'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌కు అన్నదానం- రష్మిక ట్వీట్!
విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా పెళ్లి సంబరాలు- దేశవ్యాప్తంగా అభిమానులకు స్వీట్లు, అన్నదానం- విరోష్ జంట మంచి మనసు!

Published : March 1, 2026 at 12:12 PM IST
Rashmika - Vijay Annadhanam : విజయ్ దేవరకొండ- రష్మిక మంధన్నా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమ మంచి మనసు చాటుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ అభిమానులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రష్మిక అఫీషియల్‌గా ప్రకటిస్తూ, సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు. దీనిపై ఫ్యాన్స్ హర్షం చేస్తున్నారు. విరోష్ జంట మంచి మనసును మెచ్చుకుంటున్నారు.
'ప్రియమైన దేశ ప్రజలారా! మీరంతా మా కెరీర్, ప్రేమ ప్రయాణాల్లో ఎల్లప్పుడూ భాగమయ్యారు. మీ అందరితో మా వివాహాన్నిసెలబ్రేట్ చేసుకోవడం మాకు నిజంగా సంతోషంగా ఉంది. అయితే ప్రతీ పండగను భారత్ మిఠాయిలు, ఆహారంతో సంబరంగా జరుపుకుంటుంది కదా. అందుకే మా జీవితంలో ఈ ఆనంద క్షణాలను మీతో జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న మీ అందరికీ ఈరోజు (మార్చి 01) ఎంతో ప్రేమతో మిఠాయిలు పంపుతున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ, దేశంలో పలు నగరాల్లోని దేవాలయాల్లో అన్నదానం చేస్తున్నాం. మీ విజయ్- రష్మిక' అని రష్మిక పేర్కొన్నారు.
విరోష్ మిఠాయి పంపకం, అన్నదానం నిర్వహించే నగరాలు
తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ నగరాలతోపాటు అంధ్రప్రదేశ్‌లో వైజాగ్, పుట్టపర్తి, విజయవాడల్లో నిర్వహిస్తున్నారు. వీటితోపాటు దిల్లీ, చండీగఢ్, నోయిడా, ఘజియాబాద్, అహ్మదాబాద్, భోపాల్, ముంబయి, జైపుర్, కొచ్చి, మైసూర్, కూర్గ్, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, పుదుచ్చేరి
— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవాలయాల్లో అన్నదానం
- హైదరాబాద్- హరేకృష్ణ హెరిటేజ్ టెంపుల్, చింతపల్లి సాయిబాబా దేవాలయం
- కరీంగనర్ - శ్రీ సాయికృప బాలాజీ మందిరం
- మహబూబ్‌నగర్- మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం
- విశాఖ- శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేావాఆలయం
- విజయవాడ- శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం
కాగా, రష్మిక పుష్ప, యానిమల్, ఛావా వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇవే కాకుండా ఆమె కన్నడలోనూ పలు సినిమాలు చేశారు. దీంతో రష్మికకు ఫ్యాన్ బేస్ బాగానే ఏర్పడింది. ఇక విజయ్ - రష్మిక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు ఇరుకుటుంబాలు, అత్యంత సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరైయ్యారు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను అదే రోజు సాయంత్రం రష్మిక, విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ పోస్టులకు లక్షల్లో లైకులు వచ్చాయి.
Hi my loves,
— Rashmika Mandanna (@iamRashmika) February 26, 2026
Introducing to you now “My Husband”! 💘
Mr. Vijay Deverakonda!! ❤️
The man who taught me what true love feels like,
The man who showed me what being in peace feels like! 🤍
The man who told me everyday that dreaming big was absolutely ok and constantly telling… pic.twitter.com/MPrsGfNTwb
రేపు సొంతఊరికి!
ఉదయ్‌పుర్ నుంచి విరోష్ జంట ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. రేపు విజయ్ దేవరకొండ స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటకు వెళ్లనున్నారు. అక్కడ విజయ్ కొత్త ఫామ్‌హౌస్‌లో గృహప్రవేశం, పూజా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయ్ కొత్త ఇల్లును ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులతోపాటు గ్రామ ప్రజలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
గ్రాండ్ రిసెప్షన్
అతికొద్దిమంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్న ఈ జంట హైదరాబాద్‌లో గ్రాండ్ రెసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసింది. మార్చి 04న తాజ్ హోటల్లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్‌కు చెందిన పలుపురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
మోదీకి ఆహ్వానం!
అలాగే ప్రధాని నరేంద్రమోదీకి విజయ్- రష్మిక రిసెప్షన్ ఆహ్వానం అందించారు. ఈ క్రమంలోనే ఆయన ఆశ్వీర్వాదం తీసుకున్నారు. మోదీతోపాటు కేంద్ర హోమంత్రి అమిత్ షాకు కూడా విరోష్ ఆహ్వానం అందించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Meeting Honourable Prime Minister @narendramodi sir and spending time talking about our culture and history was so special.
— Rashmika Mandanna (@iamRashmika) February 28, 2026
The sweetest surprise was the thoughtful letter he wrote to my parents ❤️
Some moments just stay with you forever.. pic.twitter.com/bBAofLgw4i
'విరోష్' పెళ్లి నగల కోసం 10నెలల కష్టం- కిలోల కొద్దీ బంగారంతో 'రాజసం'- ఆ జ్యువెలరీ స్పెషాలిటీ తెలుసా?
'మేం ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాం'- రష్మిక మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్

