'మా ఇంటి బంగారం' హిస్టారికల్ రికార్డ్- అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన తొలి ఫీమేల్ లీడ్ చిత్రంగా ఘనత
విదేశాల్లోనూ 'మా ఇంటి బంగారం' చిత్రానికి మంచి రెస్పాన్స్- అమెరికాలో భారీ స్థాయిలో వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా రికార్డు- ప్రపంచ వ్యాప్తంగా రూ. 85 కోట్లకు పైగా వసూళ్లు

Published : July 5, 2026 at 12:09 PM IST
Maa Inti Bangaram Set Record Abroad : స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉత్తర అమెరికా బాక్సాఫీసు వద్ద 2 మిలియన్ డాలర్ల వసూళ్లను అధిగమించింది. ఈ మేరకు అక్కడ ఈ సినిమాను విడుదల చేసిన ప్రత్యాంగిర సినిమాస్ సంస్థ ఎక్స్‌లో వెల్లడించింది. కాగా, తెలుగులో సోలో ఫీమేడ్ లీడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం, అమెరికాలో భారీ స్థాయిలో వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నందినిరెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఇందులో ప్రియదర్శి, దిగంత్, రామకృష్ణ, గుల్షన్ దేవయ్య, రాహుల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక, ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే, మహిళా ప్రధాన చిత్రాల విభాగంలో గత రికార్డులన్నింటిని తుడిచిపెడుతూ, అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఘనత సాధించింది. కాగా, ఈ చిత్రంలో సమంత నటనకు గానూ అగ్రహీరోల నుంచి కూడా సమంతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ALL HAIL THE QUEEN. SAMANTHA'S BOX-OFFICE REIGN 👑🔥#MaaIntiBangaaram NORTH AMERICA GROSS $2M+ and Counting..💥💥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) July 4, 2026
Thank you @TralalaPictures, @himankd, and #RajNidimoru for trusting and believing in us, and for letting us celebrate our love and admiration for @Samanthaprabhu2… pic.twitter.com/1hz4C2v3lt
సినిమా బృందాన్ని ప్రశంసించిన చిరంజీవి
ఇటీవల, ఈ చిత్రాన్ని అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రశంసించారు. మా ఇంటి బంగారం సినిమా చూస్తున్నంత సేపు ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని, ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రధానమైన చిత్రాలు తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమని పేర్కొన్నారు. సమంత నటనని ప్రత్యేకంగా ప్రశంసించారు. చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. ఇటీవల చిత్ర బృందం ఆయన్ను తన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా చిరంజీవి, ఆయన భార్య సురేఖ వారిని అభినందించారు. కథానాయిక సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులకు చీరతోపాటు, కొన్ని కానుకలను అందజేశారు. కాగా, ఈ చిత్రాన్ని దర్శకురాలు నందినీరెడ్డి, తనదైన శైలిలో చక్కగా తెరకెక్కించారని చిరంజీవి పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాల్ని అందంగా మేళవించారని కొనియాడారు. అలాగే, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత, రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్షన్ల సంగతేంటి?
జూన్ 19న రిలీజైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లో రూ.28+ కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇందులో మూడో రోజు భారత్‌లో రూ. 10.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక, వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.41+ కోట్ల కలెక్షన్లు అందుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఓ హీరోయిన్ ఓరియెంటేటెడ్ సినిమాకు ఈ రేంజ్లో వసూళ్లు రావడం విశేషమని చెప్పవచ్చు. ముఖ్యంగా సమంతకు ఇది మంచి కమ్‌బ్యాక్ అనవచ్చు. బాక్సాఫీసు వద్ద వసూళ్లు చూస్తుంటే, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు అర్థమవుతోంది. అయితే ఇక్కడే కథతోపాటు ఆమె నటన, క్రేజ్, స్టార్డమ్ కూడా ఈ కలెక్షన్లకు మరో కారణం అని చెప్పవచ్చు! సమంత స్టార్ ఇమేజ్‌కు ఈ రేంజ్ కలెక్షన్లే నిదర్శనమని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.
ఇక, మా ఇంటి బంగారంతో పాటు మరో అవకాశాన్ని కూడా సమంత తన సొంతం చేసుకున్నారు. ఓటీటీ వేదిక సోనీ వివ్ తమిళంలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తోంది. అందులో సమంత కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మేరకు సోనీ లివ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.
నేషనల్ అవార్డ్స్ లేటెస్ట్ అప్డేట్- వచ్చే వారం కూడా అనౌన్స్మెంట్ డౌటే!
'మా సినిమాను మహాభారతంతో ఎందుకు పోల్చామంటే?'- ఈటీవీ భారత్‌తో అఖిల్ అక్కినేని ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

