'. ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆడియో గ్లింప్స్ విడుదల చేసి అంచనాలు మరింత పెంచేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుంచి ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉండటం వల్ల 'స్పిరిట్' ఆలస్యం అవుతూ వస్తోంది. అసలు ఎప్పుు మొదలవుతుందోనని క్లారిటీ లేక డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సందీప్ వంగా సినిమా అప్డేట్ షేర్ చేసుకున్నారు.
సందీప్ అప్డేట్
స్పిరిట్ సినిమా షూటింగ్ ఈనెల చివరి వారంలో ప్రారంభం అవుతుందని సందీప్ రెడ్డి వంగా స్వయంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన 'జిగ్రీస్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. పక్కా నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కొంత ఖుషీ అయినా, మరికొందరు మాత్రం ఈసారైనా సాధ్యం అవుతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే?
రానున్న రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని సందీప్ రెడ్డి నమ్మకంగా చెబుతున్నప్పటికీ, ఇక్కడే కొందరు ఫ్యాన్స్‌కు మళ్లీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి ప్రభాస్ బిజీ షెడ్యూలే కారణంగా కనిపిస్తుంది. ఆయన ప్రస్తుతం హను రాఘవపూడి 'ఫౌజీ' సినిమాకు సంబంధించి షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ సీన్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఈనెలలో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. సందీప్ చెప్పినట్లు జరగాలంటే ప్రభాస్ ఇంకో రెండు వారాల్లోనే ఫౌజీ కంప్లీట్ చేసేయాలి. అది సాధ్యం అవుతుందా?
#Spirit Ee Month End Shoot Start Avutundi..
— Absolute KCPD (@AbsoluteKCPD) November 13, 2025
- #SandeepReddyVanga pic.twitter.com/AUmjmNgi5k
ఒకవేళ అయినా, 'స్పిరిట్', 'ఫౌజీ' రెండు డిఫరెంట్ జాన్రా సినిమాలు. అందుకే ఈ రెండు సినిమాల కోసం భిన్నమైన లుక్స్‌లోకి మారాలి. ఈ చిన్న గ్యాప్‌లో ప్రభాస్ మేకోవర్ జరిగే పనేనా అని ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో!
కంటిన్యూ షూటింగ్
కాగా, 'స్పిరిట్'లో ప్రభాస్ పూర్తి భిన్నంగా కనిపించనున్నారు. ప్రభాస్ లుక్ బయటకు రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ గ్యాప్ లేకుండా షూటింగ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అందుకే సందీప్ రెడ్డి చెప్పినట్లుగా ఈనెల లాస్ట్‌లో షూటింగ్ షురూ అవుతుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదికి వాయిదా పడినా పెద్దగా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు!
ఇక సినిమా విషయానికొస్తే, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఆడియో గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను భద్రకాళీ పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
డార్లింగ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్- లేట్‌నైట్‌లో 'స్పిరిట్' ఆడియో గ్లింప్స్ రిలీజ్
బాహుబలి ప్రమోషన్లో ప్రభాస్- డార్లింగ్ కొత్త లుక్ అదుర్స్- వీడియో చూశారా?

