అనిల్ రావిపూడి స్ట్రాటజీని ఫాలో కానున్న బాబీ- చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి బాబీ సినిమా అప్డేట్- మూవీలో స్పెషల్ గెస్ట్ రోల్- ఆ రోజే పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్!

Published : January 19, 2026 at 1:33 PM IST
Chiranjeevi Bobby Movie Update : 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నారు అగ్ర కథనాయకుడు చిరంజీవి. సంక్రాంతి బరిలో ఫుల్ కాంపిటీషన్లో వచ్చినప్పటికి ఈ సినిమా భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 2026లో బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్ను అందుకున్న మొదటి సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు 158వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాపై ఓ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'మన శంకర వరప్రసాద్' గారు సినిమాలో చిరు- వెంకీ కాంబో ఎక్కువగా అలరించింది. వెంకటేష్ గెస్ట్ రోల్లో నటించడం ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో తాను తెరకెక్కించనున్న సినిమాలోనూ బాబీ ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈ చిత్రంలో గెస్ట్ రోల్ ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఆ స్పెషల్ రోల్లో ఓ యంగ్ హీరో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో ఆ యువ హీరో సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనప్పటికి ఆ పాత్రలో ఏ హీరో నటించనున్నరనేది సస్పెన్స్‌గానే ఉంది. దీనిపై త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.
To the pride of Indian cinema and the heart of millions -
— Bobby (@dirbobby) August 22, 2025
Happy Birthday to our beloved Annayya, the Mighty Megastar @KChiruTweets Garu! ❤️#ChiruBobby2 Concept Poster releasing this evening @ 5.13PM.
Stay tuned for more magic! 😎🤟#HBDMegastarChiranjeevi pic.twitter.com/Vrg1jnstrE
అప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్!
చిరంజీవి హీరోగా బాబీ ఇప్పటికే 'వాల్తేర్ వీరయ్య' తెరకెక్కించారు. 2023 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మంచి విజయం దక్కించుకుంది. అయితే ఈ సినిమాలోనూ బాబీ స్పెషల్ రోల్ రాసుకున్నారు. ఇందులో చిరుకు తమ్ముడిగా స్టార్ హీరో రవితేజ కీలక పాత్ర పోషించారు. ఇది సూపర్ సక్సెస్ అయ్యింది. అయతే ఇది ఫుల్ లెంగ్త్ రోల్. కానీ ఇప్పుడు తన అప్‌కమింగ్ సినిమాలో గెస్ట్ రోల్ ఉంచాలని బాబీ డిసైడ్ అయినట్లు తెలిసింది.
Time truly flies as our #WaltairVeerayya completes 3 years. ❤️
— Bobby (@dirbobby) January 13, 2026
It was a true privilege to work with Annayya, Megastar @KChiruTweets Garu and my dear Mass Maharaja @RaviTeja_offl Garu together on this special project. 🙌
Heartfelt thanks to Rockstar @ThisIsDSP, my producers… pic.twitter.com/LFu6ESpQqi
మాస్ అవతార్‌లో చిరు
ఈ సినిమా విషయానికొస్తే, జనవరి 25న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో దర్శకుడు బాబీ సరికొత్త స్టోరీని రాసుకున్నరట. ఈ సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను గతేడాది చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. దీంట్లో రక్తంతో తడిసిన ఓ గొడ్డలిని చూపిస్తూ, సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయనున్నామని అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్‌ను పెట్టారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించనున్నట్లు బజ్ కొనసాగుతోంది.
Feeling blessed to collaborate with the one and only Megastar @KChiruTweets garu for the 2nd time 🙏❤️ #Mega158 is going to be a RAMPAGE in every aspect. 🔥🔥
— Bobby (@dirbobby) August 22, 2025
Thrilled to share this MASSIVE journey with all the fans!
HBD MEGASTAR - THE BLOODY BENCHMARK!! 🪓💥… pic.twitter.com/r37Ke6q1zo
వచ్చే ఏడాది విడుదల
కాగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్‌గా ఉంటాయని సమాచారం. ఇక స్టోరి కూడా డిఫెరెంట్‌గా ఉంటుందట. అయితే గతంలో (2023) చిరు, బాబీ కాంబీనేషన్‌లో 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్దకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమాలకు సంక్రాంతి పండగ కలిసొస్తుందన్న ఉద్దేశంతో ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి టైంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
హెయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డ్
కాగా, ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'మన శంకర వరప్రసాద్ గారు' గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాకు సూపర్‌హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.292 కోట్ల (గ్రాస్) అందుకుంది. ఒకట్రెండు రోజుల్లోనే ఇది రూ.300 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చిరు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు కొట్టింది. లాంగ్ రన్లో కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.
Every theatre, every centre..
— Shine Screens (@Shine_Screens) January 19, 2026
Every region and every heart…
THE SWAG KA BAAP has conquered everything 😎
₹292+ crores Gross in the FIRST WEEK for #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
ALL TIME RECORD FOR A REGIONAL FILM 💥💥💥#MegaSankranthiBlockbusterMSG enters into BLOCKBUSTER… pic.twitter.com/AaBGtzHDQh
Waltair Veerayya Movie Review: 'వాల్తేరు వీరయ్య' మూవీ ఎలా ఉందంటే ?

