బాహుబలి ప్రమోషన్లో ప్రభాస్- డార్లింగ్ కొత్త లుక్ అదుర్స్- వీడియో చూశారా?
ప్రభాస్ బిజీ షెడ్యూల్‌లోనూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ వీడియో రిలీజ్ !

Published : October 27, 2025 at 9:35 AM IST
Prabhas New Looks : రెబల్ స్టార్ ప్రభాస్ బిజీ షెడ్యూల్ ఏంటో అందరికీ తెలుసు! ప్రస్తుతం 'రాజా సాబ్', 'ఫౌజి', 'స్పిరిట్' వంటి భారీ లైనప్‌తో దూసుకెళ్తున్నారు. అయితే ఇలా వరుస షూటింగుల్లో బిజీగా ఉన్నా బయటకు మాత్రం ప్రభాస్ లుక్ రివీల్ అవ్వలేదు. రాజాసాబ్ ట్రైలర్లో వింటేజ్ డార్లింగ్‌ను చూసినా, అది మూవీ క్యాస్టూమ్స్ లుక్. కానీ తాజాగా బాహుబలి టీమ్ రిలీజ్ చేసిన ఓ వీడియోలో ప్రభాస్ లేటెస్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. అది చూసిన ఫ్యాన్స్ తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో షేర్ చేసుకుంటున్నారు. మరి అంతగా ఆ వీడియోలో ఏముందంటే!
ప్రమోషన్స్!
అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రైలర్లను మేకర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల చేశారు. అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ బుక్సింగ్స్ మొదలైపోయాయి. అలానే ఇండియాలో కూడా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే బాహుబలి ది ఎపిక్ సినిమాను థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయమని వీడియోలో పేర్కొన్నారు. 'అక్టోబర్ 31న బిగ్ స్క్రీన్స్‌లో బాహుబలి ది ఎపిక్ సినిమాను చూసి కొత్త అనుభూతి పొందండి' అంటూ వీడియోలో చెప్పారు.
The King returns! 👑
— Baahubali (@BaahubaliMovie) October 26, 2025
Our BAAHUBALI, #Prabhas invites you back into the world of Maahishmati ❤️🔥❤️🔥❤️🔥
For the first time ever, witness both parts of this legendary saga united as One Epic Film. #BaahubaliTheEpic releasing on October 31st. 🔥
International Premieres on Oct 29th💥… pic.twitter.com/isCpP2xW0t
ఈ వీడియోలో ప్రభాస్ లుక్స్ చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు! ఆ డాషింగ్ స్టైల్, కూల్ అటిట్యూడ్, మాస్ ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ ప్రస్తుతం ప్రభాస్ లుక్స్‌తో డామినేట్ చేస్తున్నాడు అనిపించేలా ఉంది! డై హార్ట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ వీడియో క్లిప్‌తో నిండిపోయింది.
ఫ్యాన్స్ డీకోడింగ్ మోడ్ ఆన్!
ప్రభాస్ కొత్త లుక్ రివీల్ కావడంతో ఆయన స్పిరిట్ కోసం రెడీ అవుతున్నారంటూ ఫ్యాన్స్ డీకోడింగ్ చేయడం మొదలు పెట్టేశారు. ఇది ఏ సినిమా? ఏ క్యారెక్టర్? బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న సీన్ ఏంటి? అని ఫ్యాన్స్ డీకోడింగ్ స్టార్ట్ చేశారు. ఒకరు "ఇది స్పిరిట్ లుక్ కచ్చితంగా!" అంటే మరొకరు "లేదు రాజా సాబ్ స్టైల్!" అంటూ డిబేట్ మొదలు పెట్టారు. ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా డార్లింగ్ లుక్స్ ట్రెండింగ్! ఏది ఏమైనా ప్రభాస్ ఒక్క వీడియోతో టాలీవుడ్ ఫోకస్ మొత్తం ఆయన మీదకి తిప్పేశారు!

