రూ.200 కోట్ల క్లబ్లో ఇరుముడి- రవితేజ కెరీర్లోనే హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీ
బాక్సాఫీస్ వద్ద ఇరుముడి ర్యాంపేజ్ - రూ.200 కోట్ల క్లబ్లో చేరిన మూవీ- రవితేజ కెరీర్లోనే హైయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్

Published : September 2, 2026 at 3:38 PM IST
|Updated : September 2, 2026 at 3:44 PM IST
Irumudi Collections : రవితేజ ఇరుముడి మరో అరుదైన ఘనత సాధించింది. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా తాజాగా రూ.200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అన్ని థియేటర్లలో ఇరుముడి సంబరాలు కొనసాగుతున్నాయని, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా అందరూ సినిమాను ఆదరిస్తున్నారని మేకర్స్ రాసుకొచ్చారు. దీనిని జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా పేర్కొన్నారు. ఈ క్రమంలో మేకర్స్ సక్సెస్ సంబరాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
సీక్వెల్లో రామ్‌చరణ్ ఉంటారా?
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇప్పటిదాకా సీక్వెల్ రాలేదు. ఒకవేళ ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తే, ఇందులో రామ్‌చరణ్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అని నిర్మాతలకు మీడియా ప్రశ్న అడిగింది. దీనికి జవాబుగా 'చరణ్ మాతో సినిమా చేస్తా అంటే అంతకన్నా ఆనందం మాకు ఇంకేం ఉంటుంది? అయినా దీనికి ఆన్సర్ మా డైరెక్టర్ శివ ఇస్తారు' అని ప్రొడ్యూసర్ రవి శంకర్ అన్నారు. 'ఏదైనా నేచురల్‌గా జరిగితే బాగుంటుంది. ఆయనను ఇందులో ఇన్వాల్వ్ చేయాలని మాకు ఎలాంటి ఐడియా రాలేదు. అలాంటిది జరిగితే నిజంగా అద్భుతమే. కానీ అలా జరగలేదు. ఫాదర్ అండ్ డాటర్ అనే చిన్న స్టోరీ లైన్‌తో ఈ సినిమా మొదలైంది. ఇప్పటికైతే సీక్వెల్ అనుకోలేదు' అని దర్శకుడు చెప్పారు.
పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ
అలాగే కలెక్షన్ల గురించి తెలుపుతూ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ వెనుకున్న కథను నివనిర్వాణ షేర్ చేసుకున్నారు. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చేసిన తొలి షాట్ ఇదే అని చెప్పారు. బేబి నక్షత్రకు అయ్యప్ప స్వామి గెటప్ వేసి, రవితేజ- ప్రియా భవానితో కలిసి తీసిన తొలి షాట్ అని తెలిపారు. ఇది సినిమాలో రాకపోయినా, మూవీ సక్సెస్ అయ్యాక ఈ ఫొటో రివీల్ చేద్దామని తాను అప్పుడే అనుకున్నట్లు పేర్కొన్నారు.
Every generation. Every theatre. One celebration. #Irumudi 💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2026
From kids to elders, from youth to families.... everyone celebrated #Irumudi, making it a 200 CR+ GROSS WORLDWIDE
GENERATIONAL BLOCKBUSTER 🔥
✨స్వామి శరణం✨
Go watch RAVANNA’s RAMPAGE in cinemas ❤️🔥… pic.twitter.com/bnao86ph3i
శివనిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 21న వరల్డ్‌వైడ్‌గా రిలీజైంది. తొలి షో నుంచే దీనికి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. అలా గత 12 రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటిదాకా రూ.200 కోట్ల పైచిలుకు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో ప్రియ భవాని శంకర్, బేబి నక్షత్ర కీలక పాత్రలు పోషించారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది.
కెరీర్లో హైయ్యెస్ట్
ఈ సినిమాతో హీరో రవితేజ కూడా అరుదైన ఘనత సాధించారు. తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి రూ.200 కోట్ల క్లబ్లో చేరారు. ఇంతకుముందు 2022లో వచ్చిన ధమాకా సినిమానే రవితేజ కెరీర్లో కమర్షియల్‌గా భారీ హిట్. ఇప్పుడు ఆ రికార్డులను తుడిచిపెడుతూ ఇరుముడి సరికొత్త మార్క్ సెట్ చేసింది. దీంతో ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమానూ నిలిచింది.
'ఆజాద్ హింద్ ఫౌజ్'- OG యూనివర్స్ నుంచి గ్లింప్స్ ఔట్
పవర్ స్టార్ నుంచి పవర్లోకి- రాజకీయాలతో పాటు సినిమాలు! పవన్ కల్యాణ్ ప్రయాణం సాగిందిలా

