ETV Bharat / entertainment

'ది ప్యారడైజ్' మూవీ మళ్లీ వాయిదా! - ఆ వీడియోతో హింట్ ఇచ్చారా?

ప్యారడైజ్ విడుదల విషయంలో కొత్త ప్రచారాలు- మళ్లీ పోస్ట్​పోన్ అవుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా రూమర్లు- ఆ వీడియోలో హింట్ ఇచ్చారా?

Rumors on Paradise Postponement
Rumors on Paradise Postponement (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 22, 2026 at 10:38 AM IST

3 Min Read
Choose ETV Bharat

Paradise Release Postpone : నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న చిత్రం ది ప్యారడైజ్. ఇది పాన్ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్​లో హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా? అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఆగస్టు 21న సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే చెప్పినా, ఇది మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా తాజాగా రిలీజైన గ్లింప్స్​తో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

ఈ సినిమాలో నెగిటివ్ రాఘవ్ జుయల్ రోల్​ను మేకర్స్ ఇటీవల పరిచయం చేశారు. ఓ గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఈయన పోషిస్తున్న పాత్రను విక్రమ్ మాలిక్​గా చూపించారు. అయితే ఒకసారి విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యాక, మేకర్స్ ఏ ప్రమోషనల్ కంటెంట్ వదిలినా, అందులో రిలీజ్ డేట్ మెన్షన్ చేస్తారు. కానీ ఈ విక్రమ్ మాలిక్ గ్లింప్స్​లో ఎక్కడ కూడా విడుదల తేదీ కనిపించలేదు. దీంతో సినిమా పోస్ట్​పోన్​పై మేకర్స్ ఇలా హింట్ ఇచ్చారేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ, దీనిపై నిర్మాణ సంస్థ నుంచే క్లారిటీ రావాలి!

షూటింగ్ బ్యాలెన్స్!
సినిమాకు సంబంధించి ఇంకా 30 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్​కు మరికొంత టైమ్ పడుతుంది. ఈ లెక్కన ఆగస్టులో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో డిసెంబర్​కు పోస్ట్​పోన్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పడాలంటే మాత్రం మూవీటీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

వాస్తవానికి ఈ చిత్రం 2026 మార్చి 26నే రిలీజ్ కావాల్సి ఉంది. ఈ విడుదల తేదీని మేకర్స్ గతేడాదే ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో పోస్ట్​పోన్ చేశారు. మార్చి నుంచి ఆగస్టుకు మార్చారు. ఇప్పుడు ఆగస్టులో కూడా కష్టమేనని ఏకంగా డిసెంబర్​కు షిఫ్ట్ కానుందని సమాచారం.

మేకింగ్​లో నో కాంప్రమైజ్
సినిమా మేకింగ్ విషయంలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని హీరో నానినే స్వయంగా పలు సందర్భాల్లో చెప్పాడు. ఆ విధంగా చూస్తే ప్రతి ఒక్క సీన్​ పర్ఫెక్ట్​గా రావడానికి మూవీటీమ్ మొత్తం ఎంతో కష్టపడుతున్నారు. కానీ ప్యారడైజ్ అభిమానులకు మాత్రం సినిమా వాయిదా పడడం ఒకింత నిరాశే.

ఆయా షేర్ @177
ఇక ఈ చిత్రంలో నుంచి ఇప్పటికే రిలీజైన 'ఆయా షేర్' అనే సాంగ్​ యావత్ సినీ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తోంది. ఇందులో లిరిక్స్, మ్యూజిక్​కు ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారు. ఇప్పటికే ఈ పాటకు యూట్యూబ్​లో 177 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా యువత నాని చేసిన హుక్​ స్టెప్​కు లక్షల్లో రీల్స్ చేస్తున్నారు.

39 ఏళ్ల తర్వాత విలన్​గా కలెక్షన్​ కింగ్
మరోవైపు ఈ సినిమాకు ఇంత బజ్ క్రియేట్ మరో ప్రధాన కారణం కలెక్షన్ కింగ్ మోహన్​బాబు. కెరీర్ ప్రారంభం​లో ఆయన విలన్ పాత్రలే ఎక్కువగా పోషించారు. కానీ ఆ తర్వాత హీరో పాత్రలతో అసెంబ్లీ రౌడీ, పెద్దరాయుడు, తదితర చిత్రాలతో విశేషంగా అలరించారు. ఆ తర్వాత ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాడదపా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయన స్థాయి సినిమాలు రాలేదనే చెప్పాలి. అయితే ప్యారడైజ్​తో మాత్రం ఆ ఖాళీని భర్తీ చేస్తారని ఆయన స్పెషల్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశారు. శికంజ మాలిక్ అనే పవర్​ఫుల్ విలన్ పాత్రను మోహన్​బాబు పోషిస్తుండటంతో అందరిచూపు ఈ చిత్రంపై పడింది.

విలనిజానికి ఫ్యాన్ బేస్
ఆయన విలన్ పాత్రను పోషిస్తుండటం ఒక కారణమైతే, మరొకవైపు అప్పట్లో పోషించిన విలన్ పాత్రలు ఎంతో ఫేమస్ కావడమే మరో ప్రధాన కారణం. కొదమ సింహం, సర్దార్ పాపారాయుడు, కూలీ నెంబర్1 తదితర చిత్రాల్లో తనదైన డిఫరెంట్​ స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీతో విలనిజంలో తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. హీరోగా మోహన్​బాబు ఎంత సక్సెస్ అయ్యారో, దానికి ఏ మాత్రం తగ్గకుండా అదే స్థాయిలో విలన్​గా పోషించిన పాత్రలకు అంతే పేరొచ్చింది. దాంతో మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వాటన్నింటినీ తలదన్నే విధంగా మోహన్​బాబును ఇంకెంత కొత్తగా చూపిస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

'ప్యారడైజ్'లో మరో విలన్!- మోస్ట్ వైలెంట్​గా 'ఛోటా మాలిక్'- జడల్​తో యాక్షన్​ సీన్స్​కు విజిల్స్ పక్కా!

నాని 'ప్యారడైజ్'​పై 'ధురంధర్' నిర్మాత ఫోకస్!- పాన్ఇండియా లెవల్ ప్లాన్ వర్క్​ అవుతుందా?